వాట్సాప్ గోప్యతా విధానాన్ని అంగీకరించకపోతే జరిగే పరిణామాలు ఇవే...

|

త్వరిత మెసేజ్లను పంపడానికి అధిక మంది ఉపయోగించే సోషల్ మీడియా యాప్ లలో ఒకటైన వాట్సాప్ ఇప్పుడు కొత్తగా తన యొక్క వినియోగదారుల కోసం గోప్యతా విధానాన్ని అంగీకరించడానికి మే 15 వరకు గడువు తేదీని ఇచ్చింది. వాస్తవానికి ఈ గడువు ముగిసిన తర్వాత ప్రజలు తమ అకౌంటును కోల్పోరని సోషల్ మెసేజింగ్ యాప్ తెలిపింది. ఈ విషయం మిలియన్ల కొద్ది వినియోగదారులకు పెద్ద ఉపశమనంను కలిగిస్తుంది. వాట్సాప్ యొక్క కొత్త ప్రైవసీ విధాన నిబంధనలను అంగీకరించమని అడిగే యాప్లో గత కొన్ని నెలలుగా ప్రజలు నోటిఫికేషన్ పాప్-అప్‌లను పొందుతున్నారు. ఈ కొత్త నిబంధనలు ఫేస్‌బుక్‌కు వాట్సాప్ నుంచి షేర్ చేయగలిగే డేటాపై బలమైన పట్టును ఇస్తాయని చెబుతున్నారు. ఈ విషయం అనేక ఆందోళనలను కూడా రేకెత్తించింది. వాట్సాప్ యొక్క క్రొత్త నిబంధనల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వాట్సాప్ గోప్యతా విధానం

వాట్సాప్ గోప్యతా విధానం

వాట్సాప్ యొక్క ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారులకు కొత్తగా లభించే గోప్యతా విధానాన్ని అంగీకరించకపోయినా వారి అకౌంటులను ఉపయోగించడం కొనసాగించవచ్చు. అయితే మే 15 గడువు తరువాత వాట్సాప్ కొత్త నిబంధనలను అంగీకరించడం గురించి మీకు తరచూ గుర్తు చేస్తూనే ఉంటుందని మరియు మీరు వాటిని అంగీకరించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం కొత్త విధానానికి అంగీకరించని వారు హెచ్చరికలను పొందడం కొనసాగిస్తారు. వాట్సాప్ కొత్త నిబంధనలు అంగీకరించిన చాలా వారాల వ్యవధి తరువాత ఇది స్థిరంగా మారుతుంది. గోప్యతా విధానాన్ని అంగీకరించని అంతిమ గేమ్ గొప్ప పరిణామాన్ని కలిగి ఉంది.

వాట్సాప్ గోప్యతా విధానాన్ని అంగీకరించకపోతే జరిగే పరిణామం
 

వాట్సాప్ గోప్యతా విధానాన్ని అంగీకరించకపోతే జరిగే పరిణామం

వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లో గోప్యతా విధానాన్ని అంగీకరించకపోతే కనుక కొన్ని వారాల తరువాత కొత్త విధానాన్ని అంగీకరించడానికి నోటిఫికేషన్ హెచ్చరికలు నిరంతరంగా మారతాయి. గోప్యతా విధానాన్ని అంగీకరించనందున వాట్సాప్ వినియోగదారులు ఎదుర్కొనే ఏకైక ఆందోళన ఇదేనా? అంటే దీనికి సమాధానం లేదు. వినియోగదారులు యాప్ యొక్క పరిమిత కార్యాచరణలను చూడటం ప్రారంభిస్తారని వాట్సాప్ స్పష్టంగా చెప్పింది. అంటే కొన్ని ఫీచర్లు వారి అకౌంట్లో పనిచేయడం ఆగిపోతాయి. ఈ ఫీచర్లు ఇవే


** మీరు మీ వాట్సాప్ చాట్ జాబితాను యాక్సెస్ చేయలేరు.

** మీరు ఇన్‌కమింగ్ కాల్‌లకు సమాధానం ఇవ్వవచ్చు కానీ నోటిఫికేషన్ హెచ్చరికను మాత్రమే నొక్కడం ద్వారా మెసేజ్ ను చదవవచ్చు.

** కొన్ని వారాల తరువాత వాట్సాప్ మీ అకౌంటుకు ఇన్‌కమింగ్ మెసేజ్లు మరియు కాల్‌లను పంపడం ఆపివేస్తుంది.

 

వాట్సాప్

ఇటువంటి సందర్భాల్లో చాలా మంది ప్రజలు తమ అకౌంటులను తొలగించడాన్ని పరిగణించవచ్చు. కానీ తొలగించే ప్రక్రియను వాట్సాప్ స్వయంగా చేయదు. అయితే ఒక అకౌంట్ 120 రోజులు క్రియారహితంగా ఉంటే కనుక సాధారణంగానే వాట్సాప్ అకౌంట్లు తొలగించబడతాయి. కాబట్టి మీరు వేరే మెసేజ్ సర్వీసుకు మారవచ్చు లేదా వాట్సాప్‌ను ఉపయోగించడం కొనసాగించడానికి మీరు కొత్త గోప్యతా విధానాన్ని అంగీకరించవచ్చు.

Best Mobiles in India

English summary
WhatsApp Privacy Policy Update: These are The Consequences of not Accepting WhatsApp privacy policy

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X