వచ్చేస్తోంది ‘వాట్స్‌యాప్ ప్లస్’, 5 ఆసక్తికర ఫీచర్లు

|

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడుతోన్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌లలో వాట్స్‌యాప్ ఒకటి. అతితక్కువ కాలంలోనే అమితమైన జనాదరణను సొంతం చేసుకున్న ఈ యాప్‌కు స్మార్ట్‌ఫోన్ యూజర్లు బ్రహ్మరథం పడుతున్నారు. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో ఈ యాప్‌ను మరింత ఆధునికంగా తీర్చిదిద్దే క్రమంలో తయారీదారులు మరింతగా శ్రమిస్తున్నారు. వీరి శ్రమకు ఫలితంగా త్వరలో అందుబాటులోకి రాబోతున్నదే ‘వాట్స్‌యాప్ ప్లస్'. వాట్స్‌యాప్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా రాబోతున్న ‘వాట్స్‌యాప్ ప్లస్' సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకోనుంది. ఈ లేటెస్ట్ వర్షన్ యాప్ అధికారికంగా విడుదల కానప్పటికి వాట్స్‌యాప్ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యమవుతోంది. వాట్స్‌యాప్ ప్లస్‌లోని 5 సరికొత్త ఫీచర్లను ఇప్పుడు చూద్దాం....

వచ్చేస్తోంది ‘వాట్స్‌యాప్ ప్లస్’, 5 ఆసక్తికర ఫీచర్లు

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

700కు పైగా కొత్త థీమ్‌లు

ప్రస్తుతం అందుబాటలో ఉన్న కరెంట్ వర్షన్ వాట్స్‌యాప్ కేవలం వాల్‌పేపర్‌లను మాత్రమే కలిగి ఉంటుంది. త్వరలో రాబోతున్న వాట్స్‌యాప్ ప్లస్ మాత్రం 700లకు పైగా థీమ్‌లను కలిగి ఉంటుంది. వీటిలో నచ్చిన థీమ్‌ను యూజర్ ఎంపిక చేసుకోవచ్చు.

ఎమోటికాన్స్

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో తమ వ్యక్తీకరణలను పదాలతో కాకుండా ఎమోటికాన్‌లతో వ్యక్తీకరించుకుంటున్న తీరును ఇటీవల కాలంలో మనం తరచుగా చూస్తున్నాం. ఈ ట్రెండ్‌ను పరిగణంలోకి తీసుకున్న వాట్స్‌యాప్, తమ అప్‌డేటెడ్ వర్షన్ యాప్‌లో పలు కొత్త ఎమోటికాన్‌లను పొందుపరిచింది.

ప్రైవసీకి పెద్దపీట

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాట్స్‌యాప్ ద్వారా యూజర్లు తాము ఆఖరి సారిగా చూసిన మెసేజ్‌కు సంబంధించిన స్టేటస్‌ను మాత్రమే హైడ్ చేసుకోవచ్చు. ‘ఆన్‌లైన్' స్టేటస్‌ను హైడ్ చేసే అవకాశం ఉండదు. అయితే రాబోతున్న వాట్స్‌యాప్ ప్లస్‌లో యూజర్లు తమ ‘ఆన్‌లైన్' స్టేటస్‌ను సైతం హైడ్ చేసుకోవచ్చు.

మీ అకౌంట్‌కు ప్రత్యేకమైన లుక్‌ను ఇవ్వొచ్చు

వాట్స్‌యాప్ ప్లస్‌లోని సెట్టింగ్స్‌ను ఉపయోగించుకుని యూజర్లు తమ అకౌంట్‌కు ప్రత్యేకమైన లుక్‌ను తీసుకురావచ్చు. హెడర్, కలర్, సైజ్ ఆఫ్ ఐకాన్స్, చాట్‌‍లోని టెక్స్ట్, ఇమేజ్ ఇంకా కాంటాక్ట్‌‍లకు సంబంధించి ఫాంట్ సైజ్ ఇంకా రూపాన్ని మార్చేయవచ్చు.

పెద్ద ఫైళ్లను సైతం షేర్ చేసుకోవచ్చు

వాట్స్‌యాప్ ప్లస్‌లో యూజర్లు నిడివితో పనిలేకుంగా ఫుల్‌లెంగ్త్ వీడియోలతో పాటు మ్యూజిక్‌ను షేర్ చేసుకోవచ్చు. కరెంట్ వర్షన్ వాట్స్‌యాప్‌లో కొంత పరిధి మేర ఫైళ్లను మాత్రమే షేర్ చేసుకునే అవకాశముంది.

Best Mobiles in India

English summary
WhatsApp Plus In The Works? Top 5 Features That Do Not Exist In The Current Version. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X