వాట్సాప్ సూపర్ ఫీచర్.. ఇక థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండానే.. !!
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులు కలిగిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో ఫీచర్‌తో ముందుకురానుంది. గత కొన్ని నెలలుగా వరుసగా అప్‌డేట్లు, ఫీచర్లను విడుదల చేస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ 'స్టిక్కర్ మేకర్ టూల్' పేరిట ఫీచర్‌ను తీసుకురానుందని సమాచారం.
ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు సొంతంగా తమకు కావాల్సిన స్టిక్కర్లను తయారు చేసుకోవచ్చు. స్టిక్కర్ల కోసం థర్డ్ ఫార్టీ యాప్‌ల వినియోగం తగ్గనుంది. స్టిక్కర్ మేకర్ టూల్ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు మీకోసం.

వాట్సాప్... 'స్టిక్కర్ మేకర్ టూల్' ఫీచర్‌పై పనిచేస్తోందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo వెల్లడించింది. iOS బీటా వెర్షన్ 23.3.77లో ఈ టూల్ ముందు వెర్షన్ అందుబాటులో ఉందని తెలిపింది. iOS 23.3.77 లో కొంత మంది వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉందని ఫీచర్ ట్రాకర్ తెలిపింది.
స్టిక్కర్ మేకర్ టూల్ ఫీచర్ ఫోటోను స్టిక్కర్‌గా మారుస్తుందని పేర్కొంది. ఈ ఫీచర్‌పై ఎంతో మంది వినియోగదారులు అభినందనలు తెలిపారు. టెస్ట్‌ఫ్లైట్ యాప్‌లో అందుబాటులో ఉన్న iOS 23.10.0.74 వెర్షన్ అప్‌డేట్లో ఉంది. అయితే ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపరిచేందుకు వాట్సాప్ పనిచేస్తోందని ఫీచర్ ట్రాకర్ తెలిపింది.
వినియోగదారులు ఎటువంటి యాప్‌లు ఉపయోగించకుండా.. స్టిక్కర్ మేకర్ టూల్ ద్వారా తనకు నచ్చిన స్టిక్కర్‌లను తయారుచేసుకోవచ్చని వాట్పాప్ ఫీచర్ ట్రాకర్ తెలిపింది. స్టికర్ల కోసం ప్రత్యేకంగా థర్డ్ పార్టీ యాప్‌లు వినియోగించకుండా ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. మరియు వినియోగదారులకు మంచి అనుభూతిని ఇస్తుందన్నారు.
అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందనే దానిపై పూర్తి స్పష్టత లేదు. ఈ ఫీచర్ ఎలా పనిచేసే అవకాశం ఉందనే దానిపై ఓ నివేదిక కొంచెం స్పష్టత నిచ్చింది. ఈ స్టిక్కర్ మేకర్ ఫీచర్.. ఫోన్ లైబ్రరీలోంచి ఫోటో ఎంచుకొని, మరియు ఆ ఫోటోకు కొన్ని మార్పులు చేసేందుకు అవకాశం ఇస్తుందని సమాచారం.
అయితే ఈ తరహా ఫీచర్ వాట్సాప్ వెబ్ మరియు వాట్సాప్ డెస్క్‌టాప్‌లో అందుబాటులో ఉందని ఓ నివేదిక పేర్కొంది. అయితే ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న స్టిక్కర్ మేకర్ టూల్ ఫీచర్ మాత్రం iOS వినియోగదారులకు మరిన్ని అదనపు టాల్స్‌తో అందుబాటులోకి రానుంది.
ఈ స్టిక్కర్ మేకర్ టూల్ పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాత.. తర్వాత వచ్చే iOS అప్‌డేట్‌లలో విడుదల చేసే అవకాశం ఉందని వాట్సాప్ ట్రాకర్ తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ ఉన్నా మరో కథనంలో వెల్లడిస్తామని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo తెలిసింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








