Home
News

WhatsApp కొత్త అప్‌డేట్‌!! వాయిస్ మెసేజ్ ప్లేబ్యాక్ స్పీడ్ నియంత్రణకు అనుమతి..

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్ యాప్ లలో బాగా పాపులర్ అయిన వాట్సాప్ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో భాగమైన వినియోగదారులకు కొత్త అప్‌డేట్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. ఈ అప్‌డేట్‌ వినియోగదారుల యాక్సిస్ కోసం ఉద్దేశించిన ముఖ్యమైన ఫీచర్ ను తెస్తుంది. ఈ కొత్త అప్‌డేట్‌ వాట్సాప్‌లోని వినియోగదారులకు పంపే వాయిస్ మెసేజ్ల కోసం ప్లేబ్యాక్ వేగాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కొత్త అప్‌డేట్‌ ఆండ్రాయిడ్ యొక్క తాజా బీటా వెర్షన్ 2.21.9.4 లో లభిస్తుంది. అయితే మునుపటి వెర్షన్ 2.21.9.3 కూడా ఈ క్రొత్త ఫీచర్ కి మద్దతును ఇస్తుంది.

బీటా అప్‌డేట్‌

ఫేస్బుక్ యాజమాన్యంలోని అప్లికేషన్ నుండి బీటా అప్‌డేట్‌ స్కీమ్ లో భాగమైన ఏ యూజర్ అయినా ఈ కొత్త ఫీచర్ ను ఉపయోగించుకోగలుగుతారు. ఒకవేళ మీరు దీనిని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు గూగుల్ ప్లేస్టోర్ ద్వారా బీటా పరీక్ష సామర్థ్యం కోసం నమోదు చేసుకోవచ్చు. iOS వినియోగదారులు కూడా యాప్ స్టోర్ ద్వారా యాప్ యొక్క బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ఆడియో ప్లేబ్యాక్ కోసం మూడు వేరియబుల్ స్పీడ్స్

సంస్థ యొక్క నివేదిక ప్రకారం ఈ కొత్త ఫీచర్ ను మొట్టమొదట WABetaInfo గుర్తించింది. వాట్సాప్ ఇప్పుడు కొత్త UI అప్‌డేట్‌తో ఆడియో ప్లేబ్యాక్ కోసం మూడు వేరియబుల్ స్పీడ్‌లను జోడించింది. అందులో భాగంగా బీటా వినియోగదారులు అందుకున్న వాయిస్ మెసేజ్ తో వచ్చే ప్లేబ్యాక్ గుర్తు ద్వారా దీనిని పరీక్షించగలరు. ఆఫర్‌లో ప్లేబ్యాక్ 1x, 2x మరియు 1.5x వంటి మూడు స్పీడ్ లతో లభిస్తుంది.

వాయిస్ మెసేజ్

ప్రారంభంలో వాయిస్ మెసేజ్ యథావిధిగా 1x వద్ద ప్లే అవుతుంది. అయితే వినియోగదారుడికి కొత్తగా అందుబాటులోకి వచ్చిన వేగ నియంత్రణ చిహ్నాన్ని నొక్కినప్పుడు స్పీడ్ మార్చడం ప్రారంభమవుతుంది. ఇది ట్యాప్‌లపై ఆధారపడి ఉంటుంది. ఒక ట్యాప్ వద్ద 1x, రెండవ ట్యాప్ వద్ద వేగం 1.5x కు పెంచుతుంది. అలాగే చివరి మరియు మూడవ ట్యాప్ వద్ద వేగం 2xకు చేరుతుంది. వాట్సాప్ నెమ్మదిగా ఆడియో మెసేజ్ ప్లేబ్యాక్‌ల కోసం ఈ ఎంపికను అందించలేదు అని గమనించండి. iOS వినియోగదారులు ఈ ఫీచర్‌ను ప్రస్తుతానికి పొందలేరు ఎందుకంటే ఈ నిర్దిష్ట అప్‌డేట్‌తో బీటా దశ ఇప్పటికి ఆండ్రాయిడ్ కి పరిమితం చేయబడింది. iOS లభ్యతపై ఎటువంటి వివరణ రాలేదు.

Best Mobiles in India

English summary
WhatsApp New Update‌ For Android!! Permission to Control Voice Message Playback Speed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X