Valentine's Day గిఫ్ట్ పేరుతో వాట్సాప్‌లో కొత్త స్కామ్!! జరభద్రం

|

వాట్సాప్‌ ప్లాట్‌ఫాంలో నకిలీ మెసేజ్ లు ఫార్వర్డ్ అవ్వడం కొత్త కాదు. స్కామర్లు ప్రజలను మోసగించడానికి ఎక్కువగా ఉపయోగించే యాప్ లలో వాట్సాప్ ముందువరుసలో ఉంది. ఫిబ్రవరి నెల అంటే మొదట అందరికి గుర్తువచ్చే మొదటి విషయం వాలెంటైన్స్ డే. ఈ రోజును జరుపుకోవడానికి చాలా మంది లవర్స్ విలాసవంతమైన హోటళ్లకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. దీనిని ఆసరాగా తీసుకొని స్కామర్లు తాజ్ హోటళ్లలో 7 రోజులపాటు ఉచితంగా బసచేయడం కోసం బహుమతి కార్డును గెలుచుకొండి అంటూ వినియోగదారులను మోసం చేయడానికి వాట్సాప్‌లో నకిలీ మెసేజ్ లను పంపుతున్నారు. దీని గురించి మరింతగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

తాజ్ ఎక్స్‌పీరియన్స్ గిఫ్ట్ కార్డ్

వాట్సాప్‌లో ఇప్పుడు ప్రసారం చేయబడుతున్న నకిలీ వెబ్‌సైట్ లింక్ తో కూడిన తప్పుడు మెసేజ్ తాజ్ హోటల్ వాలెంటైన్స్ డే చొరవను ప్రోత్సహిస్తూ "తాజ్ ఎక్స్‌పీరియన్స్ గిఫ్ట్ కార్డ్‌" ను అందిస్తుందని చూపుతోంది. అయితే తాజ్ హోటల్స్ యాజమాన్యం అటువంటి ప్రమోషన్ ఏది కూడా తాము ఇవ్వలేదని ఇప్పటికే ప్రకటించింది.

వాట్సాప్‌లో తాజ్ హోటల్ స్కామ్

వాట్సాప్‌లో తాజ్ హోటల్ స్కామ్

వాట్సాప్‌లో "నేను TAJ హోటల్ నుండి బహుమతి కార్డును అందుకున్నాను. తాజ్ హోటల్‌లో 7 రోజులపాటు ఉచితంగా ఉండటానికి అవకాశం వచ్చింది." అంటూ ఒక లింక్‌తో కూడిన ఒక టెక్స్ట్‌ మెసేజ్ ఇప్పుడు హల్ చల్ చేస్తున్నది. వినియోగదారుడు ఆ లింక్‌ను క్లిక్ చేసినతరువాత "తాజ్ అనుభవాలు గిఫ్ట్ కార్డ్ తాజ్ హోటల్ వాలెంటైన్స్ డేను జరుపుకోవడానికి 200 బహుమతి కార్డులను పంపింది. TAJ లోని ఏ హోటల్‌లోనైనా 7 రోజులు ఉచితంగా ఉండటానికి మీరు ఈ కార్డును ఉపయోగించవచ్చు. మీరు చేయాల్సిందల్లా సరైన బహుమతి బాక్స్ ను ఓపెన్ చేయడం. మీ అదృష్టం కోసం 3 ప్రయత్నాలు ఉన్నాయి" అంటూ సారాంశం ఉంటుంది.

తాజ్ హోటల్ బుకింగ్ నకిలీ మెసేజ్
 

తాజ్ హోటల్ బుకింగ్ నకిలీ మెసేజ్

వినియోగదారుడు "ok" పై క్లిక్ చేసినప్పుడు పేజీ మీ లింగాన్ని అడిగే చిన్న ప్రశ్నతో నకిలీ వెబ్ సైట్ కు మళ్ళించబడుతుంది. ఇందులో మీరు తాజ్ హోటళ్ల గురించి విన్నట్లయితే మీరు హోటల్‌ను ఎలా రేట్ చేస్తారు వంటివి ఉంటాయి. వినియోగదారుడు ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చిన తరువాత వారికి టాటా మోటార్స్ గుర్తుతో 12 ఎరుపు పెట్టెలను చూపించే పేజీకి మళ్ళించబడతారు. వారు బహుమతి కార్డును గెలుచుకున్నారో లేదో చూడటానికి వినియోగదారులు తప్పనిసరిగా యాదృచ్ఛిక పెట్టెపై క్లిక్ చేయాలి. ఎవరైనా బహుమతి కార్డును గెలిస్తే ఆ బహుమతిని పొందటానికి తదుపరి పేజీకి వెళ్ళమని అడుగుతారు. అక్కడ మీరు వాట్సాప్‌లోని 20 వ్యక్తిగత అకౌంట్ లకు మరియు ఐదు గ్రూప్ లకు మెసేజ్ ను పంపమని అడుగుతారు. మాల్వేర్ కలిగి ఉన్న లింక్‌లపై క్లిక్ చేయడానికి స్కామ్‌స్టర్స్ డూప్ వాట్సాప్ వినియోగదారులకు ఇది ఒక క్లాసిక్ మార్గం. ఇది తప్పుడు ప్రమోషన్ యొక్క మరొక మార్గం కావున దీనికి దూరంగా ఉండడం మంచిది.

Best Mobiles in India

English summary
WhatsApp Valentine's Day Special scam!! Won 7 Days Free Coupon Stay at Taj

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X