వాట్స్‌యాప్ యూజర్ల సంఖ్య 70 కోట్లు!
ప్రముఖ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్ ‘వాట్స్‌యాప్'ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకునే వారి సంఖ్య 70 కోట్లకు చేరకుంది. స్మార్ట్‌ఫోన్స్ ఇంకా టాబ్లెట్ పీసీల ద్వారా సలువుగా మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకునేందుకు వీలుకల్పిస్తున్న వాట్స్ యాప్ అనతికాలంలోనే విశేష ప్రాచుర్యాన్ని సంపాదించుకోవటం విశేషం.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

వాట్స్‌యాప్‌ను సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ గతేడాది ఫిబ్రవరిలో 18 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 2014, ఆగష్ట్ నాటికి వాట్స్‌యాప్ వినియోగదారుల సంఖ్య 60 కోట్లు ఉండగా 4 నెలల వ్యవధిలోనే 10 కోట్ల మంది అదనంగా చేరడం గొప్ప విషయమని వాట్స్‌యాప్ సీఈఓ జాన్ కౌమ్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. వాట్స్‌యాప్ ద్వారా రోజుకు సగటున 3 వేల కోట్ల సందేశాలను షేర్ చేసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








