WhatsApp వెబ్ ఇంటర్‌ఫేస్‌లో కాలింగ్ ఫీచర్స్!! న్యూ అప్‌డేట్ మీద ఓ లుక్ వేయండి...

|

ప్రస్తుత ఫాస్ట్ ప్రపంచంలో వాట్సాప్ గురించి తెలియని వారు ఉండరు. త్వరిత మెసేజ్ లను పంపడానికి మొదట ప్రవేశపెట్టిన ఈ యాప్ తరువాత కాలంలో అనేక ఫీచర్లను విడుదల చేసింది. అందులో భాగంగా వాట్సాప్ యొక్క మొబైల్ యాప్‌లో వాయిస్ మరియు వీడియో కాలింగ్ ఫీచర్లను కలిగి ఉంది. డెస్క్‌టాప్ ఇంటర్‌ఫేస్ లో కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ఈ కాలింగ్ ఫీచర్స్ అందుబాటులో లేవు. వాట్సాప్ వెబ్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్లను తీసుకురావడానికి పరీక్షిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ఫీచర్లు 2021 లో అందుబాటులోకి వస్తాయని వాట్సాప్ ధృవీకరించింది. దీని గురించి ట్విట్టర్ లో కొన్ని ట్వీట్ లు హల్ చల్ చేస్తున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ వెబ్ ఇంటర్‌ఫేస్‌

వాట్సాప్ వెబ్ ఇంటర్‌ఫేస్‌

వాట్సాప్ వెబ్ ఇంటర్‌ఫేస్‌లోని బీటా వినియోగదారులకు విస్తృత ఎంపికలో భాగంగా కాలింగ్ ఫీచర్లు లభించడం ప్రారంభించాయి. రాబోయే కొద్ది రోజుల్లో బీటా వినియోగదారులందరికీ క్రమంగా అందుబాటులోకి రానున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఫీచర్లను మేము పరీక్షించడానికి ప్రయత్నించాము కాని మా యొక్క వాట్సాప్ బీటా అకౌంటులలో ఎక్కడా వీటిని కనుగొనలేకపోయాము. కొంతమంది వినియోగదారులు ఇప్పటికే ఈ ఫీచర్లను స్వీకరించినట్లు తమ యొక్క ట్విట్టర్‌ అకౌంటులలో స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేస్తున్నారు. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫాం రాబోయే నెలల్లో ఈ ఫీచర్లతో స్థిరమైన బిల్డ్ అప్‌డేట్‌ను విడుదల చేయవచ్చు అని భావిస్తున్నాము.

వాట్సాప్ వెబ్ వీడియో, వాయిస్ కాల్స్ స్క్రీన్ షాట్లు

వాట్సాప్ వెబ్ వీడియో, వాయిస్ కాల్స్ ఫీచర్స్ అందుబాటులోకి వచ్చినట్లు ట్విట్టర్‌లో కొంత మంది తమ స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేసారు. ఈ స్క్రీన్‌షాట్‌లను పరిశీలనగా గమనిస్తే కనుక వీడియో మరియు వాయిస్ రెండు బటన్లు వాటి పక్కన బీటా బ్యాడ్జ్‌తో స్పష్టంగా చూపుతున్నాయి. విండోస్ 10 డెస్క్‌టాప్‌ల కోసం విండోస్ యాప్ లో ఈ బటన్లు కనిపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది.

వాట్సాప్ వెబ్ కాల్స్ పాపప్

వాట్సాప్ వెబ్ కాల్స్ పాపప్

వాట్సాప్ యొక్క మొబైల్ వెర్షన్ లోపల వీడియో, వాయిస్ కాల్స్ బటన్లు ఎలా ఉన్నాయో అదే విధంగా వాట్సాప్ వెబ్ చాట్ హెడర్ లోపల కనిపిస్తు ఉంటాయి. వినియోగదారులు కాల్‌లను స్వీకరిస్తే కనుక యాప్ ఒక చిన్న బాక్స్ ను పాపప్ చేస్తుంది. ఇందులో వినియోగదారులు కాల్ ను అంగీకరించగలరు అలాగే తిరస్కరించగలరు కూడా.

వాట్సాప్ ప్రైవసీ విధానం

వాట్సాప్ ప్రైవసీ విధానం

వాట్సాప్ యొక్క కొత్త నిబంధనలు మరియు ప్రైవసీ విధానాన్ని ఇటీవల ప్రకటించింది. వాట్సాప్ అకౌంటును ఉపయోగించడం కొనసాగించడానికి వినియోగదారులు సంస్థ పంపే నిబంధనలను అంగీకరించాల్సి ఉంటుందని సంస్థ తమ యొక్క నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీని అర్థం సంస్థ యొక్క నిబంధనలను అంగీకరించకపోతే కనుక కంపెనీ వారి అకౌంటును తొలగించే అవకాశం ఉంది. ఈ వార్త వచ్చిన తరువాత వాట్సాప్ చాలానే విమర్శలను ఎదురుకున్నది.

Best Mobiles in India

English summary
WhatsApp Web Users Start Receiving Video, Voice Calling Feature

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X