ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్

Posted By:

కొద్ది వారాల క్రితం ఇంటర్నెట్ వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని భారత్‌లో విజయవంతంగా పరీక్షించిన ఇన్‌స్టెంట్ మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్స్‌యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సర్వీసును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్

శుక్రవారం ఈ తాజా అప్‌డేట్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వాట్స్‌యాప్‌ను వినియోగించుకుంటోన్న పలువురు యూజర్లు అందుకున్నారు. టెస్టింగ్ స్థాయిలో భాగంగా వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను అందుకున్న ఆండ్రాయిడ్ యూజర్లు తమ వాట్సాప్ కాంటక్ట్స్‌లోని మిత్రలకు ఈ సర్వీస్‌ను యాక్టివేట్ చేయగలుగుతున్నారు. అయితే ఈ ఇన్వైట్ సిస్టం కొందరి యూజర్లకు మాత్రమే పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్

ఈ ఫీచర్ యాక్టివేట్ అయిన తరువాత వాట్సాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ మారుతుంది. వాట్సాప్ కాంటాక్ట్స్ పక్కన విడివిడిగా స్ర్కీన్‌లు ఏర్పడతాయి. చాట్ విండోలో ప్రత్యేకమైన కాలింగ్ బటన్ కనిపిస్తుంది.

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్


ప్లేస్టోర్‌లోని 2.11.528 వాట్సాప్ వెర్షనర గాని లేదా వాట్సాప్ అధికారిక వెబ్ సైట్ లోని 2.11.531 వెర్షన్లో మాత్రమే ఈ వాయిస్ కాలింగ్ అందుబాటులో ఉంది. లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నప్పటికి దాన్ని వాడే ఇతర వినియోగదారులు మనకు కాల్ చేసేంతవరకు ఈ ఫీచర్ యాక్టివేట్ కాదు. ఏదేమైనప్పటికి వాట్స్ యాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లయితే వినియోగదారులకు పండుగే పండుగ.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

English summary
WhatsApp Voice-Calling Feature Rolled Out For More Android Users Now! . Read more in TGelugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot