ఆ ఫోన్లకు షాకిచ్చిన వాట్సప్, ఫైనల్ అప్‌డేట్ జూన్ వరకే

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ విండోస్ ఫోన్ వాడే యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఫేస్ బుక్ సొంతమైన ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. Windows P

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ విండోస్ ఫోన్ వాడే యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఫేస్ బుక్ సొంతమైన ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. Windows Phone operating system devicesకు జూన్ నెల వరకు మాత్రమే అప్ డేట్స్ అందుతాయని ఆ తర్వాత ఎటువంటి అప్ డేట్స్ అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆ ఫోన్లలో వాట్సప్ సేవలు పూర్తిగి నిలిపివేయబడతాయని కంపెనీ తెలిపింది. దీని ప్రకారం వచ్చే ఏడాది నుంచి ఈ ఫోన్లలో వాట్సప్ ను యూజర్లు అప్ డేట్ చేయడం కాని వాడటం లాంటి పనులు చేయలేరు. ఇదిలా ఉంటే వాట్సప్ గత కొంత కాలం నుంచి కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తోంది.

 
ఆ ఫోన్లకు షాకిచ్చిన వాట్సప్, ఫైనల్ అప్‌డేట్ జూన్ వరకే
పాత ఫోన్లకు నిలిపివేత
వాట్సప్ గత కొంత కాలం నుంచి పాత వర్షన్ మొబైల్స్ కు వాట్సప్ సేవలను నిలిపివేస్తోంది. కొన్ని నిర్థారిత ప్లాట్‌ఫామ్స్‌కు సేవలు నిలిపివేస్తున్నట్టు వాట్సప్‌ ప్రకటిస్తూ వస్తోంది. 'నోకియా ఎస్‌ 40’లో ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ వెర్షన్‌ 2.3.7తో పాటు దాని కంటే పాత ఓఎస్‌లో కూడా వాట్సప్‌ పనిచేయడం లేదు. భవిష్యత్తులో తాము ప్రవేశపెట్టబోయే ఫీచర్లను పాత ఐఓఎస్‌ సపోర్ట్‌ చేయబోదని ఇంతకు వాట్సప్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. తమ సేవలు కొనసాగాలంటే ఓఎస్‌ 4.0 ప్లస్‌, ఐఓఎస్‌ 7 ప్లస్‌ లేదా విండోస్‌ ఫోన్‌ 8.1 ప్లస్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

ఈ వెర్షన్లలో..

ఈ వెర్షన్లలో..

ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.3.3 కంటే పాత ఓఎస్‌లో వాట్సప్‌ పనిచేయడం లేదు. విండోస్‌ ఫోన్‌ 7, ఐఫోన్‌ 3జీఎస్‌/ఐఓఎస్‌ 6, నోకియా సింబియన్‌ ఎస్‌ 60 వెర్షన్లలో కూడా వాట్సప్‌ రావడం లేదు. ఐఓఎస్‌ 7, పాత వెర్షన్లల్లోనూ 2020, ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఫోన్‌ 4, ఐఫోన్‌ 4ఎస్‌, ఐఫోన్‌ 5, ఐఫోన్‌ 5సీ, ఐఫోన్‌ 5ఎస్‌.. ఐఓఎస్‌ 7 ఆధారంగా నడుస్తున్నాయి.

చాట్‌ హిస్టరీని ట్రాన్స్‌ఫర్‌

చాట్‌ హిస్టరీని ట్రాన్స్‌ఫర్‌

ఆండ్రాయిడ్‌ రన్నింగ్‌ ఓఎస్‌ 4.0 ప్లస్‌, ఐఫోన్‌ రన్నింగ్‌ ఐఓఎస్‌ 8 ప్లస్‌, విండోస్‌ ఫోన్‌ 8.1 ప్లస్‌, జియో ఫోన్‌, జియో ఫోన్‌ 2లకు వాట్సప్‌ సేవలు కొనసాగుతాయి. అయితే ఈ ఫోన్లలో చాట్‌ హిస్టరీని ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశం లేదని వాట్సప్‌ వెల్లడించింది. చాట్‌ హిస్టరీని ఈ-మెయిల్‌కు పంపుకోవచ్చని సూచించింది.

బ్లాక్‌బెర్రీ ఓఎస్‌, బ్లాక్‌బెర్రీ 10
 

బ్లాక్‌బెర్రీ ఓఎస్‌, బ్లాక్‌బెర్రీ 10

బ్లాక్‌బెర్రీ ఓఎస్‌, బ్లాక్‌బెర్రీ 10, విండోస్‌ ఫోన్‌ 8.0, దాని కంటే పాత ఫ్లాట్‌ఫాంలకు వాట్సప్‌ తన సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలిపింది. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్‌డేట్స్‌ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది.ఈ ఓఎస్‌లు వాడుతున్న వారు వెంటనే కొత్త ఓఎస్‌ వెర్షన్‌(ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ 4.0+, ఐఫోన్‌ ఓఎస్‌ 7+, విండోస్‌ ఫోన్‌ 8.1+)లోకి అప్‌గ్రేడ్‌ కావాలని సూచించారు.

విండోస్ ఫోన్లకు గుడ్‌బై

విండోస్ ఫోన్లకు గుడ్‌బై

ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ ఫోన్లకు గుడ్‌బై చెప్పేసింది.విండోస్ ఫోన్లను వాడుతున్న యూజర్లందరూ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజ్‌లకు వారాలని సూచన చేసింది. ఇకపై విండోస్‌ 10 మొబైల్‌ ఇక సపోర్ట్‌‌ చేయవని తెలిపింది. 2019 డిసెంబరు నాటికి ఈ ఫోన్లు పూర్తిగా పనిచేయవని తెలిపింది.'ఎండ్‌ ఆఫ్‌ సపోర్ట్‌'' పేజీలో విండోస్‌ 10 మొబైల్‌, డిసెంబర్‌ 10 తర్వాత కొత్త సెక్యురిటీ అప్‌ డేట్లను తీసుకోవడం మానేసిందని యూజర్లకు తెలిపింది.

ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ డివైజ్‌‌లలోకి

ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ డివైజ్‌‌లలోకి

విండోస్‌ 10 మొబైల్‌ ఓఎస్‌ సపోర్ట్‌‌ చేయడం ముగియడంతో, కస్టమర్లు ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ డివైజ్‌‌లలోకి ఖచ్చితంగా మారాలని సూచన చేసింది.కాగా, విండోస్ మొబైల్ 10 చివరి వెర్షన్‌ 1709. దీన్ని 2017వ సంవత్సరం అక్టోబరు నెలలో రిలీజ్ చేసింది. విండోస్‌ 10 మొబైల్‌‌ను ఆపివేస్తున్నామని 2017లోనే మైక్రోసాఫ్ట్‌‌ సంకేతాలిచ్చింది. దీని కోసం కొత్త ఫీచర్లను కానీ, హార్డ్‌‌వేర్‌ కానీ డెవలప్‌ చేయడం లేదని తెలిపింది.

Best Mobiles in India

English summary
WhatsApp will push final update for Windows Phone in June; will end support by December 2019

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X