WhatsApp కొత్త స్కామ్: UKలో జాబ్, ఫ్రీ వీసా పేరుతో మెసేజ్ వచ్చిందా? జర జాగ్రత్త...

|

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాడకం రోజు రోజుకి అధికమవుతుండడంతో ఇందులో పోస్ట్ చేసే ఏ విషయం అయినా కూడా ప్రజలకు చాలా త్వరగా చేరుతుంది. సైబర్ నేరగాళ్లు కూడా ఇదే చొరవతో రెచ్చిపోతున్నారు. వాట్సాప్ లో ఇప్పటికే చాలా స్కామ్ ల గురించి విన్నాము. ఇప్పుడు వాట్సాప్ లో మరొక కొత్త స్కామ్ హల్ చల్ చేస్తున్నది. విదేశాలలో జాబ్ చేయాలని కోరిక ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని UK లో జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటువంటి ఏదైనా మెసేజ్ మీకు వస్తే కనుక దానిని నమ్మకండి. ఈ స్కామ్ గురించి మీరు తెలుసుకోవలసిన మరిన్ని వివరాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

కొత్త ఫిషింగ్ స్కామ్

వాట్సాప్ యొక్క కొత్త ఫిషింగ్ స్కామ్ ప్రధానంగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో పని చేయాలనుకునే వారిని ఉద్దేశించి ప్రచారం చేస్తోంది. ఈ కొత్త స్కామ్ లోని విషయానికి వస్తే విదేశాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులకు ఉచిత వీసా మరియు ఇతర ప్రయోజనాలను అందిస్తున్నట్లు మెసేజ్ చూపుతుంది. వాట్సాప్ లో వచ్చే ఈ మెసేజ్ UK ప్రభుత్వం నుండి వచ్చినట్లు చూపుతుంది. 2022లో UKకి 132,000 మందికి పైగా అదనపు కార్మికులు అవసరం ఉంది. స్పాట్‌లో జాబ్ ఆఫర్ లెటర్ అందించబడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తూ అప్లికేషన్లను స్వీకరిస్తున్నట్లు తెలుపుతూ మెసేజ్ ని పంపుతారు.

Malwarebytes

Malwarebytes నివేదిక ప్రకారం వాట్సాప్ వినియోగదారులు వారి మొబైల్ యాప్‌లో ఈ స్కామ్ కి సంబందించిన మెసేజ్లను స్వీకరిస్తున్నారని నివేదించబడింది. ఉచిత వీసా మరియు ఇతర ప్రయోజనాలను అందిస్తోంది, ముఖ్యంగా అందరూ పని కోసం UKకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నవారికి. ఈ స్కామ్‌లో WhatsApp వినియోగదారులకు సందేశాలు పంపడం మరియు 2022లో UKకి 132,000 మంది అదనపు కార్మికులు అవసరమని వారికి చెప్పడంతో పాటు 186,000 ఖాళీ జాబ్ స్పాట్‌లు అందుబాటులో ఉండటంతో ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది.

వాట్సాప్ స్కామ్‌
 

వాట్సాప్ వినియోగదారులు ఈ స్కామ్‌కు సంబందించిన మెసేజ్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక వారికి UK వీసాలు మరియు ఇమ్మిగ్రేషన్ వెబ్‌సైట్‌గా మాస్క్వెరేడింగ్ చేయబడిన మోసపూరిత డొమైన్ అందించబడుతుంది. అంతేకాకుండా "యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వేలాది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని" విదేశీయులను కోరుతున్నారు.

ప్రోగ్రామ్ యొక్క ప్రయోజనం

"దరఖాస్తుదారు తప్పనిసరిగా 16 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి మరియు ప్రాథమిక ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. ప్రోగ్రామ్ యొక్క ప్రయోజనం: ప్రయాణ ఖర్చులు, హౌసింగ్, వసతి మరియు వైద్య సదుపాయాలు, తక్షణమే పనికల్పించడం వంటివి ఆఫర్ చేస్తుంది. వీసా దరఖాస్తు కోసం అన్నీ రకాల జాతీయులు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి కలిగి ఉంది. పని చేయాలనుకునే మరియు చదువుకోవాలనుకునే విద్యార్థులందరికీ కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కావున ఇక్కడ దరఖాస్తు చేసుకోండి." అని తెలుపుతూ వెబ్ సైట్ లో చూపుతుంది.

WhatsApp కొత్త స్కామ్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం

WhatsApp కొత్త స్కామ్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం

వాట్సాప్ యాప్‌లో స్కామ్‌లు అనేవి కొత్తేమీ కాదు. గతంలో కూడా పలు కేసులు నమోదై వినియోగదారులు చాలా మంది భారీగా డబ్బును పోగొట్టుకున్నారు. వాట్సాప్‌లోని మెసేజ్లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడినందున మోసగాళ్ళను కనుగొనడం కష్టం అవుతుంది. అటువంటి స్కామ్‌లను నివారించడానికి సులభమైన మరియు ఉత్తమమైన మార్గం ఏమిటంటే ఇటువంటి మెసేజ్ లకు దూరంగా ఉండడం. మీరు భారీ మొత్తంలో డబ్బును సంపాదించాలని ఆశ కలిగి ఉన్న వారు అయితే కనుక విదేశాలలో ఉద్యోగం పొందడం కోసం లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం ఈ రకమైన సమాచారంతో కూడిన మెసేజ్ లను విస్మరించడం మంచిది.

స్కామ్

సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ స్కామ్‌లు వినియోగదారుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని, వారి పేర్లు, ఇమెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్‌లు, వైవాహిక స్టేటస్ మరియు ఉద్యోగ రీత్యా వారి స్టేటస్ వంటి సమాచారాన్ని తెలుసుకునే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఉచిత దరఖాస్తు ఫారమ్ స్వయంచాలకంగా 'ఆమోదించబడిందని' నివేదిక పేర్కొంది. అలాగే బాధితులకు "ఉచితంగా UKలో వర్క్ పర్మిట్, వీసా, విమాన టిక్కెట్లు మరియు వసతి ఇవ్వబడుతుంది" అని కూడా చూపుతుంది. విదేశాలలో ఎవరు కూడా ఉచితంగా ఉద్యోగం ఇవ్వరు అని గుర్తుంచుకోండి. కావున ఇది నిజం కాదు జస్ట్ ఒక "స్కామ్" అంతే.

వాట్సాప్ KBC స్కామ్?

వాట్సాప్ KBC స్కామ్?

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు రూ.25 లక్షలు గెలుచుకున్నట్లు వాట్సాప్‌ల మెసేజ్‌లు అందుకున్నట్లు సమాచారం. ప్రసిద్ధి చెందిన కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC) అనే షో ద్వారా లాటరీ రూపంలో 25 లక్షలు అందుకున్నట్లు మెసేజ్ అందుకున్నట్లు వాట్సాప్ యూజర్లు చెబుతున్నారు. KBC ఫ్రాడ్‌గా పేర్కొనబడిన ఈ స్కామ్‌లో మీరు రూ.25 లక్షల లాటరీని గెలుచుకున్నట్లు మిమ్మల్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తు కొన్ని హానికరమైన లింకులతో కనిపించే మెసేజ్ ఉంటుంది. 25 లక్షల లాటరీ మొత్తం అనేది చాలా పెద్దది కాబట్టి తెలియని వ్యక్తులు దాని కోసం ఆశపడి మోసగాళ్లు పన్నిన ఉచ్చులో పడి వారి వద్ద ఉన్న డబ్బును కూడా పోగొట్టుకుంటారు. ఈ స్కామ్ మెసేజ్‌లో భారీ మొత్తంలో ఆఫర్ చేయడమే కాకుండా ఇది నిజం అని నమ్మించడానికి గల మరొక కారణం ఈ మెసేజ్ ప్రైవేట్ నంబర్‌తో డెలివరీ చేయడం. వ్యక్తులు ఎవరైనా సరే ప్రైవేట్ నంబర్‌కు మెసేజ్ వచ్చినందున అది నిజమని నమ్మే అవకాశం అధికంగా ఉంది. KBC స్కామ్ మెసేజ్ లోని సారాంశం విషయానికి వస్తే ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ మరియు అమితాబ్ బచ్చన్‌ వంటి ప్రముఖ వ్యక్తుల ఫోటోలు కూడా కనిపిస్తాయి. ఈ వ్యక్తుల ఫోటోలు ఇంటర్నెట్‌లో మరియు ప్రకటనలలో హల్‌చల్ చేస్తున్నందున బ్యాంక్ మేనేజర్‌లుగా చూపుతున్న మోసగాళ్ల వాట్సాప్ నంబర్‌లను కూడా కలిగి ఉన్న టెక్స్ట్‌ను ప్రజలు మరింత నమ్మేలా చేస్తున్నారు. మెసేజ్ లో వారు ఇచ్చిన నంబర్‌కు సంప్రదించడం ప్రారంభించడంతో మీరు మోసపోవడానికి ముందు అడుగు వేసిన వారు అవుతారు.

Best Mobiles in India

English summary
WhatsApp UK Job Offer New Scam: Free Visa and Accommodation in UK

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X