WhatsApp ప్లాట్‌ఫాం "కాల్స్‌లో చేరడానికి లింక్‌లు" కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది!! పూర్తి వివరాలు ఇవిగో...

|

మెటా యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ తమ యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లను అందుబాటులోకి తీసుకొని వస్తూనే ఉంది. ఇప్పుడు కొత్త డెవలప్‌మెంట్‌లో భాగంగా మెసేజింగ్ యాప్‌లో కాల్‌లలో చేరడానికి కొత్తగా లింక్‌లను సృష్టించడానికి వినియోగదారులను అనుమతించే సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తోంది. ఇది ప్లాట్‌ఫారమ్‌లో కాల్‌లను సులభంగా చేరడానికి అనుమతిస్తుంది. ఇంతకుముందు వాట్సాప్ కాల్‌లో చేరడానికి వినియోగదారులను అనుమతించే అప్‌డేట్‌ను విడుదల చేసింది. కొత్త అప్‌డేట్‌తో హోస్ట్ వాట్సాప్ కాల్‌లో ఇతరులను ఆహ్వానించడానికి లింక్‌లను సృష్టించగలడానికి అనుమతిని ఇస్తుంది. ఈ ఫీచర్‌కు సంబందించిన మరిన్ని వివరాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

కొత్త ఫీచర్‌కు సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు

కొత్త ఫీచర్‌కు సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు

Wabetainfo నుండి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం వాట్సాప్ త్వరలో వ్యక్తులు కాల్ లింక్‌లను ఉపయోగించడం ద్వారా కాల్‌లలో చేరడాన్ని సులభతరం చేస్తుంది. ప్లాట్‌ఫారమ్‌లోని కాల్ హోస్ట్‌లు వారి కాంటాక్ట్ లిస్ట్‌లలో లింక్‌లను రూపొందించగలరని మరియు ఎవరినైనా ఆహ్వానించడానికి వాటిని షేర్ చేయగలరని పేర్కొంది. వాట్సాప్ కాల్‌ల కోసం ఆహ్వాన లింక్‌ను స్వీకరించే వినియోగదారులు తప్పనిసరిగా యాప్‌లో అకౌంటును సృష్టించాలని గమనించాలి. ఎందుకంటే వాట్సాప్ కాల్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా సురక్షితంగా ఉంటాయి.

కోవిడ్-19 PF అడ్వాన్స్ ను ఉమాంగ్ యాప్‌ ద్వారా విత్డ్రా చేయడం ఎలా?కోవిడ్-19 PF అడ్వాన్స్ ను ఉమాంగ్ యాప్‌ ద్వారా విత్డ్రా చేయడం ఎలా?

కొత్త అప్‌డేట్

అయితే ఈ కొత్త అప్‌డేట్ ఇంకా టెస్టింగ్‌ దశలోనే ఉంది కావున రిపోర్ట్ ప్రకారం వినియోగదారులు ప్రస్తుతానికి కాల్ లింక్‌లను సృష్టించలేరు. ఈ ఫీచర్ మెసెంజర్‌లో అందుబాటులో ఉన్న దాని కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వినియోగదారులు కాల్‌లో చేరడానికి వాట్సాప్ అకౌంటును కలిగి ఉండాలి మరియు ఇక్కడ ఎవరైనా లింక్‌తో చేరవచ్చు.

వాయిస్ మెసేజ్ ఫీచర్
 

మెటా యాజమాన్యంలోని ఇన్స్టెంట్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఇది మాత్రమే కాకుండా దాని వాయిస్ మెసేజ్ ఫీచర్ కోసం ఇటీవల కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది మరియు కొత్త UIని కూడా తీసుకువచ్చింది. ఈ ప్లాట్‌ఫారమ్ యొక్క బీటా వెర్షన్‌లో iOS వినియోగదారుల కోసం ఈ కొత్త ఇంటర్‌ఫేస్ ప్రారంభించబడింది. అంతేకాకుండా వాట్సాప్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త అప్‌డేట్ ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ మెసేజ్లను ప్లే చేయగల సామర్థ్యాన్ని వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఫీచర్ ఐఫోన్ మరియు ఐప్యాడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించబడింది. వాట్సాప్ దాని ప్లాట్‌ఫారమ్ యొక్క ఆండ్రాయిడ్ మరియు వెబ్ వెర్షన్‌లలో కూడా ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తుందో ముందు ముందు చూడాలి.

ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్ ఫీచర్‌

వాట్సాప్ చాట్‌లో వినియోగదారులను సంప్రదించడానికి మరియు మద్దతును స్వీకరించడానికి అనుమతించే ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోందని ఇటీవల కొన్ని నివేదికలు తెలిపాయి. ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్ ఫీచర్‌ను 2021 మార్చిలో iOS మరియు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో కొన్ని బీటా టెస్టర్‌ల కోసం ప్రవేశపెట్టింది. అయితే అది చివరికి నిలిపివేయబడింది. రెండు ప్లాట్‌ఫారమ్‌లలోని వాట్సాప్ బీటా టెస్టర్‌లు ఇప్పుడు యాప్‌లోని చాట్ ద్వారా సర్వీస్ నుండి మద్దతును మళ్లీ పొందే ఎంపికను చూస్తున్నారు. భవిష్యత్తులో ఈ ఫీచర్ మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి రావచ్చని సూచిస్తున్నాయి. వాట్సాప్ తాజా iOS బీటా వెర్షన్‌లో హార్ట్ ఎమోజీ కోసం కొత్త యానిమేషన్‌లను కూడా పరీక్షిస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ యొక్క 2.22.3.5 వెర్షన్ మరియు iOS కోసం వాట్సాప్ యొక్క 22.2.72 వెర్షన్‌లో వాట్సాప్ యొక్క కొత్త ఫీచర్ ట్రాకర్ WABetaInfo ద్వారా వినియోగదారులకు యాప్‌లో మద్దతును అందించే ఫీచర్ గుర్తించబడింది. సెట్టింగ్‌లు > హెల్ప్ > కాంటాక్ట్ అస్ ని సందర్శించడం ద్వారా మెటా యాజమాన్యంలోని సర్వీసును గుర్తించవచ్చు. ఇప్పుడు రెండు ప్లాట్‌ఫారమ్‌లలోని బీటా పరీక్షకులకు సందేశం కనిపిస్తుంది. "మేము మీకు వాట్సాప్ చాట్‌లో ప్రతిస్పందిస్తాము." వాట్సాప్ దాని ధృవీకరించబడిన అకౌంట్ ద్వారా యాప్‌లో మెసేజ్ ద్వారా వినియోగదారులను సంప్రదిస్తుంది. ఇది వాస్తవంగా వాట్సాప్ నుండి వచ్చిన మెసేజ్ అని నిరూపించడానికి ఆకుపచ్చ టిక్ మార్క్‌ను కలిగి ఉంటుంది.

WhatsAppలో ఒకరిని శాశ్వతంగా మ్యూట్ చేయడం ఎలా?

WhatsAppలో ఒకరిని శాశ్వతంగా మ్యూట్ చేయడం ఎలా?

స్టెప్ 1: ముందుగా మీ ఫోన్ లోని వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేయండి.

స్టెప్ 2: వాట్సాప్ మెసేజ్ యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 3: మీమ్మలని బాధించే కాంటాక్ట్ ను ఎంచుకోండి. మీకు కావలసినన్ని ఎంపిక చేసుకోవచ్చు.

స్టెప్ 4: ఆండ్రాయిడ్‌లో కాంటాక్ట్‌పై ఎక్కువసేపు నొక్కి, స్క్రీన్ పైభాగంలో ఉన్న [డౌన్ బాణం]పై క్లిక్ చేయండి. iOSలో ఎడమవైపుకు స్వైప్ చేయండి లేదా కాంటాక్ట్‌పై ఎక్కువసేపు నొక్కి ఆర్కైవ్ ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 5: iOS మరియు Android రెండింటిలోనూ ఆర్కైవ్ పరిచయాలను కేవలం ఒక క్లిక్‌తో యాక్సెస్ చేయవచ్చు లేదా అన్‌ఆర్కైవ్ చేయవచ్చు.

 

Best Mobiles in India

English summary
WhatsApp Platform Working on “Links to Join Calls” New Feature: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X