పాఠకులకు 'ఐఫోన్ 5' విశిష్ట సమాచారం..?

Posted By: Super

పాఠకులకు 'ఐఫోన్ 5' విశిష్ట సమాచారం..?

 

లెటెస్ట్ టెక్నాలజీలకు సంబంధించిన సమాచారం మన ముందుకి తెచ్చేందుకు గాను ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఈవెంట్ 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2012' ని ఫిబ్రవరి 27వ తారీఖున నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు ప్రపంచంలో ఉన్న ప్రముఖ కంపెనీలు త్వరలో విడుదలకు సిద్దంగా ఉన్న ఉత్పత్తులను ప్రదర్శించడం ఆనవాయితీ. ఐతే ఆపిల్ మాత్రం ఈ ఈవెంట్‌ని వేసవికి వాయిదా వేయాల్సిందిగా కోరుతుంది.

ఇందుకు గల కారణాలను విశ్లేషిస్తే ఈ ఈవెంట్లో అన్ని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ఆపిల్ కంపెనీ గతంలో విడుదల చేసిన ఐఫోన్ 4ఎస్‌తో పోలుస్తుంటాయి. ఇలా చేయడం వల్ల ఆపిల్ కంపెనీ మార్కెట్లో కొంత భాగాన్ని నష్టపోవాల్సి వస్తుంది. అదే ఈ ఈవెంట్‌ని గనుక మరో రెండు లేదా మూడు వారాల పాటు వాయిదా వేస్తే ఆపిల్ కంపెనీ త్వరలో విడుదల చేయనున్న ఐఫోన్ 5 ని ప్రదర్శనకు తీసుకురావడమే కాకుండా.. ఆపిల్ తన సత్తాని ప్రపంచానికి చాటినట్లు అవుతుందని భావిస్తున్నారు.


ఇది ఇలా ఉంటే ఆపిల్ ఐఫోన్ 5 ఏ సందర్బంలోనైనా మార్కెట్లోకి రావచ్చునని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయడపడుతున్నారు. ఇక ఆపిల్ ఐఫోన్ 5 డిజైన్ గురించే మార్కెట్లో ఇప్పటి నుండే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఊహాగానాలను బలపరస్తూ ఇటాలియన్ డిజైనర్ ఫెడెరికో సికారిసె ఆపిల్ ఐఫోన్ 5 డిజైన్‌ ఇలా ఉండబోతుందని సెలవిచ్చాడు.


ఇటాలియన్ డిజైనర్ ఫెడెరికో సికారిసె చెప్పిన దాని ప్రకారం 'ఆపిల్ ఐఫోన్ 5' కొంచెం వంపుని కలిగి ఉండనుంది. గతంలో ఆపిల్ విడుదల చేసిన మ్యాజిక్ మౌస్ బాడీ మాదిరే 'ఆపిల్ ఐఫోన్ 5' బాడీ కూడా ఉండనుంది. వీటితో పాటు మ్యాక్ బుక్ ప్రో, మ్యాక్ బుక్ ఎయిర్, ఐమ్యాక్ లను రూపొందించడానికి ఏవిధమైన అల్యూమినియమ్‌ని ఉపయోగించారో అదే తరహా అల్యూమినియమ్‌ని దీని తయారీ కోసం ఉపయోగించారు. ఇటాలియన్ డిజైనర్ ఫెడెరికో సికారిసె గతంలో పలుమార్లు ఆపిల్ ఉత్పత్తులు గురించి తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot