వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ వచ్చేసింది..?

Posted By:

వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ వచ్చేసింది..?

స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న దాదాపు ప్రతిఒక్కరూ వాట్స్ యాప్ అకౌంట్‌లను కలిగి ఉంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ ద్వారా చాటింగ్ ఇంకా ఫైల్ షేరింగ్ మాత్రమే సాధ్యమయ్యేది. తాజాగా వెల్లడవుతోన్న సమాచారం మేరకు ఈ యాప్ ద్వారా ఉచితంగా ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు..? దీనికి సంబంధించి ఏ విధమైన అధికారిక సమాచారం వెలువడనప్పటికి ఈ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను ఓ వాట్స్‌యాప్ యూజర్ డౌన్‌లోడ్ చేసుకోవటంతో అసలు విషయం బయటకు పొక్కింది. ఆ వ్యక్తి ఈ సమాచారాన్ని బయట పెట్టటంతో సోషల్ మీడియా ప్రపంచంలో ఈ వార్త హల్‌చల్ చేస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ వచ్చేసింది..?

వాట్స్‌యాప్ 2.11.508 వర్షన్‌లో మాత్రమే ఈ వాయిస్ కాలింగ్ ఆప్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ వర్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. వాట్స్‌యాప్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ వచ్చేసింది..?

లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నప్పటికి దాన్ని వాడే ఇతర వినియోగదారులు మనకు కాల్ చేసేంతవరకు అది పనిచేయట్లేదని తెలుస్తోంది. ఏదేమైనప్పటికి వాట్స్ యాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లయితే వినియోగదారులకు పండుగే పండుగ.

English summary
WhatsApp Voice-Calling Feature Spotted In The Wild. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot