Home
News

వాట్సాప్‌, టెలిగ్రామ్‌లో అదిరిపోయే ఫీచర్లు.. యూజర్‌ నేమ్‌, లాగౌట్‌ సహా..!

వాట్సాప్‌ త్వరలో యూజర్లను మరింత ఆకట్టుకొనే విధంగా అద్భుతమైన ఫీచర్లను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌లో (Whatsapp) కస్టమైజ్‌ లిస్ట్‌, వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌ నుంచే కాలింగ్‌, iOS యూజర్లకు మెసేజ్‌ షెడ్యూల్‌ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తున్నట్లు వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo ఇటీవల వెల్లడించింది. దీంతోపాటు వాట్సాప్‌ గ్రూప్‌లో కొత్తగా చేరినవారు కూడా అప్పటికే గ్రూప్‌లో జరుగుతున్న సంభాషణ గురించి తెలుసుకొనే ఫీచర్‌ ఇటీవల లాంచ్‌ అయింది.

దీంతోపాటు వాట్సాప్‌ గెస్ట్‌ యూజర్‌ ఫీచర్‌ పైన పనిచేస్తోందని ఫీచర్‌ ట్రాకర్ ఇటీవలే వెల్లడించింది. వీటితోపాటు వాట్సాప్‌ ఫ్యూచర్‌ అప్‌డేట్స్‌పై అనేక వివరాలు వెల్లడయ్యాయి. యూజర్ల వ్యక్తిగత గోప్యత, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వాట్సాప్ ఈ ఫీచర్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.

whatsapp  telegram new updates march 2026

నాయిస్‌ క్యాన్సిలేషన్‌ :
వాట్సాప్‌ కాలింగ్‌ సమయంలో అనవసర శబ్ధాలు నియంత్రించేలా నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ను తీసుకురానుంది. ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ఈ అప్‌డేట్‌ కనిపించింది. ఫలితంగా రద్దీ ప్రాంతాల్లోనూ సౌకర్యవంతంగా వాట్సాప్‌ వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు.

వాట్సాప్ లాగౌట్‌ :
వాట్సాప్‌లో లాగౌట్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇటీవల ఈ ఫీచర్‌ గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ టెస్టింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాగౌట్‌ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేయడం లేదా డేటాను కోల్పోవాల్సిన అవసరం లేకుండానే తాత్కాలికంగా లాగౌట్‌ కావచ్చు.

వాట్సాప్ యూజర్‌ నేమ్ :
వాట్సాప్‌ యూజర్ నేమ్‌ ఫీచర్‌ గురించి కూడా గతంలో వివరాలు వచ్చాయి. తాజాగా ఈ ఫీచర్‌ గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫీచర్‌ ఈ సంవత్సరం జూన్‌ నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే.. అపరిచిత వ్యక్తులకు ఫోన్‌ నంబర్‌ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే వాట్సాప్‌లో చాట్‌ చేయవచ్చు. టెలిగ్రామ్‌, ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే యూజర్‌నేమ్ ఫీచర్‌ అందుబాటులో ఉంది. చాట్ విండోలో యూజర్‌నేమ్‌ సెర్చ్‌ చేసి, చాటింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

టెలిగ్రామ్‌ లోనూ :
టెలిగ్రామ్‌ కూడా యూజర్ల కోసం అనేక ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రైవసీకి ప్రాధాన్యత ఇచ్చే యూజర్ల కోసం ఈ ఫీచర్లను లాంచ్‌ చేసింది. ఇందులో కొన్ని ఫీచర్లు ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టెలిగ్రామ్‌లో వ్యక్తిగత చాట్‌లో మెసేజ్‌లను ఇతరులకు ఫార్వర్డ్‌ చేయడం, స్క్రీన్‌షాట్లను నియంత్రించేందుకు ప్రైవసీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్‌ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

దీంతోపాటు టెలిగ్రామ్‌ (Telegram) యూజర్లు తమ పేరు పక్కన రోల్‌ను కూడా యాడ్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు ఫోటోలను సులభంగా స్టిక్కర్లుగా మార్చుకొనేందుకు మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతోపాటు iOS యూజర్ల కోసం లిక్విడ్‌ గ్లాస్‌ డిజైన్‌ను తీసుకొచ్చింది.

తాజాగా యూజర్లకు బాగా ఉపయోగపడే మరో ఫీచర్‌ అందుబాటులో ఉంది. AI సమ్మరీ ద్వారా పెద్ద ఆర్టికల్స్‌ లేదా మేసేజ్‌లను సులభంగా చిన్న సారాంశంగా మార్చేందుకు అవకాశం ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp, telegram new updates march 2026 username, logout and many features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X