సూపర్ ఫీచర్ విడుదల చేసిన వాట్సాప్.. మీ చాట్ మరింత భద్రం..!
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో అద్బుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంచుకున్న వాట్సాప్ చాట్‌లను లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వినియోగదారులు అందరికీ అందుబాటులోకి వచ్చింది ఈ చాట్ లాక్ ఫీచర్ యాజర్ ప్రొఫైల్‌లో కనిపిస్తుంది.
ఉదాహరణకు ఏదైనా సందర్భంలో మీ వాట్సాప్‌ను ఇతరులు వినియోగిస్తున్నప్పుడు .. మీ వ్యక్తిగత చాట్‌లను చదవకుండా ఉండే విధంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. మీ వ్యక్తిగత చాట్‌ను ఫింగల్ ప్రింట్‌తో లాక్ చేసుకోవచ్చు. ఫలితంగా ఎవరైనా మీ ఫోన్‌లో వాట్సాప్‌ను వినియోగించినా.. మీ వ్యక్తిగత చాట్‌ను చదివే వీలుండదు.

వాట్సాప్ చాట్‌లాక్ ఫీచర్ ఆన్ చేసి పెట్టుకుంటే... ఆ కాంటాక్ట్ నుంచి మీకు మెసెజ్ వచ్చినా ఆటోమేటిక్‌గా హైడ్ చేస్తుంది. ఫలితంగా వ్యక్తిగత సమాచారం ఎవరూ చూసే వీలుండదు. అయితే మెసెజ్ నోటిఫికేషన్ మాత్రం చాట్‌లో చూపిస్తుంది. కానీ ఎవరి నుంచి మెసెజ్ వచ్చిందో ఇతరులు తెలుసుకునే అవకాశం లేదు. ప్రత్యేక "locked Chats"లోనే ఈ మెసెజ్ కనిపిస్తుంది. ఆ ఫోల్డర్‌ను యాక్సెస్ చేసేందుకు ఫింగర్ ప్రింట్ అవసరం ఉంటుంది.
వాట్సాప్ చాట్ ఫీచర్‌ను ఎలా ఆన్ చేసుకోవాలంటే..
స్టెప్ 1: వాట్సాప్‌ను ఓపెన్ చేసి మీరు ఏ చాట్‌ను లాక్ చేసుకోవాలి అనుకుంటున్నారో నిర్ణయించుకోండి.
స్టెప్ 2: అనంతరం కాంటాక్ట్ చాట్ యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేయండి
స్టెప్ 3: స్క్రోల్ డౌన్ చేసి చాట్‌లాక్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఎనేబుల్ చేసుకోండి.
స్టెప్ 4: మీ ఫోన్ ఫింగర్ ప్రింట్‌తో చాట్‌ను లాక్ చేసుకోవచ్చు.
* వీటితో పాటు త్వరలో విడుదల కానున్న ఫీచర్ ద్వారా HD క్వాలిటీ ఫోటోలను వాట్సాప్ ద్వారా పంపించుకోవచ్చు. ఆండ్రాయిడ్, iOSలో కొంత మంది బీటా టెస్టర్లకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. iOS 23.11.0.76, ఆండ్రాయిడ్ 2.23.12.13 అప్‌డేట్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకున్న వారికి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
వినియోగదారులు ఫోటోలను షేర్ చేస్తున్నప్పుడు.. 'హై క్వాలిటీ" ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోటోకు ఆటోమేటిక్‌గా అధిక నాణ్యత కలిగిన ఫోటో అనే ట్యాగ్ వస్తుంది. అవతలి వారికి సదరు ఫోటో అధిక నాణ్యతతో కూడినదని తెలుస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఫోటోలకే పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీడియోలను అధిక నాణ్యతతో పంపించేందుకు ఇప్పటికే ఎటువంటి మార్గం లేదు, కేవలం డాక్యుమెంట్ ఆప్షన్ ద్వారా మాత్రమే షేర్ చేయగలుగుతున్నాం.
* మరో ఫీచర్‌కు వాట్సాప్ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఫోన్ నంబర్లకు బదులుగా " వాట్సాప్ యూజర్‌నేమ్" ఫీచర్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌తో వినియోగదారులు తమకు నచ్చిన ఫేర్లను ఎంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ కొత్త ఫీచర్‌తో కాంటాక్ట్‌లను గుర్తించడానికి కేవలం ఫోన్ నంబర్‌లపై ఆధారపడటాన్ని తొలగిస్తూ.. ప్రత్యేక యూజర్‌నేమ్‌ను ఎంచుకోవచ్చు.
* మరో ఫీచర్‌ను ఇటీవల వాట్సాప్ విడుదల చేసింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మెసేజ్ ఎడిట్ ఫీచర్ ఇటీవల అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు తాము పంపిన మెసేజ్‌లను 15 నిమిషాల్లోపు ఎడిట్ చేసుకొనే అవకాశం ఉంటుంది. ఇది వరకు చేసినట్లుగా పూర్తి మెసేజ్‌ను డిలీట్ చేయాల్సిన అవసరం లేదు.


Click it and Unblock the Notifications