Home
News

కేంద్ర ప్రభుత్వం ఫైర్,వాట్సప్ మీద కఠిన చర్యలు

వాట్సప్ కు ఇండియాలో గడ్డుపరిస్థితులు ఎదురుకానున్నాయి.వాట్సప్ పేమెంట్ విషయంలో మొదట్నుంచి అనేక విమర్శలను ఎదుర్కుంటూ వస్తున్నవాట్సప్ ఇప్పుడు మళ్లీ ఇరకాటంలో పడినట్లుగా తెలుస్తోంది. వాట్సప్ మీద కేంద్ర ప్రభ

వాట్సప్ కు ఇండియాలో గడ్డుపరిస్థితులు ఎదురుకానున్నాయి.వాట్సప్ పేమెంట్ విషయంలో మొదట్నుంచి అనేక విమర్శలను ఎదుర్కుంటూ వస్తున్నవాట్సప్ ఇప్పుడు మళ్లీ ఇరకాటంలో పడినట్లుగా తెలుస్తోంది. వాట్సప్ మీద కేంద్ర ప్రభుత్వం అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. గతేడాది ఇండియాలోకి వాట్సప్ పేమెంట్ సేవలను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సంస్థ ఇప్పటివరకు RBI నుండి సర్వీసు కొరకు ఎటువంటి నిర్దిష్టమైన హమీని పొందలేదు.

కేంద్ర ప్రభుత్వం ఫైర్,వాట్సప్ మీద కఠిన చర్యలు

వాట్సప్ పేమెంట్స్ సర్వీసు ఇండియాలో టెస్టింగ్ చేయడానికి సైతం కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ లభించలేదు. అయినప్పటికీ ఈ సర్వీసును ఇండియాలో వినియోగదారులకు అందిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. సుప్రీంకోర్టులో దీనిపై కేసు వేయడంతో ప్రభుత్వం దానికి సమాధానమిస్తూ వాట్సప్ మీద కఠినమైన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపింది.

ఇక్కడి స్టాఫ్ ను నియమించితే తప్ప

ఇక్కడి స్టాఫ్ ను నియమించితే తప్ప

ఫేస్‌ బుక్ కు చెందిన వాట్సప్ దేశంలో పేమెంట్ సర్వీసుల కోసం ఇప్పటికే కొన్ని బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. అయితే భారత్ లో ఆఫీసును ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడి స్టాఫ్ ను నియమించితే తప్ప పేమెంట్ సర్వీస్ ప్రారంభించేందుకు వీలు లేదని వాట్సప్ కు కేంద్రప్రభుత్వం గతంలోనే తేల్చి చెప్పింది.

డేటా మొత్తం బయట ఎక్కడో

డేటా మొత్తం బయట ఎక్కడో

భారత్ లో సేవలు అందిస్తూ దీనికి సంబంధించిన డేటా మొత్తం బయట ఎక్కడో ఉంచడంపై ప్రభుత్వం అసతృప్తితో ఉంది. ఈ విషయమై తన అభిప్రాయమేమిటో తెలియజేయాల్సిందిగా ఆర్బీఐని కూడా ప్రభుత్వం కోరింది. దీనికి ఆర్బీఐ మానుంచి ఇంకా ఎటువంటి అనుమతులు వాట్సప్ కి ఇవ్వలేదని తేల్చి చెప్పింది.

భారీ జరిమానా

భారీ జరిమానా

ఇదిలా ఉండగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఐదు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ) మనీ యాప్‌లకు షాకిచ్చింది. నిబంధనలు సరిగా పాటించలేదని నగదు లావాదేవీలు జరిపే యాప్‌లు, వెబ్‌సైట్లపై భారీ జరిమానా విధించింది. పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్ చట్టం 2007 ప్రకారం ఈ సంస్థలకు జరిమానాలు విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.

5 కంపెనీలకు

5 కంపెనీలకు

వొడాఫోన్‌ ఎం-పేసాకు రూ.3.05 కోట్లు, మొబైల్ పేమెంట్స్‌కు రూ.1 కోటి, ఫోన్‌పేకు రూ.1 కోటి, ప్రయివేట్ అండ్ జీఐ టెక్నాలజీకు రూ.1 కోటి జరిమానా విధించింది. వై-క్యాష్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కి రూ. 5 లక్షలు, అమెరికా సంస్థలు వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌కు రూ.29,66 లక్షలు, మనీగ్రాంకు రూ.10.11 లక్షల జరిమాన విధించింది.

ఆర్బీఐ నియమ నిబంధనలు లేకుండా

ఆర్బీఐ నియమ నిబంధనలు లేకుండా

వినియోగదారులకు సేవలు అందించే విషయంలో ఏ సంస్థ అయినా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆ సంస్థపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఉపేక్షించేది లేదని ఆర్బీఐ ప్రకటించింది.ఇదిలా ఉండగా, ఆర్బీఐ నియమ నిబంధనలు లేకుండా తాము ఎలాంటి పే-యాప్ తీసుకురామని వాట్సప్ రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది.

అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టత

అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టత

ప్రస్తుతానికి తమ పేమెంట్ సర్వీస్ ట్రయల్ రన్ కొనసాగుతోందని, ఇది ఈ ఏడాది జూలై చివరి నాటికి పూర్తి కావొచ్చునని తెలిపింది. మెస్సేజింగ్ ప్లాట్‌ఫారం వాట్సప్ తీసుకువచ్చే పేమెంట్ యాప్ ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై వాట్సప్ అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టత ఇచ్చింది.

Best Mobiles in India

English summary
WhatsApp Pay Can't Launch Without RBI Nod, Central Bank Tells Top Court
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X