Home
News

WhatsApp వెబ్‌లో వాయిస్ & వీడియో కాల్ ఫీచర్!!

వాట్సాప్ యొక్క వెబ్ వెర్షన్‌లో వాయిస్, వీడియో కాల్స్ కొత్త ఫీచర్ ను తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు కొత్త నివేదిక తెలిపింది. 2.2043.7 వెర్షన్ తో వచ్చే వాట్సాప్ వెబ్ అప్ డేట్ లో ఈ ఫీచర్ కనుగొనబడింది. ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ బీటాలో ఉందుబాటులో ఉంది. ఇది ప్రజల కోసం అందుబాటులో ఉంచడానికి ముందుగా కంపెనీ దీనిని పరీక్షిస్తుందని సూచిస్తుంది. వాట్సాప్ వాయిస్ మరియు వీడియో కాల్స్ ఇప్పటికే ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్ లలో అందుబాటులో ఉన్నాయి. డెస్క్‌టాప్ / వెబ్ క్లయింట్ లకు అందుబాటులోకి తీసుకురావడానికి సంస్థ వేగవంతంగా పనిచేస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకొవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ డెస్క్‌టాప్ క్లయింట్‌ కాలింగ్ ఫీచర్

వాట్సాప్ డెస్క్‌టాప్ క్లయింట్‌ కాలింగ్ ఫీచర్

వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ WABetaInfo యొక్క అధికారిక లీక్ ప్రకారం వాట్సాప్ మెసేజింగ్ యాప్ యొక్క వెబ్ / డెస్క్‌టాప్ క్లయింట్ కోసం వెర్షన్ 2.2043.7 తో తాజా అప్ డేట్ వాయిస్ మరియు వీడియో కాల్‌లకు సమగ్ర మద్దతును కలిగి ఉందని తెలిపింది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటాలో ఉండగా WABetaInfo దీనిని పరీక్షించింది మరియు కొన్ని స్క్రీన్షాట్‌లను కూడా షేర్ చేసింది.

 

వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ కాల్ ఫీచర్

వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ కాల్ ఫీచర్

మీరు డెస్క్‌టాప్‌లో వాట్సాప్ వెబ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీకు కాల్ వచ్చినప్పుడు ఆ కాల్‌ను స్వీకరించడానికి మరియు తిరస్కరించడానికి ఎంపికలతో కూడిన పాప్-అప్ విండో కనిపిస్తుంది. అంతేకాకుండా దిగువ భాగంలో ‘ఇగ్నోర్' ఎంపిక కూడా ఉంటుంది. కాల్ చేసేటప్పుడు వీడియో, మ్యూట్, డిక్లయిన్ వంటి మరిన్ని సెట్టింగ్‌లను ప్రారంభించడానికి ఎంపికలతో కూడిన చిన్న పాప్-అప్ విండో కనిపిస్తుంది. కొత్త అప్ డేట్ లో గ్రూప్ వాయిస్ మరియు వీడియో కాల్‌లకు కూడా మద్దతు ఉందని నివేదిక పేర్కొంది. అయితే ఈ ఫీచర్ పరీక్షించడానికి అందుబాటులో లేదు మరియు త్వరలో వెబ్ / డెస్క్‌టాప్ క్లయింట్‌కు జోడించబడుతుంది.

వాట్సాప్ వెబ్‌లో వాయిస్ & వీడియో కాల్ అధికారిక ప్రకటన ‌

వాట్సాప్ వెబ్‌లో వాయిస్ & వీడియో కాల్ అధికారిక ప్రకటన ‌

వినియోగదారులు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ లలో వాట్సాప్ వెబ్‌ను వాడుతున్నపుడు వాయిస్ మరియు వీడియో కాల్‌లను స్వీకరించడానికి వారి ఫోన్ లోకి మారకుండా ప్రస్తుతం నేరుగా ల్యాప్‌టాప్ ద్వారా సమాధానం ఇవ్వవచ్చు. మెసేజింగ్ మద్దతు ఇప్పటికే వాట్సాప్ వెబ్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి వాట్సాప్ లేదా దాని మాతృ సంస్థ ఫేస్‌బుక్ ఈ కొత్త ఫీచర్‌ను ప్రజలకు ఎప్పుడు విడుదల చేయబడుతుందనే దానిపై ఎటువంటి సమాచారం పంచుకోలేదు. అయితే ఇది తాజా అప్ డేట్ లో బీటాలో చేర్చబడుతుందని తెలిపింది. దీని అధికారిక ప్రకటన మరియు విడుదల త్వరలో రావచ్చు.

Best Mobiles in India

English summary
WhatsApp Web Brings Voice and Video Call Support very Soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X