Home
News

100 మీడియా ఫైల్ లను ఒకేసారి పంపేలా కొత్త వాట్సాప్ ఫీచర్! వివరాలు!

By Maheswara

వినియోగదారులకు మరియు వ్యాపారులకు అందరికీ అందుబాటులో ఉన్న అతిపెద్ద ఆన్‌లైన్ టెక్స్టింగ్ అప్లికేషన్‌లలో ఒకటైన వాట్సాప్, త్వరలోనే, వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురాబోతోంది. చాటింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు నిరంతరం ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లను అందిస్తూనే ఉన్నందున వాట్సాప్ వినియోగదారులకు ముఖ్యమైన వాటిలో ఒకటిగా ఉంది.

వాట్సాప్ లో 100 మీడియా ఫైల్ లను ఒకేసారి పంపే ఫీచర్

వాట్సాప్ లో 100 మీడియా ఫైల్ లను ఒకేసారి పంపే ఫీచర్

అతి త్వరలో, వాట్సాప్  వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ ఒకేసారి 100 మీడియా ఫైల్‌లను పంపడానికి వీలు కల్పించే లాగా కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఇది ఈ ప్లాట్‌ఫారమ్‌కు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. వాట్సాప్ తన వినియోగదారులలో చాలా మందికి ఒకే సమయంలో చాలా ఎక్కువ మీడియాను పంపగలిగేలా చేయడం ద్వారా వారి సమస్యను పరిష్కరిస్తుంది.

ప్రస్తుతం వినియోగదారులు వాట్సాప్‌లో ఎన్ని మీడియా ఫైల్‌ల పంపవచ్చు?

ప్రస్తుతం వినియోగదారులు వాట్సాప్‌లో ఎన్ని మీడియా ఫైల్‌ల పంపవచ్చు?

వాట్సాప్ వినియోగదారులు ప్రస్తుతం 30 మీడియా ఫైల్‌లను పంపడానికి అనుమతిస్తుంది. వినియోగదారులు ఎక్కువ మీడియా ఫైల్‌లను కలిపి పంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఫీచర్ కనిపిస్తుంది. కానీ IANS నివేదిక ప్రకారం, త్వరలోనే ఆ పరిమితిని 100కి పెంచుతారని సమాచారం ఉంది. ఆండ్రాయిడ్‌లోని కొంతమంది వాట్సాప్ బీటా వినియోగదారులు ఇప్పటికే, ఒకేసారి 100 మీడియా ఫైల్‌లను పంపగల ఈ కొత్త ఫీచర్ వాడటానికి అనుమతి కలిగి ఉన్నారు. ఇది అన్ని ముఖ్యమైన ఆల్బమ్‌లను మరియు మరిన్నిఫైల్ లను ఒకేసారి పంపడంలో వారికి సహాయపడుతుంది. వినియోగదారులు ఒకే ఫైల్‌లను అనేకసార్లు పంపకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది.

వాట్సాప్ గ్రూపుల పేర్లకు పరిమితి పెరిగింది

వాట్సాప్ గ్రూపుల పేర్లకు పరిమితి పెరిగింది

ఇటీవల, వాట్సాప్ లో వినియోగదారుల యొక్క గ్రూపుల సబ్జెక్ట్ ల యొక్క అక్షర పరిమితిని పెంచే పనిలో ఉన్నట్లు దీనికోసం కూడా కొత్త ఫీటురేను తీసుకువస్తున్నట్లు వరాలు చూసాము. గ్రూప్ అడ్మిన్‌లు వారి గ్రూప్‌లకు పేరు పెట్టేటప్పుడు మరింత స్వేచ్ఛను అందించడానికి గ్రూప్ సబ్జెక్ట్‌లోని క్యారెక్టర్‌లు 25 నుండి 100కి పెంచబడినప్పటికీ, గ్రూప్ డిస్క్రిప్షన్ 512 క్యారెక్టర్‌ల నుండి 2048 క్యారెక్టర్‌లకు పెరిగింది.

వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపే ఫీచర్

వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపే ఫీచర్

ప్రస్తుతం, వాట్సాప్ లో ఫోటోలను షేర్ చేసే సమయంలో ఆటోమేటిక్ గా కంప్రెస్ చేయబడి, తక్కువ రిజల్యూషన్‌ లో ఫోటోలు షేర్ అవుతుంటాయి. ఇప్పుడు రాబోయే ఈ కొత్త ఫీచర్ తో ఈ సమస్య పరిష్కారం కానుంది. WABetaInfo సమాచారం ప్రకారం, ఈ ఫంక్షనాలిటీ ఫీచర్ భవిష్యత్తులో WhatsApp అప్‌డేట్‌లో చేర్చబడే అవకాశం ఉంది, ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది అని సమాచారం.

ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపే ఫీచర్ ని ఎలా వాడాలి?

ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపే ఫీచర్ ని ఎలా వాడాలి?

ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు WhatsApp యొక్క "సెట్టింగ్‌లు" విభాగంలో, వినియోగదారులు ఇతర వ్యక్తులకు పంపే చిత్రాల కోసం నాణ్యత ప్రీసెట్‌ ఫంక్షన్ ను "ఆటోమేటిక్," కు బదులుగా "ఉత్తమ నాణ్యత" లేదా "డేటా సేవర్" ఆప్షన్ ని ఎంచుకోవడానికి వీలు కలిగి ఉంటారు. అయినప్పటికీ, ఒరిజినల్ క్వాలిటీ కాన్ఫిగరేషన్‌లో పంపే ఫోటోలు కూడా వాటి అసలు నాణ్యతతో పంపబడవు ఎందుకంటే అవి ఆటోమేటిక్ గా కంప్రెస్ చేయబడతాయి. ఆండ్రాయిడ్ 2.23.2.11 అప్‌డేట్ లో ఈ సరికొత్త వాట్సాప్ బీటా ఫీచర్‌ని పరీక్షిస్తోంది, ఇది వినియోగదారులు తమ ఒరిజినల్ క్వాలిటీలో ఫోటోలను షేర్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

మరిన్ని కొత్త ఫీచర్లు

మరిన్ని కొత్త ఫీచర్లు

ఇంకా, WABetaInfo నివేదిక ప్రకారం, ఈ ప్లాట్‌ఫారమ్ లో కాంటాక్ట్‌లను బ్లాక్ చేయడం కోసం షార్ట్‌కట్‌ను మరియు అప్లికేషన్ నుండి నేరుగా వీడియోలను రికార్డ్ చేయడానికి మరియు ఫోటోలను తీయడానికి వినియోగదారులను అనుమతించే విధంగా కొత్త ఫీచర్ ను కూడా తీసుకురావాలని భావిస్తోంది. ఈ అప్‌డేట్ చేయబడిన ఫీచర్‌లు WhatsApp యొక్క ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం ప్లాన్ చేసారు. మరియు ఈ ప్లాట్‌ఫారమ్‌ను సులభంగా ఉపయోగించడానికి వీలుగా మరో రెండు ఫీచర్లను వాట్సాప్ బీటా వెర్షన్‌లలో పరీక్షిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది.

Best Mobiles in India

English summary
WhatsApp To Launch New Feature To Share Up to 100 Media Files At A Time. Check New Updates Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X