ఈ ఫోన్‌లలో ఇక మీద వాట్సాప్ పనిచేయదు

|

వాట్సాప్‌ అనేది ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. దీని ద్వారా మెసేజ్ లను త్వరగా పంపవచ్చు. ఇవే కాకుండా వీడియో కాల్స్ కూడా చేయవచ్చు. ఇలాంటి ఫీచర్లను కలిగి ఉన్న వాట్సాప్‌ ఒక్కసారిగా పనిచేయదు అంటే మీకు ఎలా ఉంటుంది !!. కానీ ఇది నిజం ఫిబ్రవరి 1,2020 వరకు మాత్రమే ఐఫోన్ లో దీనిని ఉపయోగించవచ్చు. తరువాత కూడా వినియోగించాలి అనుకుంటే ఆండ్రాయిడ్ 10 తాజా వెర్షన్ ను అప్డేట్ చేయాలి.

 IOS 8

ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క తాజా సంస్కరణకు ఎక్కువ కాలం అప్‌గ్రేడ్ చేయని ఐఫోన్ వినియోగదారులకు ఒక చేదు విషయం. ప్రస్తుతం మీరు వాడుతున్న ఐఫోన్ iOS 8 లో ఉంటే కనుక మీరు ఫిబ్రవరి 1, 2020 వరకు మాత్రమే వాట్సాప్‌ను ఉపయోగించగలరు అని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ దాని FAQ పేజీ ద్వారా తెలియజేసింది. IOS 8 లో మీరు ఇకపై వాట్సాప్‌ యొక్క క్రొత్త అకౌంట్ లను సృష్టించలేరు లేదా ఇప్పటికే ఉన్న అకౌంట్ లను యాక్సిస్ చేయలేరు అని కొత్త అప్డేట్ తెలిపింది.

వాట్సాప్

ఉత్తమ అనుభవం కోసం మీ ఫోన్ ను అందుబాటులో ఉన్న iOS యొక్క తాజా వెర్షన్‌ను ఉపయోగించమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము అని వాట్సాప్ తన బ్లాక్ లో తెలిపింది. కాబట్టి ఐఫోన్ వినియోగదారులకు ప్రస్తుతం వాట్సాప్ ను ఉపయోగించడానికి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క తాజా వెర్షన్ అవసరం.

 

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌న్ని సరిగ్గా బ్యాకప్ చేయడం ఎలా?మీ ఆండ్రాయిడ్ ఫోన్‌న్ని సరిగ్గా బ్యాకప్ చేయడం ఎలా?

ఆండ్రాయిడ్
 

ఇంకా ఆండ్రాయిడ్ వెర్షన్లు 2.3.7 మరియు అంతకంటే ఎక్కువ వున్న వినియోగదారులు ఇకపై కొత్త అకౌంట్ లను సృష్టించలేరు. వారు ఇప్పటికే ఉన్న వారి వాట్సాప్ ఖాతాను అకౌంట్ ను కూడా రి-వెరిఫై చేయలేరు. కానీ వినియోగదారులు ఫిబ్రవరి 1, 2020 వరకు వాట్సాప్ యాప్‌ను ఉపయోగించుకోగలుగుతారు.

 

ఆండ్రాయిడ్ 10 అప్డేట్ లో సమస్యలు ఎదుర్కొంటున్న పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లుఆండ్రాయిడ్ 10 అప్డేట్ లో సమస్యలు ఎదుర్కొంటున్న పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు

వాట్సాప్ స్టేటస్ స్టోరీస్

ఇటీవల వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్టేటస్ స్టోరీలను ఫేస్‌బుక్ స్టోరీ మరియు ఇతర యాప్‌లలో నేరుగా పంచుకునేందుకు వీలుగా ఒక ఫీచర్‌ను రూపొందించడం ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే వాట్సాప్ స్టేటస్ స్టోరీలు 24 గంటల తర్వాత ఆటో-మ్యాటిక్ గా అదృశ్యమయ్యే ఫొటోస్ మరియు వీడియోలను మీ ప్రొఫైల్‌లో పోస్ట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తాయి. వాట్సాప్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కాని చాలా మంది వినియోగదారులు దీనిని ట్విట్టర్‌లో తెలిపారు. కాబట్టి ఇప్పుడు వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ తో వస్తున్నది. ఇందులో భాగంగా మీరు మీ వాట్సాప్ లోని స్టోరీస్ ను ఫేస్ బుక్ కు కూడా షేర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
WhatsApp no longer works on these phones from Feb 1, 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X