వాట్సప్‌పేకి అసలైన సవాల్, అసలు పోటీలో ఉంటుందా ?
Facebookసీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఏప్రిల్ 24వ తేదీ నుంచి వాట్సప్ నుంచి వాట్సప్ పే సేవలు ప్రారంభమవుతాయని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వార్త ద్వారా వాట్సప్ కూడా దేశీయంగా వాలెట్ రంగంలో అతి పెద్ద స
Facebookసీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఏప్రిల్ 24వ తేదీ నుంచి వాట్సప్ నుంచి వాట్సప్ పే సేవలు ప్రారంభమవుతాయని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వార్త ద్వారా వాట్సప్ కూడా దేశీయంగా వాలెట్ రంగంలో అతి పెద్ద సవాల్ విసరబోతుందని కంపెనీ చెప్పకనే చెప్పింది. బిజిట్ పేమెంట్ రంగంలో వాట్సప్ ఇతర వాలెట్లకు గట్టి పోటీ నిస్తుందని పరిశ్రమ వర్గాలు కూడా భావిస్తున్నాయి. మొత్తంగా దేశీయంగా డిజిటల్ పేమెంట్ ఇండస్ట్రీ 2023 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ ని సొంతం చేసుకోనుందని తెలుస్తోంది. అయితే దీనిలో ఆధిపత్యం ఎవరిది ఉండబోతోంది. ఎవరు డిజిటల్ పేమెంట్ రంగంలో సవాల్ విసరనున్నారు ఇలాంటి విషయాలను ఓ సారి విశ్లేషిస్తే..


డిజిటల్ వార్
ఇండియా డిజిటల్ చెల్లింపుల రంగంలో నంబర్ వన్ స్థానం కోసం అమెరికా చైనా దేశాల కంపెనీలు గట్టిగా పోటీపడుతున్నాయి. ఒకవైపు అత్యధిక యూజర్లు ఉపయోగించే అమెరికన్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సప్, మరోవైపు చైనా ఇన్వెస్టర్ల అండ ఉన్న దేశీ చెల్లింపు సేవల దిగ్గజం పేటీఎం మధ్యనే డిజిటల్ పేమెంట్ రంగంలో గట్టి పోటీ ఉండబోతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2014లో ప్రధానిగా మోడీ వచ్చిన తరువాత డీమోనిటైజేషన్ చేసిన సంగతి అందరికీ విదితమే. దీని అనంతరం భారత్‌లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతుండటంతో అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ఇటువైపు దృష్టి సారిస్తున్నాయి.

దిగ్గజాల చూపు ఇండియా వైపే
టెక్ దిగ్గజం గూగుల్ ప్రత్యేకంగా పేమెంట్ యాప్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టగా.. రిటైల్ సంస్థ అమెజాన్ సొంత వాలెట్‌ను ప్రవేశపెట్టింది. వాట్సప్ నుంచి వాట్సప్ పే అలాగే చైనా కంపెనీల పెట్టుబడితో పేటీఎంౌన ఎయిర్ టెల్, జియో పేమెంట్ బ్యాంకులు అలాగే ఫోన్ పే ఇంకా దేశీయ టెలికాం సంస్థలు డిజిటల్ రంగంలో దూసుకుపోతున్నాయి.పరిశ్రమవర్గాల సమాఖ్య అసోచాం, ఆర్‌ఎన్‌సీవోఎస్ సంస్థ అంచనాల ప్రకారం.. దేశీ మొబైల్ వాలెట్ లావాదేవీల విలువ 2016లో రూ.154 కోట్లు. ఇది 2022 నాటికి రూ.275 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. దీంతో ఈ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దిగ్గజాలు పోటీపడుతున్నాయి.

దూసుకుపోతున్న పేటీఎం, గూగుల్ పేలు
పేటీఎం సంస్థ ప్రస్తుతం ఈ విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 30 కోట్ల మందికి పైగా యూజర్లు, 33% మార్కెట్ వాటాతో దేశీయంగా పేటీఎం అతి పెద్ద మొబైల్ పేమెంట్ కంపెనీగా నిలుస్తోంది. టెక్ దిగ్గజం గూగుల్ నెమ్మదిగా ఈ విభాగంలో ముందుకెళుతోంది. 2017 సెప్టెంబర్‌లో ఈ సంస్థ గూగుల్ పే పేరుతో పేమెంట్స్ సర్వీస్‌ను ప్రారంభించింది. నెలవారీ క్రియాశీలకంగా ఉండే యూజర్ల సంఖ్య ఏడాది క్రితం 1.4 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి ఇది 4.5 కోట్లకు చేరింది.

వాట్సప్ vsపేటీఎం
వాట్సప్ కూడా భారత్‌లో భారీగా పేమెంట్ సేవలను విస్తరించాలని భావిస్తోంది. భారత్‌లో ప్రస్తుతం సుమారు 30 కోట్ల మంది పైగా వాట్సప్ యూజర్లున్నారు. ఈ యూజర్లే కాకుండా రాజకీయ పార్టీలు సైతం వాట్సప్ ను ఉపయోగిస్తుండటంతో చెల్లింపుల మార్కెట్లో సత్తా చాటాలని వాట్సప్ భావిస్తోంది. అయితే, చైనాకి చెందిన ఆలీబాబా గ్రూప్ అండ ఉన్న దేశీ పేమెంట్ సర్వీసుల సంస్థ పేటీఎం నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి రానుంది.

సుప్రీంకోర్టు మొట్టికాయలు
అయితే వాట్సప్ కు ఈ మధ్య సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. కేంద్రం నిర్దేశించినట్లుగా డేటా లోకలైజేషన్, డేటా భద్రత నిబంధనలను వాట్సప్ అమలు చేయడం లేదంటూ సుప్రీం కోర్టులో ఇటీవలే పిటిషన్ దాఖలైంది. అటు రిజర్వ్ బ్యాంక్ కూడా చెల్లింపుల డేటాను (ట్రయల్ దశలోనైనా సరే) భారత్‌లోనే భద్రపర్చాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి వాట్సప్ కూడా అంగీకరించింది.కాబట్టి వాట్సప్ ఈ రంగంలో రాణించడం అంత సులువు కాదనేది మార్కెట్ నిపుణులు వాదన.
ఈ నేపథ్యంలో గూగుల్ పే, అమెజాన్ పే, వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్‌కి చెందిన ఫోన్‌పే, ఆపిల్ పే మొబైల్ వాలెట్, పేటీఎంలను తట్టుకుని నిలబడాలంటే వాట్సప్ పే చాలానే కష్టపడాల్సి ఉంటుందనేది పరిశ్రమ వర్గాల అంచనా. ఇదిలా ఉంటే డీమోనిటైజేషన్ సమయంలో మొబైల్ వాలెట్ సంస్థలు కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చాయి. కానీ చాలా మటుకు సంస్థలు ఆ తర్వాత క్రమంగా కనుమరుగవుతున్నాయి.

తగ్గుతున్న వాలెట్లు
2017 ఆఖరు నాటికి దేశీయంగా 60 పైగా మొబైల్ వాలెట్లు ఉండేవి. కానీ నెమ్మదిగా వ్యవస్థలో నగదు చెలామణీ మళ్లీ పెరగడం మొదలయ్యాక.. వీటి సంఖ్య క్రమంగా తగ్గి.. ప్రస్తుతం 50 లోపునకు పడిపోయింది. వాట్సప్ ఇలాంటివాటిని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. మరి వాట్సప్ పే ఇండియాలో ఎటువంటి ఫలితాలను చవిచూడబోతుందనేది ముందు ముందు చూడాలి.


Click it and Unblock the Notifications








