Home
News

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. HD ఫోటోలను పంపుకోవచ్చు..!!

మెటా నేతృత్వంలోని ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. గత కొన్ని నెలలుగా వివిధ రకాల ఫీచర్లను విడుదల చేస్తున్న వాట్సాప్.. త్వరలో సూపర్‌ ఫీచర్‌ విడుదల చేస్తున్నట్లు వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo నివేదిక వెల్లడించింది.

వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్ నివేదిక ప్రకారం.. త్వరలో విడుదల కానున్న ఫీచర్ ద్వారా వాట్సాప్‌ నుంచి HD ఫోటోలు పంపించుకోవచ్చని సమాచారం. ఆండ్రాయిడ్‌, iOSలో కొంత మంది బీటా టెస్టర్లకు ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. iOS 23.11.0.76, ఆండ్రాయిడ్‌ 2.23.12.13 అప్‌డేట్‌ వెర్షన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న వారికి ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది.

Whatsapp

ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను WaBetainfo షేర్‌ చేసింది. ఈ ఫీచర్‌ ద్వారా వాట్సాప్‌ వినియోగదారులు నాణ్యమైన ఫోటోలను కూడా పంపుకోవచ్చని తెలిపింది. వినియోగదారులు ఒరిజినల్ క్వాలిటీ ఫోటోలను పంపగలరనేది దీని ఉద్దేశం కాదని, ఫోటో కొలతలు మారకుండా ఈ ఫీచర్‌ కాపాడుతుందని తెలిపింది.

వినియోగదారులు ప్రతిసారి ఫోటోలను ఇతరులకు షేర్‌ చేస్తున్నప్పుడు.. 'హై క్వాలిటీ" ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోటోకు ఆటోమేటిక్‌గా అధిక నాణ్యత కలిగిన ఫోటో అనే ట్యాగ్‌ వస్తుంది. ఫలితంగా అవతలి వారికి కూడా సదరు ఫోటో అధిక నాణ్యతతో కూడినదని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ఫోటోలకే పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వీడియోలను అధిక నాణ్యతతో పంపించేందుకు ఇప్పటికీ ఎటువంటి మార్గం లేదు, కేవలం డాక్యుమెంట్ ఆప్షన్‌ ద్వారా మాత్రమే షేర్‌ చేయగలుగుతున్నాం. స్టేటస్‌ అప్‌డేట్‌ ద్వారా ఫోటోలు పంపినప్పుడు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండదని సమాచారం. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ కేవలం బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో వినియోగదారులందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్‌ ఇటీవల స్క్రీన్‌ షేరింగ్‌ ఫీచర్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్ట్‌లకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉందని తెలుస్తోంది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్ నివేదిక ప్రకారం.. ఈ ఫీచర్‌ గూగుల్‌ మీట్‌ మరియు జూమ్ యాప్‌ తరహాలో పనిచేయనుందని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ వీడియో కాల్‌ సమయంలోనూ స్క్రీన్‌ను సులభంగా షేర్‌ చేసుకొనేందుకు అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్‌ పాత వెర్షన్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండదు. మరియు ఎక్కువ మంది ఉన్న గ్రూప్‌ కాల్‌లో పనిచేయకపోవచ్చని సమాచారం.

దీంతోపాటు మరో ఫీచర్‌కు వాట్సాప్‌ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఫోన్‌ నంబర్లకు బదులుగా "వాట్సాప్‌ యూజర్‌నేమ్‌" ఫీచర్‌ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌తో వినియోగదారులు తమకు నచ్చిన ఫేర్లను ఎంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ కొత్త ఫీచర్‌తో కాంటాక్ట్‌లను గుర్తించడానికి కేవలం ఫోన్‌ నంబర్‌లపై ఆధారపడటాన్ని తొలగిస్తూ.. ప్రత్యేక యూజర్‌నేమ్‌ను ఎంచుకోవచ్చు.

మరో ఫీచర్‌ను ఇటీవల వాట్సాప్‌ విడుదల చేసింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్‌ ఇటీవల అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు తాము పంపిన మెసేజ్‌లను 15 నిమిషాల్లోపు ఎడిట్‌ చేసుకొనే అవకాశం ఉంటుంది. ఇది వరకు చేసినట్లుగా పూర్తి మెసేజ్‌ను డిలీట్‌ చేయాల్సిన అవసరం లేదు.

Best Mobiles in India

English summary
Whatsapp reportedly rolling out new feature that can allow users send HD photos
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X