వాట్సప్ న్యూ ఫీచర్, ఇకపై ఫార్వర్డ్ ఆప్సన్ కంట్రోల్..
ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ యూజర్లను ఆకర్షిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. సోషల్ మీడియా నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుంటూ ఈ యాప్ దూసుకుపోతోంది. ఇందులో భాగంగా ఇండియాలో యూజర్ల కోసం కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. తమ ప్లాట్ ఫాంపై తప్పుడు సమాచారాన్ని కంట్రోల్ చేసేందుకు వాట్సప్ గట్టి చర్యలు చేపట్టింది. ఇప్పటి నుంచి వాట్సప్ లో మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేశారో యూజర్లకు తెలియజేయనుంది. ఇది ప్రయోగ దశలో ఉంది. ఈ కొత్త ఫీచర్ త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్నట్టు ఓ నివేదిక తెలిపింది.

ఫార్వార్డెడ్ మెనీ టైమ్స్’ మార్క్ - యూజర్ ఎవరైనా ఒక మెసేజ్ ను ఫార్వర్డ్ చేసే ముందు వాట్సప్ నోటిఫై చేస్తుంది. అక్కడ 'ఫార్వార్డెడ్ మెనీ టైమ్స్’ మార్క్ కనిపిస్తుంది. అప్పుడు యూజర్ ఆ మెసేజ్ ను ఫార్వార్డ్ చేయాలా? లేదా క్విట్ చేయాలో అనే దాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పటికే వాట్సప్ తమ ప్లాట్ ఫాంపై ఫ్రీక్వెట్లీ ఫార్వార్డ్ లేబుల్ ఫీచర్ ప్రవేశపెట్టినప్పటికీ, ఈ ఫీచర్ లో ఎన్నిసార్లు మెసేజ్ ఫార్వార్డ్ చేసినా 'ఫార్వార్డెడ్’ అని చూపిస్తుంది. కేవలం డబుల్ యారో ఐకాన్ కనిపిస్తుంది.
టెక్స్ట్ మెసేజ్ లు, ఇమేజ్ లు, వీడియోలు - ఇప్పుడు రాబోయే కొత్త ఫీచర్ ద్వారా మెసేజ్ ను 5 సార్లు కంటే ఎక్కువగా ఫార్వార్డ్ చేసినప్పుడు మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మెసేజ్ లన్నీ డబుల్ యారో ఐకాన్ తో కనిపిస్తాయి. 'ఈ మెసేజ్ ఫార్వార్డెడ్ మెనీ టైమ్స్‌గా మార్క్ కానుందని నోటిఫికేషన్‌లో ఉంటుంది. టెక్స్ట్ మెసేజ్ లు, ఇమేజ్ లు, వీడియోలు కూడా మెసేజ్ మాదిరిగానే ట్రీట్ చేస్తుంది. ఎన్నిసార్లు మెసేజ్ ఫార్వార్డ్ అయినా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్టెడ్ గా ఉంటుంది. ఐదు సార్లు కంటే ఎక్కువ సార్లు ఫార్వార్డ్ అయిన మెసేజ్ లను వాట్సప్ లేబుల్ చేస్తుంది. అయితే ఎన్ని సార్లు ఫార్వార్డ్ అయింది అనేది మాత్రం రివీల్ చేయదు. ఫార్వార్డ్ ఇన్ఫో ఫీచర్ ను ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం ప్రవేశపెట్టనున్నట్టు WAబీటాఇన్ఫో నివేదిక తెలిపింది. ఇన్ఫో బటన్ పక్కన టాప్ బార్‌పై ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ స్టేబుల్ వెర్షన్ లో వస్తుందా లేదా అనే దానిపై సమాచారం లేదు.
ఎన్ని డివైస్‌లోనైనా.. ఒకే ఫోన్ నెంబర్,త్వరలోనే వాట్సప్‌లో మరొక అదిరిపోయే ఫీచర్ యూజర్ల ముందుకొచ్చింది. ఇప్పటివరకూ.. వాట్సప్‌ను ఏ డివైస్‌లోనైనా ఒకేసారి ఒకే ఫోన్ నెంబర్‌తో యూజ్ చేసేవాళ్ళం. అయితే.. వేరే మొబైల్‌లో వాట్సప్ వాడుకోవాలంటే అంతకుముందు ఉన్న మొబైల్ నుంచి వాట్సప్ నంబర్ అకౌంట్‌ను తొలగించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు ఎన్ని డివైస్‌లోనైనా.. ఒకే ఫోన్ నెంబర్‌తో వాడేందుకు వీలవుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే కొత్త ఫీచర్‌తో వాట్సప్ సేవలు మనముందుకు రానున్నాయని తాజా సమాచారం.


Click it and Unblock the Notifications








