వాట్సాప్ వాయిస్ కాలింగ్, ఆ లింక్‌తో జాగ్రత్త..?

Posted By:

స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న దాదాపు ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్‌లను కలిగి ఉంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ ద్వారా చాటింగ్ ఇంకా ఫైల్ షేరింగ్ మాత్రమే సాధ్యమయ్యేది. ఇప్పుడు వాయిస్ కాలింగ్ కూడా సాధ్యమవుతోంది. వాట్సాప్ తాజాగా తన వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ వాయిస్ కాలింగ్ గురించి మీరు తెలుసుకోవల్సిన పలు ముఖ్యమైన విషయాలను మీముందుంచుతున్నాం....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్ వాయిస్ కాలింగ్, ఆ లింక్‌తో జాగ్రత్త..?

వాట్సాప్ వాయిస్ కాలింగ్ అంటే ఏంటి..?

వాట్సాప్ అనేది ఇన్‌స్టెంట్ మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్. నిన్న మొన్నటి వరకు ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ ద్వారా చాటింగ్ ఇంకా ఫైల్ షేరింగ్ మాత్రమే సాధ్యమయ్యేది. ఇప్పుడు వాయిస్ కాలింగ్ కూడా సాధ్యమవుతోంది. యూజర్లు వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ద్వారా తమ స్మార్ట్‌ఫోన్‌లోని మొబైల్ ఇంటర్నెట్ డేటా లేదా వై-ఫై నెట్ వర్క్ సహాయంతో వాయిస్ కాల్స్‌ను నిర్వహించుకోవచ్చు. మీరు ఎంపిక చేసుకున్న డేటా ప్లాన్ ఆధారంగా వినియోగం ఉంటుంది.

 

వాట్సాప్ వాయిస్ కాలింగ్ గురించి మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన విషయాలు

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ వాడుకుంటే ఏమైనా డబ్బు చెల్లించాలా..?

వాట్సాప్ వాయిస్ కాలింగ్ సర్వీస్ పూర్తిగా ఉచితం. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మొబైల్ ఇంటర్నెట్ డేటా ఉంటే చాలు.

 

వాట్సాప్ వాయిస్ కాలింగ్ గురించి మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన విషయాలు

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ను పొందటం ఏలా..?

ముందుగా లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ మెసెంజర్ యాప్‌ను వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్ నుంచి మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి. వర్షన్ నెంబర్ 2.12.7 (http://www.whatsapp.com/android/) లెటేస్ట్ వర్షన్ వాట్సాప్ మెసెంజర్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత వాట్సాప్ కాలింగ్ ఫీచర్‌ను ఇప్పటికే వినియోగించుకుంటున్న వారి నెంబర్ నుంచి మీ వాట్సాప్ నెంబర్‌కు ఒక సారి కాల్ చేయమని చెప్పండి. వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ మీ ఫోన్‌లో యాక్టివేట్ అయిన వెంటనే ఈ ఫీచర్ యాక్టివేట్ అయిన తరువాత వాట్సాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ మారుతుంది. వాట్సాప్ కాంటాక్ట్స్ పక్కన విడివిడిగా స్ర్కీన్‌లు ఏర్పడతాయి. చాట్ విండోలో ప్రత్యేకమైన కాలింగ్ బటన్ కనిపిస్తుంది. లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నప్పటికి దాన్ని వాడే ఇతర వినియోగదారులు మనకు కాల్ చేసేంతవరకు ఈ ఫీచర్ యాక్టివేట్ కాదు.

 

వాట్సాప్ వాయిస్ కాలింగ్ గురించి మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన విషయాలు

ఇతర సర్వీసులతో పోల్చవచ్చా..?

స్కైప్, వైబర్, హ్యాంగవట్స్ వంటి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సర్వీసుల తరహాలోనే వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది.

 

వాట్సాప్ వాయిస్ కాలింగ్ గురించి మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన విషయాలు

ఆ లింక్‌తో జాగ్రత్త

వాట్సాప్ వాయిస్ కాలింగ్ కోసం అనేక మంది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేస్తూ వాట్సాప్ వాయిస్ కాలింగో పేరుతో ఓ బూటకపు మెసేజ్ వాట్సాప్ కమ్యూనిటీలో హల్ చల్ చేస్తోందని క్విక్ హీల్ సంస్థ ఓ బ్లాగ్ లో హెచ్చరించింది. కాబట్టి "Hey, I am inviting you to try WhatsApp calling click here to activate now-> http://WhatsappCalling.com" ఈ మెసేజ్ తో కూడిన లింక్ మీకు వచ్చినట్లయితే దయ చేసి క్లిక్ చేయకండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp Voice Calling - Everything You Need to Know. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot