వాట్సప్ నుంచి కొత్త ఫీచర్స్, వీడియో కాల్స్ మరింత సులువు

By Gizbot Bureau
|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కంపెనీ ఈ ఫీచర్లను బీటా వర్షన్ లో ప్రతి ఒక్కరికీ అందిస్తోంది. అపిషియల్ గా మార్కెట్లోకి రాకముందే ఈ ఫీచర్లను వాడాలనుకుంటే బీటా వర్సన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఫ్లాట్ ఫాం మీద ఇవి అందుబాటులో ఉేన్నాయి. కాగా ఇప్పటికే కంపెనీ డార్క్ మోడ ఫీచర మీద పనిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో పాటుగా Boomerang videos supportని కూడా అందించేందుకు సిద్ధమవుతోంది. వీటితో పాటుగా కొన్ని ఆసక్తికర ఫీచర్లను కూడా కంపెనీ ఇప్పుడు యూజర్లకు అందివ్వబోతోంది. అవేంటో ఓ సారి చూద్దాం.

 

Audio playback for iPhone users

Audio playback for iPhone users

ఐఓఎస్ యూజర్లకు audio playback featureని వాట్సప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. బీటా యాప్ ఇప్పటికే అందుబాటులో ఉంది. వాట్సప్ బీటా 2.19.91.1 ద్వారా యూజర్లు ఈ ఫీచర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ప్లే ఆడియో ఫైల్ ని షేర్ చేసుకోవచ్చు. వాట్సప్ యూజర్లు వాట్సప్ ఓపెన్ చేయకుండానే voice message or an audio fileని ప్లే చేసుకుని వినవచ్చు.

Making WhatsApp calls through Google Assistant

Making WhatsApp calls through Google Assistant

గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఇకపై వాట్సప్ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని వాట్సప్ అందుబాటులోకి తీసుకువస్తోంది. గూగుల్ అసిస్టెంట్ ద్వారా మీరు నేరుగా video and audio calls చేయమని అడగవచ్చు. WhatsApp and Google Assistant apps అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసి Hey Google, WhatsApp video అంటే సరిపోతుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లు అందుబాటులో ఉంది.

Albums for web
 

Albums for web

ఈ ఫీచర్ ద్వారా కొంతమందికి ఒకేసారి మల్టిపుల్ images or videos పంపుకోవచ్చు. మొత్తాన్ని ఆల్బమ్ ఫార్మాట్ ద్వారా పంపుకోవచ్చు. అయితే వాట్సప్ వెబ్ లో ఈ సదుపాయం అందుబాటులో ఉండదు. ఇందులో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సప్ ప్రయత్నిస్తోంది. లీకయిన రిపోర్టుల ప్రకారం వాట్సప్ desktop web usersకి కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Multi-platform support

Multi-platform support

ఇప్పటిదాకా వాట్సప్ ఒకేసారి two platforms మీద అందుబాటులో లేదు. అయితే వెబ్ ద్వారా మాత్రమే యూజర్లు మరో ఫ్లాట్ ఫాం మీద వాడుకునే సదుపాయం మాత్రమే ఇప్పటిదాకా అందుబాటులొ ఉంది. ఈ సమస్యను అధిగమించి మల్టి ఫ్లాట్ ఫాం మీద ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ తొలిసారిగా Apple's iPad ద్వారా పరిచయం కానుంది. ఆ తర్వాత Android and iOS యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

Best Mobiles in India

English summary
WhatsApp’s top new interesting features coming soon for Android, iOS and web users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X