Home
News

WhatsApp Pay UPI చేరికలు జూన్ నెలలో భారీగా పెరిగింది...

స్మార్ట్ యుగంలో టెక్నాలజీ పెరగడంతో దాని వినియోగం కూడా భారీగా పెరిగింది. గతంలో ఏదైనా షాపింగ్ కోసం వెళ్లాలంటే చేతి నిండా డబ్బును తీసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ ప్రస్తుత రోజులలో ఒక స్మార్ట్ ఫోన్ ఉండి అందులో ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేసే ఏదైనా UPI యాప్ ఉంటే సరిపోతుంది. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవలే UPI ప్లాట్‌ఫారమ్ లోకి ప్రవేశించింది. UPI ఫీచర్ అందుబాటులోకి రావడంతో వాట్సాప్ మొబైల్ అప్లికేషన్‌తో వినియోగదారులు ఒకరికొకరు మెసెజ్లు, ఫొటోస్, వీడియోలను పంపడంతో పాటుగా డబ్బును కూడా పంపడానికి ఒక టూల్ లాగా పనిచేస్తుంది.

వాట్సాప్ UPI

వాట్సాప్ UPI ప్లాట్‌ఫారమ్ లో 2022 జూన్ నెలలో లావాదేవీల పరిమాణ వృద్ధి అధికంగా నమోదు చేసింది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి వాట్సాప్ UPI వృద్ధి తక్కువగా ఉండేది. కానీ జూన్ 2022లో కంపెనీ ప్రారంభించిన క్యాష్‌బ్యాక్‌ల కారణంగా భారతీయులు ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఎక్కువగా ఉపయోగించుకునేలా ప్రోత్సహించడంతో దేశంలో వాట్సాప్ వృద్ధికి దారితీసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జూన్ 2022లో వాట్సాప్ పే పనితీరు గణాంకాలు

జూన్ 2022లో వాట్సాప్ పే పనితీరు గణాంకాలు

వాట్సాప్ పే UPI ప్లాట్‌ఫారమ్‌లో 2022 సంవత్సరం మే నెలలో మొత్తంగా 34.8 లక్షల లావాదేవీలు నమోదు అయ్యాయి. అయితే ఈ మొత్తం లావాదేవీలలో జరిగిన ట్రాన్సషన్ మొత్తం రూ. 294.98 కోట్లు. కానీ జూన్ 2022లో ఇది మొత్తం 2.30 కోట్ల లావాదేవీలకు మరియు లావాదేవీల మొత్తంలో రూ.429.06 కోట్ల ట్రాన్సషన్ కు పెరిగింది. వాట్సాప్ పేమెంట్ యొక్క పెరుగుదల చూసుకుంటే కనుక భారీగా పెరిగింది. భారతదేశంలో వందల మిలియన్ల మంది కస్టమర్‌లు ఇటీవల ఈ ప్లాట్‌ఫారమ్‌ను కొత్తగా ఎంచుకున్నారు. ఇందులో లభించే క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధిక మంది ఇందులో చేరారు. క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు ఫోన్‌పే మరియు గూగుల్ పే లలో ఉన్నప్పటికీ వాట్సాప్ అందించే మెరుగైన ప్రయోజనాలను కలిగి లేవు.

గూగుల్ పే

గూగుల్ పే జూన్ 2022లో 200 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలను చూసింది. మొత్తంగా ఈ నెలలో రూ.3,55,137.20 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇదే నెలలో ఫోన్‌పేలో 273.2 కోట్ల లావాదేవీలు జరిగాయి. అలాగే మొత్తం లావాదేవీలు రూ. 5,01,474.48 కోట్లు జరగడం గమనార్హం.

 

UPI

వాట్సాప్ ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉంది మరియు మార్కెట్లో పోటీ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఫోన్‌పే మరియు గూగుల్ పే భారతదేశంలో ప్రారంభ మూవర్ ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి. అనేక ఫిన్‌టెక్ స్టార్టప్‌లు UPI లావాదేవీల కోసం తమ యాప్‌లను ఉపయోగించడానికి వినియోగదారులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. అయితే వాట్సాప్ ప్లేయర్ మెటా కంపెనీ మద్దతుతో వినియోగదారులను వాట్సాప్ పేకి అలవాటు చేయడానికి చాలా కాలం పాటు దూకుడుగా ప్రోత్సహిస్తుంది. గూగుల్ పే మరియు ఫోన్‌పే కూడా చేసింది ఇదే. రాబోయే నెలల గణాంకాలను చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
WhatsApp Pay New Registers Big Growth in UPI Transactions in June 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X