వాట్సప్ ద్వారా కేవలం 5 నిమిషాల్లోనే బ్యాంక్ అకౌంట్ చేయండి

By Gizbot Bureau
|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ రోజు రోజుకు సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. ఈ నేపథ్యంలోనే యూజర్లకు మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై యూజర్లు వాట్సప్‌తోనే బ్యాంక్ అకౌంట్ ప్రారంభించవచ్చు. ఈ అవకాశం ఇప్పుడు యూజర్లకు అందుబాటులో ఉంది.

WhatsApp user can open a bank account instantly

అయితే అన్ని బ్యాంకులు ఈ సేవలు అందించడం లేదు. కేవలం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాత్రమే ఇలాంటి సర్వీసులు అందిస్తోంది. వాట్సప్‌ ద్వారా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు. ఈ సేవల కోసం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్యారిక్స్ మొబైల్‌తో జతకట్టింది. దీంతో వాట్సప్ ద్వారా కేవలం 5 నిమిషాల్లోనే బ్యాంక్ ఖాతా పొందొచ్చు.

 బ్యాంకింగ్ సేవలను

బ్యాంకింగ్ సేవలను

ప్రజల దైనందిన కార్యక్రమాల్లో ప్రస్తుతం వాట్సప్ కూడా ఒక భాగమైంది. అందువల్ల మేం కూడా బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేసేందుకు వాట్సాప్‌ ద్వారా అకౌంట్ ఓపెనింగ్ సేవలు అందించాలని నిర్ణయించాం' అని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో సంజయ్ అగర్వాల్ తెలిపారు. మరోవైపు వాట్సప్ బ్యాంకింగ్ సేవల కోసం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో జతకట్టడం సంతోషంగా ఉందని క్యారిక్స్ మొబైల్ సీవోవో దీపక్ గోయెల్ తెలిపారు.

అంత సులువైన అంశం కాదు

అంత సులువైన అంశం కాదు

మెసేజింగ్ యాప్‌లో బ్యాంకింగ్ సేవలు లాంచ్ చేయడం అంత సులువైన అంశం కాదని, బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా అంశాలు ఉంటాయని వివరించారు. ఇకపోతే ఏయూ బ్యాంక్ తన కస్టమర్లకు వాట్సప్ ద్వారా అకౌంట్ ఓపెనింగ్ సేవలతోపాటు ఇతర సర్వీసులు కూడా అందించాలని భావిస్తోంది.

 వాట్సప్ హ్యకింగ్

వాట్సప్ హ్యకింగ్

ఇదిలా ఉంటే వాట్సప్ ని ఏ క్షణమైనా హ్యాక్ చేయవచ్చని ఇజ్రాయిల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్‌పాయింట్ తెలిపింది. వాట్సప్‌ని హ్యాక్ చేసి మెసేజెస్‌ని మార్చడం ఎంత ఈజీనో ఆధారాలతో సహా చూపిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. వాట్సప్‌లో ఛాటింగ్‌ సమయంలో పంపే మెసేజ్‌లను హ్యాకర్లు తమకు నచ్చినట్టుగా ఎడిట్ చేయడం, మెసేజ్‌ను మార్చడం, అవాస్తవాలను సృష్టించడం, గ్రూప్‌లో కొందరికి మాత్రమే మెసేజ్ చేరేలా చేయడం పెద్ద కష్టమేమీ కాదని తెలిసింది.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా

వాట్సప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉందని ఆ సంస్థ పదేపదే చెబుతోంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా మెసేజ్ పంపిన వ్యక్తి, పొందిన వ్యక్తి తప్ప ఇంకెవరూ హ్యాక్ చేసి మెసేజ్‌లు చూడలేనంత భద్రంగా ఉందని వాట్సప్ అనేకసార్లు వెల్లడించింది. కానీ మెసేజ్ వెళ్లకముందే డీక్రిప్ట్ చేసి మెసేజ్‌ను మార్చడం సులువని చెక్‌పాయింట్ బయటపెట్టింది. వాట్సప్ ఎన్‌క్రిప్షన్ ఆల్గరిథమ్‌ను రివర్స్ ఇంజనీర్ చేసింది చెక్‌పాయింట్. వాట్సప్ మెసేజ్‌ను డీక్రిప్ట్ చేయడం ద్వారా దాన్ని ఎలాగైనా మార్చే యాక్సెస్ లభిస్తుందని రుజువు చేసింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌లో అతిపెద్ద లోపం బయటపడటంతో చెక్ పాయింట్ సంస్థ ఆ విషయాన్ని వాట్సప్‌కు తెలిపింది .

Best Mobiles in India

English summary
WhatsApp user? Now, you can open a bank account using this instant messaging app

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X