Whatsapp లో మరో కొత్త ఫీచర్ ! మీ గ్రూప్ లో పాత సభ్యులను కూడా చూడొచ్చు. వివరాలు.

By Maheswara
|

WhatsApp ఇటీవల iOS-Android క్రాస్-ప్లాట్‌ఫారమ్ చాట్ లను మార్చుకోవడాన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ జనాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ యొక్క ఫీచర్లకు అంతం లేనట్లు కనిపిస్తోంది. వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ తో ముందుకు వస్తోంది. ఈ కొత్త ఫీచర్ తో మీరు గ్రూప్‌లోని సభ్యులను గత 60 రోజులలో గ్రూప్ నుండి వెళ్లిపోయిన లేదా మునుపటి గ్రూప్ సభ్యులందరినీ చూడవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు నివేదికలు వెలువడ్డాయి.

 

ఈ కొత్త ఫీచర్

"పాస్ట్ పార్టిసిపెంట్స్"గా పిలువబడే ఈ కొత్త ఫీచర్, వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ద్వారా ఇటీవలి బీటా విడుదలలో మళ్లీ కనుగొనబడింది. ఇది ఈ ప్లాట్‌ఫారమ్ లో ఇప్పటికే ఉన్న 'సైలెంట్ ఎగ్జిట్' ఫీచర్ కు పొడిగింపుగా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

స్క్రీన్‌షాట్‌

స్క్రీన్‌షాట్‌

"ఈ స్క్రీన్‌షాట్‌కు ధన్యవాదాలు, ఇందులో గ్రూప్ సమాచారంలోనే అందుబాటులో ఉండే ఈ కొత్త విభాగాన్ని తెరవడం ద్వారా గ్రూప్ సభ్యులందరూ గత 60 రోజులలో గ్రూప్ నుండి ఎవరు నిష్క్రమించారు అని తెలుసుకోగలరు అని మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, గతంలో పాల్గొనేవారు దీని నుండి తీసివేయబడతారు 60 రోజుల తర్వాత జాబితా చేయండి" అని ఆప్షన్ ను WABetaInfo తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను
 

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను

ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ గురించి లేదా అది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే వివరాలను ఇంకా పూర్తిగా వెల్లడించలేదు మరియు అన్ని ఫీచర్లు టెస్టింగ్ ఫేజ్‌ను దాటలేదని కూడా గమనించాలి, కాబట్టి ఎప్పుడు విడుదలవుతుంది అనేవివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అంతవరకు మనము వేచి చూడాల్సిందే.

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తూనే ఉంది.ఆలా ఈ సంవత్సరం 2022 లో ఇప్పటివరకు ప్రకటించిన కొత్త ఫీచర్ లను ఒక్కసారి తెలుసుకోండి.

Delete For Everyone సమయాన్ని పెంచింది

Delete For Everyone సమయాన్ని పెంచింది

ప్ర‌స్తుతం ఈ Delete For Everyone ఆప్ష‌న్‌కు 1 గంట‌, 8 నిమిషాల 16 సెకండ్ల వ‌ర‌కు స‌మ‌య ప‌రిమితి ఉంది. తాజాగా WABetaInfo విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం చూస్తే.. ఈ డెలీట్ ఫ‌ర్ ఎవ్రీవ‌న్ ఫీచ‌ర్ స‌మ‌య ప‌రిమితి పెంచిన‌ట్లు తెలుస్తోంది. దీని ప్ర‌కారం దాదాపు రెండు రోజుల 12 గంట‌ల వ‌ర‌కు పొడిగింపు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇది ప్ర‌స్తుతానికి iOS బీటా టెస్టింగ్ యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉంద‌ని.. మ‌రికొన్ని వారాల్లో ఎక్కువ మందికి అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపింది.

Voice స్టేట‌స్ ఫీచ‌ర్ త్వరలో అందుబాటులోకి:

Voice స్టేట‌స్ ఫీచ‌ర్ త్వరలో అందుబాటులోకి:

Whatsapp అప్లికేష‌న్‌లో ప్ర‌స్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో మాదిరి 24 గంట‌ల స్టేట‌స్ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ఫొటోలు, 30 సెక‌న్ల వీడియోలు, GIF మాత్ర‌మే స్టేట‌స్‌గా పెట్టుకోవ‌డానికి వీలు ఉండేది. ఈ క్ర‌మంలో తాజాగా Voice స్టేట‌స్‌ల‌ను కూడా పెట్టుకునేలా వెసులుబాటు క‌ల్పించేందుకు వాట్సాప్ సంస్థ ప్ర‌యోగాలు చేస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ఫీచ‌ర్‌ను వినియోగదారుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఇందుకు సంబంధించి WABetaInfo నివేదిక Voice స్టేట‌స్‌ల స్క్రీన్‌షాట్‌ల‌ను విడుద‌ల చేసింది. బీటా వెర్షన్‌లో ఇదువ‌ర‌కు ఉన్న స్టేట‌స్ అప్‌లోడ్ ఆప్ష‌న్ల మాదిరే మ‌రో వాయిస్ స్టేట‌స్ ఆప్ష‌న్ కూడా Whatsapp లో యాడ్ అయిన విష‌యాన్ని యూజ‌ర్లు ఆ స్క్రీన్ షాట్ ద్వారా గ‌మ‌నించ‌వ‌చ్చు.

Whatsapp లో కొత్త మెసేజ్ రియాక్ష‌న్ ఫీచ‌ర్‌

Whatsapp లో కొత్త మెసేజ్ రియాక్ష‌న్ ఫీచ‌ర్‌

Whatsapp లో మెసేజ్ రియాక్ష‌న్ ఫీచ‌ర్‌లో ఇదువ‌ర‌కు ఆరు ఎమోజీలు మాత్ర‌మే క‌నిపించేవి. కానీ, ఇక ముందు వాట్సాప్ మెసేజ్ రియాక్ష‌న్ ఫీచ‌ర్‌కు మ‌రిన్ని ఎమోజీల‌ను జ‌త చేస్తుందని మార్క్ వెల్ల‌డించారు. దీంతో, Whatsapp యూజ‌ర్లు త‌మ‌కు న‌చ్చిన ఎమోజీని మెసేజ్ రియాక్ష‌న్‌గా రిప్లై ఇచ్చే వెసులుబాటు క‌ల్పిస్తున్నామ‌ని మార్క్ తెలిపారు. జుకర్‌బర్గ్ ఈ పోస్ట్‌లో తనకు ఇష్టమైన కొన్ని ఎమోజీలను కూడా పంచుకున్నాడు. ఇది త్వ‌ర‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. యూజ‌ర్లు త‌మ స్నేహితుడి నుంచి వ‌చ్చిన మెసేజ్‌ను ఎక్కువసేపు నొక్కడం ద్వారా రియాక్ష‌న్ ఫీచ‌ర్‌ను క‌నుగొన‌వ‌చ్చు. ఇందులో భాగంగా మునుపటి ఆరు ఎమోజీలతో పాటు "+" గుర్తుతో మెనూ ఓపెన్ అవుతుంది. (+) గుర్తును క్లిక్ చేయ‌డం ద్వారా స్మైలీ, ఎమోష‌న‌ల్ స‌హా ప‌లు కొత్త ఎమోజీలను కలిగి ఉన్న మెనూ ఓపెన్ అవుతుంది.
 

వాట్సాప్ 'కంపానియన్ మోడ్' కొత్త ఫీచర్

వాట్సాప్ 'కంపానియన్ మోడ్' కొత్త ఫీచర్

వాట్సాప్ సంస్థ ఇప్పుడు 'కంపానియన్ మోడ్' అనే కొత్త ఫీచర్ ని అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత తప్పనిసరిగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరికరాల మధ్య చాట్ హిస్టరీను సమకాలీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కేవలం వాట్సాప్ వినియోగదారుల కోసం టెలిగ్రామ్ వంటి మరిన్ని పరికరాలకు మద్దతును జోడిస్తోంది. WABetaInfo పాప్-అప్ ఇండికేటర్ రూపంలో ఆండ్రాయిడ్ వెర్షన్ 2.22.15.13 కోసం ఇటీవల విడుదల చేసిన వాట్సాప్ బీటాలో కంపానియన్ మోడ్‌ను గుర్తించింది. వాచ్‌డాగ్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం అనేక పరికరాలతో కనెక్ట్ చేయబడిన వాట్సాప్ సమకాలీకరణ చాట్ చరిత్రను చూపుతుంది. 'కంపానియన్ మోడ్' అందుబాటులోకి వచ్చిన తరువాత ఒకే వాట్సాప్ అకౌంటును మరొక ఫోన్ లో కూడా ఉపయోగించడానికి అనుమతిస్తుంది అని కంపెనీ తెలిపింది.

 

వాట్సాప్ గ్రూప్ చాట్‌లో గరిష్టంగా 512 మంది సభ్యుల చేరిక

వాట్సాప్ గ్రూప్ చాట్‌లో గరిష్టంగా 512 మంది సభ్యుల చేరిక

మెటా యాజమాన్యంలోని సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యొక్క ప్లాట్‌ఫారమ్ లోని వినియోగదారులను గ్రూప్ చాట్‌లో గరిష్టంగా 512 మంది సభ్యులను జోడించేలా కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. వాట్సాప్ యొక్క తాజా అప్‌డేట్ తో వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని WABInfo ఇటీవలి నివేదిక సూచించింది. ఈ ఫీచర్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది.  ఈ ఫీచర్‌ను మే ప్రారంభంలో మెటా ప్రకటించింది.

Best Mobiles in India

Read more about:
English summary
Whatsapp Planning To Introduce New Feature To See Past Participants Of Groups. Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X