Home
News

వాట్సాప్‌ సూపర్‌ ఫీచర్‌.. ఇక చాట్‌, డేటా ట్రాన్స్‌ఫర్‌ కష్టాలు తొలగినట్టే..!

మీరు కొత్త స్మార్‌ఫోన్‌ కొనుగోలు చేశారు. ఫోన్‌ డేటా అంతా మెమెరీ కార్డు, పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి కొత్త ఫోన్‌లోకి ట్రాన్సఫర్ చేసుకుంటారు. అలాగే పాత ఫోన్‌ యాప్‌లు.. కొత్త మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. కానీ వాట్సాప్‌ డేటా, చాట్‌కు ఇలాంటి సౌకర్యం లేదు. గూగుల్‌ డ్రైవ్‌లోకి డేటా అంతా ట్రాన్స్‌ఫర్ చేసి, కొత్త ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటాం. ఈ సమస్యకు త్వరలో చెక్‌పెట్టేందుకు వాట్సాప్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మెటా నేతృత్వంలోని ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. తన వినియోగదారులకు నిరంతరం కొత్త ఫీచర్లు, మరింత మెరుగైన ఇంటర్‌ఫేస్‌ ఇచ్చేందుకు నిరంతరం కృషిచేస్తోంది. గత కొంత కాలంగా నెలవారీగా ఏదో ఒక అప్‌డేట్‌ లేదా ఫీచర్‌ను విడుదల చేస్తూనే ఉంది.

Whatsapp Chat Transfer

ప్రస్తుతం వాట్సాప్‌ తన వినియోగదారుల డేటా, చాట్‌ను గూగుల్ డ్రైవ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు అనుమతిస్తోంది. అయితే దీనిపై అవగాహన లేని యూజర్లు.. పాత ఫోన్‌ వాట్సాప్ డేటాను అలానే వదిలేసి, కొత్త మొబైల్‌లో తాజాగా చాట్‌ను ప్రారంభిస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు, కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సాప్‌ సన్నాహాలు చేస్తోందని ఫీచర్‌ ట్రాకర్‌ పేర్కొంది.

WaBetainfo కథనం ప్రకారం.. వాట్సాప్‌ డేటా, చాట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసే ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే వాట్సాప్‌ డేటాను సులభంగా వేరే ఫోన్లకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. అయితే ఈ చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఫీచర్‌ బీటా వినియోగదారుల కోసం విడుదలైంది. వాట్సాప్‌ 2.23.9.19 అప్‌డేట్‌ ప్రస్తుతం గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.

టెస్టింగ్‌ దశ దాటి ఈ ఫీచర్‌ వినియోగదారులు అందరికీ అందుబాటులోకి వస్తే.. ఎటువంటి థర్డ్‌పార్టీ యాప్‌లపై ఆధారపడకుండా సులభంగా వాట్సాప్‌ డేటా, చాట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్‌ సెట్టింగ్‌లోని చాట్‌పై క్లిక్‌ చేస్తే.. అక్కడ చాట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకొనే బటన్‌ కనిపిస్తుంది. దానిని ఉపయోగించి చాట్‌ను పాత ఫోన్‌ నుంచి కొత్త మొబైల్ వాట్సాప్‌కు సులభంగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.

త్వరలో "సైడ్‌ బై సైడ్‌" ఫీచర్‌ తీసుకొచ్చేందుకు వాట్సాప్‌ పనిచేస్తోందని.. WaBetainfo వెల్లడించింది. ఈ ఫీచర్‌తోపాటు తమ వాట్సాప్‌ ఖాతాను ఒకేసారి నాలుగు ఫోన్లతో లింక్‌ చేసుకొనే ఫీచర్‌పై పనిచేస్తోంది. అంటే ఇప్పటివరకు ల్యాప్‌ట్యాప్‌, డెస్క్‌టాప్‌లో మాత్రమే లింక్‌ చేసేందుకు వీలుండగా.. ఇప్పుడు ఏకంగా నాలుగు ఫోన్లలో ఒకటే వాట్సాప్‌ను లింక్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, త్వరలో అందరికీ అందుబాటులోకి రానుందని వాట్సాప్‌ తెలిపింది.

అలాగే ఏదైనా కొత్త ఫోన్‌ నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్‌ చేయాలంటే. మొదట మన ఫోన్‌లో ఆ కాంటాక్ట్‌ను సేవ్‌ చేయాల్సి ఉంటుంది. అదే ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న ఫీచర్‌ అందుబాటులోకి వస్తే నేరుగా వాట్సాప్‌లోనే కాంటాక్ట్‌ను సేవ్‌ చేయవచ్చు. వాట్సాప్‌లోని కాంటాక్ట్‌ లిస్ట్‌ను తెరిచి, న్యూ కాంటాక్ట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఒక వేళ వినియోగదారులకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటేనే ఈ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
WhatsApp Rolling out New Chat Transfer Feature soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X