Home
News

WhatsApp అరుదైన రికార్డు!!! దరిదాపుల్లో మరో సోషల్ మీడియా యాప్ లేదు...

సోషల్ మీడియా యాప్ లు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ వంటివి చాలానే ఉన్నపటికీ ప్రస్తుత రోజులలో ప్రజలు త్వరిత మెసేజ్లను పంపడానికి ఎక్కువగా వాట్సాప్ ను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద వాట్సాప్ లో ప్రతిరోజూ సుమారు 100 బిలియన్ మెసేజ్లను పంపుతున్నట్లు ఫేస్‌బుక్ సంస్థ CEO మార్క్ జుకర్‌బర్గ్ తమ కంపెనీ తాజా త్రైమాసిక ఆదాయాల కాల్‌లో పంచుకున్నారు. గత సంవత్సరం నూతన సంవత్సర వేడుకల్లో వాట్సాప్ రోజుకు 100 బిలియన్ మెసేజ్ల మార్కును దాటింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ లో ఒకరోజులో 100 బిలియన్ల మెసేజ్లు

వాట్సాప్ లో ఒకరోజులో 100 బిలియన్ల మెసేజ్లు

ఫేస్‌బుక్ కంపెనీ యొక్క త్రైమాసిక ఆదాయాల కాల్ సమయంలో CEO మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ ప్రజలు ప్రతిరోజూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫేస్‌బుక్ యాజమాన్యంలోని యాప్ లను ఉపయోగిస్తున్నారు. అలాగే వీటి సేవల్లో 10 మిలియన్లకు పైగా క్రియాశీల ప్రకటనదారులు ఉన్నారని జుకర్‌బర్గ్ తెలిపారు. గత నూతన సంవత్సర వేడుకలు సాధారణంగా వాట్సాప్ మెసేజ్ లలో గణనీయమైన పెరుగుదలను అందుకున్నాయి. 2017 లో నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 63 బిలియన్ మెసేజ్ లు వాట్సాప్ ద్వారా పంపగా, 2018లో 75 బిలియన్లు, గత ఏడాది 100 బిలియన్లకు పైగా మెసేజ్లు పంపబడ్డాయి. అయితే ఇప్పుడు ప్రతిరోజూ సుమారు 100 బిలియన్ మెసేజ్లు ఒకరి నుండి మరొకరికి పంపబడుతున్నాయి.

 

ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ డౌన్‌లోడ్‌లు

ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ డౌన్‌లోడ్‌లు

వాట్సాప్ ద్వారా పంపే మెసేజ్ల సంఖ్యలకు దగ్గరలో మరే ఇతర మెసేజింగ్ సర్వీస్ యాప్ లేకపోవడం గమనార్హం. ఈ సంవత్సరం ప్రారంభంలో వినియోగదారుల మార్కును 2 బిలియన్లకు దాటడం కూడా దీనికి ప్రధాన కారణం. స్టాటిస్టా యొక్క నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరిలో ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ ఐదు బిలియన్ డౌన్‌లోడ్‌లకు చేరుకుంది. ఈ మైలురాయిని సాధించిన రెండవ నాన్-గూగుల్ యాప్ ఇదే.

ఫేస్‌బుక్ మెసెంజర్ & ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ మిక్స్ ఫీచర్

ఫేస్‌బుక్ మెసెంజర్ & ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ మిక్స్ ఫీచర్

ఫేస్‌బుక్ కంపెనీ యొక్క త్రైమాసిక ఆదాయాల కాల్ సమయంలో CEO జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ మెసెంజర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్లను అనుసంధానించే ఇన్‌స్టాగ్రామ్ యొక్క కొత్త అప్ డేట్ కు సంబందించిన వివరాలను కూడా ఇచ్చారు. ప్రారంభ ఫీడ్‌బ్యాక్ ఇప్పటివరకు సానుకూలంగా ఉందని ఫేస్‌బుక్ సీఈఓ తెలిపారు. ఇప్పుడు వాట్సాప్ ఫేస్‌బుక్ షాపులతో వాట్సాప్ బిజినెస్ ఫీచర్‌లను ఏకీకృతం చేయాలని యోచిస్తోంది.

వాట్సాప్ యూజర్ ఫ్రెండ్లీ కొత్త ఫీచర్లు

వాట్సాప్ యూజర్ ఫ్రెండ్లీ కొత్త ఫీచర్లు

వాట్సాప్ యాప్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడానికి వాట్సాప్ కొత్త ఫీచర్లను జోడిస్తోంది. వాట్సాప్ ఇటీవల "ఆల్వేస్ మ్యూట్" ఫీచర్ ద్వారా వినియోగదారులకు చాట్ నోటిఫికేషన్లను ఎప్పటికీ నిశ్శబ్దం చేసే సామర్థ్యాన్ని ఇచ్చింది. ఈ సర్వీస్ "మిస్డ్ కాల్స్‌లో చేరండి" అని కూడా పరీక్షిస్తోంది. ఇది ప్రారంభంలో తప్పిపోయిన తర్వాత కూడా కొనసాగుతున్న కాల్‌లను నేరుగా చేరడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అలాగే బీటా వెర్షన్‌లో బయోమెట్రిక్ లాక్ ఫీచర్ గురించి కూడా పరీక్షిస్తున్నది.

Best Mobiles in India

English summary
WhatsApp Now Delivers 100 Billion Messages in Each Day
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X