Jio మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ఎప్పటి నుంచి..?
రిలయన్స్ జియో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ కోసం చాలా మంది యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More : లెనోవో నుంచి మూడు సరికొత్త 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లు, రూ.6,999 నుంచి ప్రారంభం
మొబైల్ నెంబర్ పోర్టబులిటీకి రిలయన్స్ జియో తెరలేపినట్లయితే ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్, ఐడియా వంటి ప్రముఖ నెట్‌వర్క్‌ల నుంచి భారీ సంఖ్యలో చందాదారులు రిలయన్స్ జియోలోకి మారిపోయే అవకాశముంది.

#1
ఎంఎన్‌పీ ద్వారా రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లోకి మారటం ద్వారా తమ పాత నెంబర్ అలానే ఉండటంతో పాటు Jio Welcome ఆఫర్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

#2
అనధికారికంగా తెలుస్తోన్న సమచారం ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో జియో ఎంఎన్‌పీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అప్పుడు మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా మీ పాత నెంబర్‌తోనే రిలయన్స్ జియోలోకి మారేందుకు ఇలా చేయండి...

#3
మీ మొబైల్ నెంబర్ నుంచి పోర్ట్ (port) అని టైప్ చేసి కొంత స్పేస్ ఇచ్చి బ్రాకెట్లో మీ మొబైట్ నెంబర్‌ని జత చేసి 1900కి ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఎనిమిది అంకెల యూనిక్ పోర్టింగ్ కోడ్ మీ మొబైల్‌కు సందేశం రూపంలో అందుతుంది.

#4
ఈ కోడ్ ఆధారంగా మీ సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్ లేదా ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌ను సంప్రదించి సంబంధిత అప్లికేషన్‌లను పూరించాల్సి ఉంటుంది.

#5
సిమ్ యాక్టివేషన్ ప్రక్రియలో భాగంగా మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఇతర ధృవీకరణ ప్రతాలను జియో ప్రతినిధులకు సమర్పించాల్సి ఉంది.

#6
ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే Jio Welcome ఆఫర్‌తో కూడిన జియో 4జీ సిమ్ కార్డ్ మీకు అందుతుంది.

#7
జియో సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే మీరు ఇప్పటికే వాడుతున్న నంబర్ నెట్‌వర్క్ కట్ అయిపోతుంది.

#8
జియో సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే మీరు ఇప్పటికే వాడుతున్న నంబర్ నెట్‌వర్క్ కట్ అయిపోతుంది. అలా జరిగిన వెంటనే మీ జియో సిమ్ యాక్టివేట్ అవుతుంది..

#9
అలా యాక్టివేట్ అయిన జియో సిమ్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయటం ద్వారా Jio Welcome offerను ఎంజాయ్ చేయవచ్చు. దీని కన్నా ముందు యూజర్లు టెలీ వెరిఫికేషన్ ద్వారా మీ వివరాలను వెరిఫై చేయాల్సి ఉంటుంది.

#10
రోజుకు 4జీబి ఇంటర్నెట్ యూసేజ్,
అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్
అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్
జియో యాప్స్ ఉచిత యాక్సిస్
Jio Welcome offer పూర్తి అయిన తరువాత 1జీబి 4జీ డేటాను రూ.50కే సొంతం చేసుకునే అవకాశం,
విద్యార్థులకు 25% రాయితీ


Click it and Unblock the Notifications








