WhatsApp నుంచి కొత్తగా స్టిక్కర్స్ షార్ట్ కట్ ఫీచర్!!

|

ప్రపంచం మొత్తం మీద బాగా పాపులర్ అయిన మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ తన యొక్క వినియోగదారులకు కోసం ఇటీవలి కాలంలో తన ప్లాట్‌ఫామ్‌కు కొత్త ఫీచర్లను జోడించడం కోసం పనిచేస్తోంది. ఆడియో మెసేజ్ల కోసం ప్లేబ్యాక్ స్పీడ్ నుండి ఫ్లాష్ కాల్స్, ప్రైవసీ చాట్ బ్యాకప్‌లు మరియు ఆండ్రాయిడ్ నుంచి iOS లకు యూజర్‌లు తమ డేటాను సులభంగా బదిలీ చేయడం గల సామర్థ్యం వంటి మరిన్ని ఫీచర్లు త్వరలో ప్రారంభించబడతాయని భావిస్తున్నారు.

స్టిక్కర్‌

వీటన్నిటికీ సహాయపడటానికి చాట్ మైగ్రేషన్ టూల్స్ లను తమ విభిన్న ప్లాట్‌ఫారమ్‌లలో జోడించడానికి చూస్తున్నారు. ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌లో స్టిక్కర్‌ల కోసం వెతకడానికి వీలుగా కొత్త ఫీచర్‌ను విడుదల చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

Also Read: Xiaomi నుంచి కొత్తగా మరో Mi స్మార్ట్ టీవీ లాంచ్!! తక్కువ ధరలో గొప్ప ఫీచర్స్..Also Read: Xiaomi నుంచి కొత్తగా మరో Mi స్మార్ట్ టీవీ లాంచ్!! తక్కువ ధరలో గొప్ప ఫీచర్స్..

వాబెటా నివేదిక

వాబెటా యొక్క నివేదిక ప్రకారం బీటా ప్రోగ్రామ్‌లో రన్ అవుతున్న ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు సత్వరమార్గంగా స్టిక్కర్స్ లను ఎంచుకోవడానికి సెర్చ్ ఫర్ స్టిక్కర్స్ పేరుతో వాట్సాప్ కొత్త ఫీచర్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ పేరు స్పష్టంగా సూచించినట్లుగా వినియోగదారులు కోరుకున్న స్టిక్కర్‌ను సులభంగా శోధించడానికి అనుమతిస్తుంది.

షార్ట్ కట్ చాట్

వాట్సాప్ యొక్క ఈ కొత్త ఫీచర్‌ షార్ట్ కట్ చాట్ బార్‌లో టైప్ చేసిన మొదటి పదాన్ని విశ్లేషిస్తుంది మరియు యూజర్ యొక్క స్టిక్కర్ లైబ్రరీలో సేవ్ చేయగల ఏదైనా స్టిక్కర్‌లతో ఈ పదాన్ని సరిపోల్చడానికి మొదట ప్రయత్నిస్తుంది. అది అక్కడ ఉంటే కనుక ఇది వినియోగదారులకు సూచనను ఇస్తుంది. అలాగే మీరు చాట్ బార్‌లోని ఎమోజి బటన్‌ను నొక్కితే అది చాట్ బార్‌లోని కీవర్డ్‌కి సంబంధించిన స్టిక్కర్‌లను కూడా ప్రదర్శిస్తుంది.

వాట్సాప్ క్రొత్త ఫీచర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

వాట్సాప్ క్రొత్త ఫీచర్ గురించి ఆసక్తికరమైన విషయాలు

ప్రస్తుతానికి వాట్సాప్ క్రొత్త ఫీచర్ ఏ మూడవ పార్టీ స్టిక్కర్లకు మద్దతు ఇవ్వదని బ్లాగ్ పేర్కొంది. అయితే ఇది వినియోగదారుడు సృష్టించిన స్టిక్కర్ ప్యాక్‌లకు మద్దతు ఇస్తుంది. బ్లాగ్‌లోని పదాలతో వినియోగదారుడు కొన్ని స్టిక్కర్ ప్యాక్‌ని సృష్టించినట్లయితే కనుక అతను లేదా ఆమె స్టిక్కర్ మేకర్ స్టూడియో చేత క్రొత్త ఫీచర్‌కు మద్దతు ఇవ్వడం ప్రారంభించవచ్చు. వాట్సాప్‌ను గుర్తించడానికి స్టిక్కర్లలో 3 ఎమోజీలు వరకు మాత్రమే సాధ్యం.

 

 

Also Read: Infinix Note 10 సిరీస్ జూన్ 7న ఇండియాలో లాంచ్!! ఫీచర్స్ ఇవిగోAlso Read: Infinix Note 10 సిరీస్ జూన్ 7న ఇండియాలో లాంచ్!! ఫీచర్స్ ఇవిగో

ఆండ్రాయిడ్ వెర్షన్

ఆండ్రాయిడ్ వెర్షన్ 2.21.12.1 అందుబాటులో వారికి వాట్సాప్ యొక్క క్రొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. ఏదేమైనా ముందు చెప్పినట్లుగా ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులందరికీ ఈ క్రొత్త ఫీచర్‌కు సంబంధించి యాక్సిస్ ఇవ్వబడదు. ఎందుకంటే కంపెనీ దీనిని బీటా వినియోగదారులకు ఎంపిక చేసిన ప్రాతిపదికన విడుదల చేస్తుంది.

 

Also Read: COVID-19 సమయంలో ఉచిత ఆఫర్లను ప్రకటించిన డిష్ టీవీ!!Also Read: COVID-19 సమయంలో ఉచిత ఆఫర్లను ప్రకటించిన డిష్ టీవీ!!

ప్లేబ్యాక్ స్పీడ్

ఆండ్రాయిడ్ మరియు iOS ఆధారిత యాప్ లలో వాయిస్ మెసేజ్ల కోసం ప్లేబ్యాక్ స్పీడ్ అని పిలువబడే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ఇటీవల విడుదల చేసింది. వెబ్ మరియు డెస్క్‌టాప్ యాప్ లలో కూడా దీని యొక్క మద్దతు ఉంది. ఒకవేళ మీరు దాన్ని కోల్పోయినట్లయితే కనుక ఫీచర్ ను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు 1x, 1.5x మరియు 2x అనే మూడు వేర్వేరు స్పీడ్ లతో వాయిస్ మెసేజ్లను వినవచ్చు. ఈ ఫీచర్ కారణంతో కొంత వరకు సమయంను ఆదా చేయవచ్చు.

Best Mobiles in India

English summary
WhatsApp Rolling Out Upcoming Feature Stickers Shortcut to Search on Android

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X