WhatsApp లో సైబ‌ర్ క్రైం.. రిటైర్డ్ టీచ‌ర్‌కు రూ.21 ల‌క్ష‌ల టోక‌రా!

|

ప్ర‌స్తుతం డిజిట‌లైజేష‌న్ ఏ మేర పెరిగిందో.. దాని వేదిక‌గా సైబ‌ర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆన్‌లన్ వేదిక‌గా ఇంట‌ర్నెట్ యూజ‌ర్ల‌ను మోసం చేయ‌డానికి హ్యాకర్లు మరియు స్కామర్లు తరచుగా ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ప్ర‌స్తుతం మోస‌పూరిత‌మైన లింకుల‌తో WhatsApp యూజ‌ర్ల‌ను టార్గెట్‌గా Cyber నేరాల‌కు య‌త్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. ఓ రిటైర్డ్ టీచర్ కువాట్సాప్‌లో ఓ హానికరమైన లింక్ రాగా.. దాన్ని ఆయ‌న ట్యాప్ చేయ‌డంతో రూ. 21 లక్షలు మాయ‌మ‌వ‌డంతో ఆయ‌న అవాక్క‌య్యారు.

cyber crime

పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. సైబర్ మోసానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని మదనపల్లె పట్టణంలోని రెడ్డేపనాయుడు కాలనీకి చెందిన వరలక్ష్మి పోలీసులకు తెలియజేసింది. విశ్రాంత ఉపాధ్యాయురాలైన బాధిత మ‌హిళ తన ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు తనకు నిత్యం మెసేజ్‌లు రావ‌డాన్ని గ‌మ‌నించారు. దీంతో వెంట‌నే బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీయ‌గా... బ్యాంక్ అధికారులు ప్ర‌తిస్పందిస్తూ.. ఆమె ఖాతా హ్యాక్ అయింద‌ని, అందులో ఆమె దాచుకున్న డ‌బ్బు అంతా ఖాళీ అయింద‌ని చెప్ప‌డంతో ఆమె ఖంగు తిన్నారు. దీంతో ఆ మహిళ ఆగస్టు 20న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

cyber crime

వాట్సాప్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి
ఈ ఘ‌ట‌న‌పై పోలీసు అధికారులు స్పందిస్తూ.. ఇటీవ‌లి కాలంలో వాట్సాప్ వేదిక‌గా ఫేక్ లింక్స్ లింకులు పంప‌డం సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు ప‌రిపాటిగా మారింద‌న్నారు. త‌ద్వారా ఆ లింకుల‌ను క్లిక్ చేసిన యూజ‌ర్ల అకౌంట్ల‌ను సైబ‌ర్ నేర‌గాళ్లు హ్యాక్ చేసి న‌గ‌దు దొంగిలిస్తున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

అలాంటి మరో ఘటనపై ఓ పోలీసు అధికారి వివరాలు వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు ఇటీవల అదే పట్టణానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జ్ఞానప్రకాష్ ఖాతా నుంచి రూ.12 లక్షలు దొంగిలించారు. ఆ మరుసటి రోజే ఈ రూ.21 ల‌క్ష‌ల చోరీ ఉదంతంపై ఫిర్యాదు అందిన‌ట్లు చెప్పారు. దీనితో పాటు, హర్యానా రాష్ట్రంలోనూ ఓ గేమింగ్ సంస్థ కు చెందిన రూ.30 ల‌క్ష‌ల న‌గ‌దు సైబ‌ర్ నేర‌గాళ్లు దొంగిలించిన‌ట్లు సైబ‌ర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల స‌మాచారం. అయితే, బాధితులు గోల్డెన్ అవ‌ర్స్‌(త్వ‌రిత‌గ‌తిన‌) 1930 నంబ‌ర్‌కు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ఆ డ‌బ్బును వెన‌క్కి తీసుకు రాగ‌లిగారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. గోల్డెన్ అవర్స్‌లో(త్వ‌రిత‌గ‌తిన‌) బాధితులు హెల్ప్‌లైన్‌లో అందించిన తక్షణ సమాచారంతో ఇది సాధ్యమైంది.

cyber crime

ఏదేమైన‌ప్ప‌టికీ.. ఎవ‌రైనా సైబ‌ర్ మోసాల‌కు గురైనా, లేదా సైబ‌ర్ మోసాలు జ‌రుగుతున్నాయ‌ని గుర్తించినా 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు. త్వ‌రిత‌గ‌తిన లావాదేవీని స్తంభింపజేయడం ద్వారా మోసాల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చు. ఇదిలా ఉండ‌గా.. వాట్సాప్‌లో వ‌చ్చే ఏవిధ‌మైన మోస‌పూరిత లింకుల‌ను క్లిక్ చేయ‌వ‌ద్ద‌ని నిపుణులు సూచిస్తున్నారు. సురక్షితంగా ఉండటానికి, వాట్సాప్‌లో వచ్చిన ఏవైనా అనుమానాస్పద లింక్‌లు లేదా అనవసరమైన సందేశాలపై క్లిక్ చేయకపోవడం శ్రేయ‌స్క‌రం.

ఇదేకాకుండా, ఆన్‌లైన్ వేదిక‌గా లోన్‌(రుణాలు) మంజూరు చేసే యాప్‌ల‌తోనూ జాగ్ర‌త్త‌:
నేటి కాలంలో లోన్ (రుణం) తీసుకోవ‌డం చాలా సులువు. ఆన్‌లైన్ వేదిక‌గా చాలా Apps విచ్చ‌ల‌విడిగా త‌క్ష‌ణ లోన్లు మంజూరు చేస్తున్నాయి. కేవ‌లం ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్ యాప్స్‌లో Loan స‌దుపాయం పొందే అవ‌కాశం ఉంది. కానీ, ఈ Loan యాప్స్‌ స‌దుపాయం మీ జీవితాల్ని న‌ర‌క‌ప్రాయంగా మార్చే అవ‌కాశాల్ని కూడా మెండుగా క‌లిగి ఉంది.

cyber crime

ఇటీవ‌ల మేం ఫేస్‌బుక్ వేదిక‌గా కొన్ని త‌క్ష‌ణ Loan స‌దుపాయం క‌ల్పించే యాప్‌ల‌కు సంబంధించిన‌ యాడ్ల‌ను గ‌మ‌నించాం. మొద‌ట్లో ఈ Apps చాలా ఆక‌ర్ష‌ణీయంగా త‌క్కువ వ‌డ్డీ రేటు క‌ల్పిస్తున్న‌ట్లు న‌మ్మ‌కంగా క‌నిపిస్తాయి. కానీ, వాస్త‌వానికి ఆ యాప్స్ 36శాతం వ‌డ్డీ రేటు విధిస్తాయి. అంతేకాకుండా ఈ త‌ర‌హా యాప్స్ నుంచి చాలా ప్ర‌మాదం పొంచి ఉంద‌నే విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గ‌మ‌నించాలి. అందుకు సంబంధించి ఇక్కడ మేం కొన్ని సూచ‌న‌ల‌ను అందిస్తున్నాం.

అదీ ఇదీ అని కాకుండా.. మొబైల్‌లో ఉన్న డేటా అంతా స్వాహా!
ఈ త‌రహా లోన్ అప్లికేష‌న్లు యూజ‌ర్ల వ్య‌క్తిగ‌త డేటాను ఎక్కువ‌గా సేక‌రిస్తాయి. అదీ ఇదీ అని కాకుండా మీ మొబైల్ లో ఉన్న డేటా మొత్తాన్ని ఆ యాప్స్ సేక‌రిస్తాయి. ఈ ప్ర‌మాదం ఐఫోన్ల‌లో కంటే ఆండ్రాయిడ్ ఫోన్ యూజ‌ర్ల‌కు ఎక్కువ‌గా పొంచి ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ డేటా సేకరణలో భాగంగా మీ ఖచ్చితమైన లొకేష‌న్ మరియు పేరు, ఇమెయిల్ చిరునామా, వినియోగదారు ID, ఫోన్ నంబర్ మరియు ఇతర సమాచారంతో సహా వ్యక్తిగత సమాచారాన్ని సేక‌రిస్తుంది. మ‌రో కీల‌క విష‌యం ఏంటేంటే.. కేవ‌లం పైన చెప్పుకున్న డేటా మాత్ర‌మే కాకుండా, ఈ యాప్‌లలో యూజ‌ర్ల‌కు సంబంధించిన మెసేజ్ డేటా, ఫోటోలు, వీడియోలు, ఫైల్‌లు, డాక్యుమెంట్‌లు, కాంటాక్ట్‌లు, యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం మరియు డివైజ్ IDలను కూడా అవి సేక‌రిస్తాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే, ఈ యాప్‌లు మీ ఫోన్‌ని క్లోన్ చేస్తాయి మరియు మీ వ్యక్తిగత డేటా మొత్తాన్ని క్లౌడ్‌లో నిల్వ చేస్తాయి.

క‌నీసం ఆ యాప్ల‌ను ఇన్‌స్టాల్ కూడా చేయ‌వ‌ద్దు:
ఫేస్‌బుక్ లేదా ఏదైనా ఇత‌ర ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల‌లో మీకు లోన్ ఇచ్చే యాప్‌ల‌కు సంబంధించినవి క‌నిపిస్తే వాటిని క్లిక్ చేయ‌కండి. అస‌లు అలాంటి యాప్స్‌ను మీ మొబైల్స్ ఇన్‌స్టాల్ కూడా చేసుకోకండి. ఈ యాప్స్ భూతాల మాదిరి మీ డేటాను త‌స్క‌రించి త‌ప్పు మార్గంలో వినియోగించుకుంటాయి. మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసిన వెంట‌నే మీ డేటాను అవి తీసుకుంటాయి. మీ మొబైల్స్‌లో ఏదైనా సున్నిత మైన డేటా ఉంటే వాటిని మీకు బాధ క‌లిగించే రీతిలో ఉప‌యోగించే అవ‌కాశం ఉంటుంది.

గూగుల్ ప్లే స్టోర్ వాటికి లొసుగుల‌ను క‌నుగొని వాటి ద్వారా డేటాను సేక‌రిస్తున్నట్లు తెలుస్తోంది. చదువుకున్న వ్యక్తులు ఇలాంటి యాప్స్‌కు యాక్సెస్ ఇచ్చే క్ర‌మంలో వాటి తీరును గుర్తించే ఆస్కారం ఉంటుంది. కానీ, త‌క్ష‌ణ రుణ స‌దుపాయం కోరుకునే చాలా మంది వినియోగదారులు అన్ని హెచ్చరికలను విస్మరించి, వారి డివైజ్‌ నుండి అవసరమైన డేటాను సేకరించడానికి యాప్‌కు అవసరమైన అనుమ‌తులు ఇస్తున్నారు. అలా ఆ యాప్స్‌కు మీ డేటాపై యాక్సెస్ ఇచ్చిన త‌ర్వాత.. మీరు లోన్ రీపేమెంట్ చేయ‌డంలో విఫ‌ల‌మైతే ఆ యాప్స్ మీ డేటాను మిస్ యూజ్ చేసే ముప్పు ఉంటుంది. యూజ‌ర్ల‌ ఫొటోలు, లేదా వీడియోల‌ను మార్ఫింగ్ చేయ‌వ‌చ్చు, లేదా మీ కాంటాక్ట్స్‌కు స్పామ్ కాల్స్ చేయ‌వ‌చ్చు. త‌ద్వారా యూజ‌ర్లు ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ కంప్లైంట్‌ పోర్ట‌ల్స్‌ లో ఈ త‌ర‌హా మోసాల‌పై ఫిర్యాదులు ఎక్కువ‌గా వ‌స్తున్న‌ట్లు స‌మాచారం.

Best Mobiles in India

English summary
WhatsApp Scam Alert: Retired Teacher Loses Rs. 21 Lakh

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X