Home
News

వాట్సాప్ యొక్క ఈ వెర్షన్ ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీ డేటా మొత్తం గల్లంతే!!

గూగుల్ ప్లే స్టోర్ తన ప్లాట్‌ఫారమ్‌ను మరింత సురక్షితంగా ఉంచడం కోసం ఇటీవల అనేక యాప్‌లను నిషేధించింది. కానీ గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పటికీ వివిధ యాప్‌ల యొక్క సవరించిన వెర్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లు యూజర్ డివైజ్‌కి హానీచేసే బగ్ లను అందిస్తున్నాయి. ఇప్పుడు Android యూజర్ల కోసం WhatsApp యొక్క సవరించిన సంస్కరణలో కొత్త బగ్ కనుగొనబడింది. దీనిని ట్రోజన్ ట్రయాడా అంటారు. ఈ మాల్వేర్ పేలోడ్‌ను డౌన్‌లోడ్ చేయగలదు. ఇది వినియోగదారుల అనుమతి లేకుండానే మీ డివైస్ లో హానికరమైన కార్యకలాపాలను మరింత పెంచుతుంది.

FMWhatsApp 16.80.0

నివేదికల ప్రకారం సైబర్ సెక్యూరిటీ మేజర్ కాస్పెర్స్కీ యొక్క పరిశోధనా బృందం ఇటీవలి నివేదికలో ఈ కొత్త అభివృద్ధిని పంచుకుంది. ఇది "ట్రోజన్ ట్రయాడా FMWhatsApp 16.80.0 WhatsApp యొక్క సవరించిన సంస్కరణను ప్రభావితం చేస్తుంది. అసలు వాట్సాప్‌లో కనిపించని అదనపు ఫీచర్‌లను వినియోగదారులకు అందించడానికి ఇటువంటి సవరించిన యాప్‌లు తయారు చేయబడ్డాయి. FMWhatsApp మోడిఫైడ్ యాప్ డౌన్‌లోడ్ చేయడం వల్ల మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు.

ట్రోజన్

కాస్పెర్స్కీ ప్రకారం "ట్రోజన్ ట్రయాడా ఇప్పుడు దాని ప్రకటన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK) తో FMWhastApp యొక్క కొత్త వెర్షన్‌లోకి ప్రవేశించింది. మీరు ట్రోజన్ సోకిన యాప్‌ను లాంచ్ చేస్తే అది డివైజ్ ఐడెంటిఫైయర్‌లను (డివైజ్ ఐడి, సబ్‌స్క్రైబర్ ఐడి, ఎంఎసి అడ్రస్) సేకరించి వాటిని రిమోట్ సర్వర్‌కు తిరిగి పంపుతుంది. సర్వర్ కొత్త పరికరాన్ని నమోదు చేసి పేలోడ్ కోసం లింక్‌ని తిరిగి పంపుతుంది. యాప్‌లోని ట్రోజన్ ఈ పేలోడ్‌ను సోకిన పరికరానికి డౌన్‌లోడ్ చేస్తుంది. ఆ తర్వాత అది కంటెంట్‌ని డీక్రిప్ట్ చేస్తుంది.

WhatsApp

FM WhatsApp ద్వారా ఇలాంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్న వివిధ రకాల మాల్వేర్‌లు పరిశోధకులు కనుగొన్నారు. వారు పొందిన వీక్షణల సంఖ్యను పెంచడానికి ఫుల్ స్క్రీన్ యాడ్‌లను కలిగి ఉన్న సోకిన పరికరంలో బహుళ విధులను నిర్వహించగల మరొక వైరస్ ఉంది. వారి సమ్మతి లేకుండా పేమెంట్ సభ్యత్వాల కోసం వారు పరికర యజమానిని కూడా సైన్ అప్ చేయవచ్చు. ఇది మాత్రమే కాదు మీ పేరిట స్పామ్ మరియు మాల్వేర్‌లను వ్యాప్తి చేయడానికి హ్యాకర్లు ఈ ఖాతాలను కూడా హైజాక్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
WhatsApp Users Alert: If You Download This Version of WhatsApp All Your Data Will be Stolen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X