త్వరలో, ఈ ఫోన్ల లో వాట్సాప్ ఇక పనిచేయదు ! ఫోన్ల లిస్ట్ చూడండి.

By Maheswara
|

వాట్సాప్ గత కొన్ని నెలల్లో తన వినియోగదారుల కోసం అనేక కొత్త ఫీచర్లను విడుదల చేస్తూ వస్తుంది. వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపర్చడానికి iOS వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను రూపొందించడానికి వాట్సాప్ చేస్తోంది.ఇటీవలే iOS కోసం Large Link Previews ఫీచర్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయం లో వినియోగదారులకు షాకింగ్ న్యూస్ ను అందిస్తున్నాము.

 

నవంబర్ 1 నుంచి

నవంబర్ 1 నుంచి

రాబోయే నవంబర్ 1 నుంచి వాట్సాప్  యాప్ పెద్ద సంఖ్యలో పాత స్మార్ట్‌ఫోన్ మోడళ్లకు అందుబాటులో ఉండదు. ప్రత్యేకంగా, ఐఫోన్ కోసం iOS 9 కంటే సమానమైన లేదా తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నవారు మరియు ఆండ్రాయిడ్ 4.0.3 కంటే తక్కువ ఉన్న స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ ఇక పని చేయదు. తక్కువ వెర్షన్ అప్‌డేట్‌లకు సపోర్ట్ చేసే స్కోప్ లేనందున అలాంటి డివైజ్‌లు ఇకపై అప్లికేషన్ నుండి సపోర్ట్ పొందవు. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని యాప్ తన వినియోగదారులకు సరైన సేవలను అందించడానికి ఈ చర్యను చేపట్టినట్లు వివరించారు. వాట్సాప్ వయోగించాలి అంటే, ఆండ్రాయిడ్ OS 4.1 లేదా అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టం ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్‌లను లేదా iOS 10 మరియు అంతకంటే ఎక్కువ ఉన్న ఐఫోన్‌లను యూజర్లు ఎంచుకోవాలని సిఫార్సు చేసారు.

వాట్సాప్ సేవలు నిలిచిపోయే ఫోన్ల లిస్ట్
 

వాట్సాప్ సేవలు నిలిచిపోయే ఫోన్ల లిస్ట్

ఈ నవంబర్ 1 వ తేదీ నుండి వాట్సాప్ సేవలు నిలిచిపోయే ఫోన్ల లిస్ట్ ను మీకోసం ఇక్కడ అందిస్తున్నాము.ఆపిల్ ఫోన్లలో iPhone SE, 6S మరియు 6S Plus లకు ఇక పై వాట్సాప్ పనిచేయదు.అలాగే ఇక ఆండ్రాయిడ్ ఫోన్ల విషయానికి వస్తే ,శాంసంగ్ నుంచి Galaxy Trend II, Galaxy SII, Samsung Galaxy Trend Lite, Galaxy S3 mini, Galaxy Ace 2, Galaxy Xcover 2, మరియు Galaxy Core ఫోన్లకు వాట్సాప్ పనిచేయదు.

LG బ్రాండ్ నుంచి

LG బ్రాండ్ నుంచి

LG బ్రాండ్ నుంచి  LG Lucid 2, Optimus F7, Optimus F5, Optimus L3 II Dual, Optimus F5, Optimus L5, Optimus L5 II, Optimus L5 Dual, Optimus L3 II, Optimus L7, Optimus L7 II Dual, Optimus L7 II, Optimus F6, Enact , Optimus L4 II Dual, Optimus F3, Optimus L4 II, Optimus L2 II, Optimus Nitro HD and 4X HD, Optimus F3Q ఫోన్లు వాట్సాప్ పనిచేయని ఫోన్ల లిస్టులో ఉన్నాయి.

ఇతర ప్రముఖ కంపెనీల నుంచి

ఇతర ప్రముఖ కంపెనీల నుంచి

ఇంకా ఇతర ప్రముఖ కంపెనీల నుంచి గమనిస్తే. ZTE నుంచి ZTE Grand S Flex, ZTE V956, Grand Memo, Grand X Quad V987. Huawei నుంచి Huawei Ascend G740, Ascend D1 Quad XL, Ascend P1 S, Ascend Mate, Ascend D Quad XL, Ascend D2. ఇక Sony నుంచి గమనిస్తే   Sony Xperia Neo L, Sony Xperia Miro, Xperia Arc S ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ ముగియనుంది.

నవంబర్ తో వాట్సాప్ సపోర్ట్ ముగియనుంది

నవంబర్ తో వాట్సాప్ సపోర్ట్ ముగియనుంది

ఇవి కాక, Lenovo A820, HTC Desire 500, Alcatel One Touch Evo 7, Archos 53 Platinum, Faea F1, Caterpillar Cat B15, Wiko Cink Five, Wiko Darknight, UMi X2, THL W8 ఫోన్లకు కూడా ఈ నవంబర్ తో వాట్సాప్ సపోర్ట్ ముగియనుంది.నవంబర్ 1 తరవాత పైన పేర్కొన్న ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని నివేదికలు తెలుపుతున్నాయి.

Best Mobiles in India

English summary
WhatsApp Will Stop Working On These Phones Soon, Here Is The Complete Smartphones List

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X