WhatsApp లో 25 లక్షల KBC లాటరీ మెసేజ్ వచ్చిందా? నమ్మారో అంతే...

|

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాడకం అధిక ఉండడంతో ఇందులో పోస్ట్ చేసే ఏ విషయం అయినా కూడా ప్రజలకు చాలా త్వరగా చేరుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వాట్సాప్ లో KBC స్కామ్ కి సంబంధించి ఒక మెసేజ్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వినియోగదారులు రూ.25 లక్షల మొత్తాన్ని లాటరీ రూపంలో అందుకున్నట్లు మీ వాట్సాప్ నంబర్‌కు ఏదైనా మెసేజ్ ని స్వీకరించినట్లయితే కనుక మీరు దానిని పట్టించుకోవద్దని సలహా ఇస్తున్నారు. లేకుంటే మీరు మోసగాళ్ల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. రాజస్థాన్, యుపి, బీహార్ మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది వ్యక్తులు తమ వాట్సాప్ నంబర్‌కు వచ్చిన అలాంటి మెసేజ్లను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. జోరుగా సాగుతున్న ఈ స్కామ్‌ను వివరిస్తూ ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ సిటీ పోలీసులు ఓ చిన్న వీడియోను ట్వీట్ చేశారు.

 

వాట్సాప్ KBC స్కామ్?

వాట్సాప్ KBC స్కామ్?

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు రూ.25 లక్షలు గెలుచుకున్నట్లు వాట్సాప్‌ల మెసేజ్‌లు అందుకున్నట్లు సమాచారం. ప్రసిద్ధి చెందిన కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC) అనే షో ద్వారా లాటరీ రూపంలో 25 లక్షలు అందుకున్నట్లు మెసేజ్ అందుకున్నట్లు వాట్సాప్ యూజర్లు చెబుతున్నారు. KBC ఫ్రాడ్‌గా పేర్కొనబడిన ఈ స్కామ్‌లో మీరు రూ.25 లక్షల లాటరీని గెలుచుకున్నట్లు మిమ్మల్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తు కొన్ని హానికరమైన లింకులతో కనిపించే మెసేజ్ ఉంటుంది.

25 లక్షల లాటరీ

25 లక్షల లాటరీ మొత్తం అనేది చాలా పెద్దది కాబట్టి తెలియని వ్యక్తులు దాని కోసం ఆశపడి మోసగాళ్లు పన్నిన ఉచ్చులో పడి వారి వద్ద ఉన్న డబ్బును కూడా పోగొట్టుకుంటారు. ఈ స్కామ్ మెసేజ్‌లో భారీ మొత్తంలో ఆఫర్ చేయడమే కాకుండా ఇది నిజం అని నమ్మించడానికి గల మరొక కారణం ఈ మెసేజ్ ప్రైవేట్ నంబర్‌తో డెలివరీ చేయడం. వ్యక్తులు ఎవరైనా సరే ప్రైవేట్ నంబర్‌కు మెసేజ్ వచ్చినందున అది నిజమని నమ్మే అవకాశం అధికంగా ఉంది.

KBC స్కామ్ మెసేజ్
 

KBC స్కామ్ మెసేజ్ లోని సారాంశం విషయానికి వస్తే ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ మరియు అమితాబ్ బచ్చన్‌ వంటి ప్రముఖ వ్యక్తుల ఫోటోలు కూడా కనిపిస్తాయి. ఈ వ్యక్తుల ఫోటోలు ఇంటర్నెట్‌లో మరియు ప్రకటనలలో హల్‌చల్ చేస్తున్నందున బ్యాంక్ మేనేజర్‌లుగా చూపుతున్న మోసగాళ్ల వాట్సాప్ నంబర్‌లను కూడా కలిగి ఉన్న టెక్స్ట్‌ను ప్రజలు మరింత నమ్మేలా చేస్తున్నారు. మెసేజ్ లో వారు ఇచ్చిన నంబర్‌కు సంప్రదించడం ప్రారంభించడంతో మీరు మోసపోవడానికి ముందు అడుగు వేసిన వారు అవుతారు.

ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్

ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ బ్లాగ్ పోస్ట్‌లో ఇచ్చిన వివరణ ప్రకారం బాధితుడు KBC స్కామ్ లో చూపే మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి పేర్కొన్న నంబర్‌కు సంప్రదించినప్పుడు సైబర్ నేరగాళ్లు లాటరీ మరియు GST యొక్క ప్రాసెసింగ్‌కు కొంత వాపసు చేయదగిన మొత్తాన్ని అడుగుతాడు. "బాధితుడు ఆ డబ్బును డిపాజిట్ చేసిన తర్వాత వారు ఏదో ఒక సాకుతో ఎక్కువ మొత్తం డిమాండ్ చేయడం ప్రారంభిస్తారు. కొంతకాలం తర్వాత వారు లాటరీ మొత్తాన్ని 45 లక్షలు, ఆపై రూ. 75 లక్షలకు మరింత పెంచారని బాధితుడికి చెప్పడం ప్రారంభిస్తారు అని బ్లాగ్ తెలిపింది.

మోసగాళ్లు

మోసగాళ్లు అధికంగా వాట్సాప్ ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేయాలని పట్టుబడతారు మరియు డబ్బును డిపాజిట్ చేయడానికి బహుళ బ్యాంక్ అకౌంటులను పంచుకుంటారు. కొన్నిసార్లు ఇటువంటి మోసం అనేక వారాలు లేదా నెలలపాటు కొనసాగుతుంది. వారు డబ్బును పొందడానికి బాధితుడిని ఎంతకాలం మోసం చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. బాధితులు అతను/ఆమె ఈ స్కామ్ లో పడి మోసపోయామని గ్రహించే సమయానికి మోసగాళ్ళు అప్పటికే కమ్యూనికేషన్‌ను నిలిపివేస్తారు.

వాట్సాప్ KBC స్కామ్ నుండి సేఫ్ గా ఉండడం ఎలా?

వాట్సాప్ KBC స్కామ్ నుండి సేఫ్ గా ఉండడం ఎలా?

వాట్సాప్ లో స్కామ్ కు సంబందించిన మెసేజ్ లు రావడం అనేది కొత్త విషయం కాదు. గతంలో కూడా అనేక మంది డబ్బు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. వాట్సాప్‌లోని మెసేజ్లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడినందున మోసగాళ్ళను కనుగొనడం కష్టం అవుతుంది. డబ్బును పోగొట్టుకోకుండా ఉండేందుకు సులభమైన మరియు ఉత్తమమైన మార్గం ఏమిటంటే లాటరీ గెలుచుకున్నట్లు వచ్చే ఏదైనా వచ్చిన దానిని నమ్మకపోవడం ఒకటే మార్గం. భారీ మొత్తంలో డబ్బు పొందడం గురించి మాట్లాడే సమాచారంతో కూడిన మెసేజ్ లు ఏవి వచ్చిన కూడా వాటిని పట్టించుకోకండి.

 

స్కామ్‌

మీరు స్కామ్‌కు సంబందించిన ఉచ్చులో పడవేయడానికి కొన్నిసార్లు మోసగాళ్లు మిమ్మల్ని అనుసరిస్తారు. వాపసు చేయదగిన డబ్బును పంపడం కోసం మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలు, ఇమెయిల్ అడ్రస్, ఇంటి అడ్రస్ మరియు UPI ID వంటి వ్యక్తిగత వివరాలు అడిగే స్కామర్‌లు ఇందులో ఉండవచ్చు. పైన పేర్కొన్న వివరాలను మీరు ఎవరితోనూ ఎటువంటి పరిస్థితులలో కూడా పంచుకోకూడదు.

మీరు WhatsApp KBC స్కామ్ బాధితులా?

మీరు WhatsApp KBC స్కామ్ బాధితులా?

మీరు వాట్సాప్ KBC స్కామ్ యొక్క బాధితులుగా ఉండి మీరు డబ్బును మోసపోయినట్లయితే కనుక మీరు ఫిర్యాదును నమోదు చేయడానికి పోలీసు లేదా సైబర్ సెల్‌ను సంప్రదించవచ్చు. మీరు ఆరోపించిన వ్యక్తి/వెబ్‌సైట్ మరియు మీరు వారిని ఎలా సంప్రదించారో వంటి వివరాలను అందివ్వవలసి ఉంటుంది. అలాగే మీ ఫిర్యాదులో మీ యొక్క సంభాషణలు, నంబర్‌లు మరియు అడ్రసులు (ఏదైనా ఉంటే) స్క్రీన్‌షాట్‌లు మరియు బ్యాంక్ లావాదేవీ స్టేట్‌మెంట్‌ల వంటి సాక్ష్యాలను చూపించే పత్రాలను అందించాలి.

Best Mobiles in India

English summary
WhatsApp Users Alert! Do Not be Fool Believing Rs.25 Lakh Lottery KBC Scam Message

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X