5జీ నెట్‌వర్క్‌ను మిలటరీ వాడుతోందా..?

Written By:

4జీ మొబైల్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డ్స్‌కు భారతీయులు ఇప్పడిప్పుడే అలవాటుపడుతోన్న రోజులివి. అయితే, టెక్నాలజీ పరంగా మరింత అభివృద్థి దిశంలో ముందుకు సాగుతోన్న పలు దేశాలు మాత్రం 4జీ నెట్‌వర్క్‌కు కాలం చెల్లిందంటూ 5జీ నెట్‌వర్క్ పై పరిశోధనలు మొదలుపెట్టేసాయి. వాస్తవానికి ఓ సెల్యులార్ వ్యవస్థను అభివృద్థి చేయాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ల విభాగంలో ముందంజలో ఉన్న కంపెనీలు ఇప్పటికే 5జీ డేటా ట్రాన్స్‌మిషన్ ప్రయోగాలను ఇప్పటికే ప్రారంభించేసాయి.

5జీ నెట్‌వర్క్‌ను మిలటరీ వాడుతోందా..?

హైస్పీడ్ డేటా కనెక్టువిటీ వేగంతో అందుబాటులోకి రానున్న 5జీ, మొబైల్ టెలీకమ్యూనికేషన్ విభాగంలో సంచలనం సృష్టించే మార్పులకు దోహదంకాబోతోందని విశ్లేషకులు అంటున్నారు. 5జీ నెట్‌వర్క్ రాకతో ఐఓటీ డివైసెస్, రిమోట్ సర్జరీ, రియల్ -టైమ్ హోలోగ్రాఫిక్ వీడియో వంటి విప్లవాత్మక ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చేస్తాయి. 5జీ నెట్‌వర్క్ గురించి 5 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5జీ అంటే ఎంటి..?

5జీ నెట్‌వర్క్ గురించి పలు ఆసక్తికర విషయాలు

5జీ అంటే ఎంటి..?

5జీ నెట్‌వర్క్ గురించి ఇప్పటికి వరకు ఏ విధమైన అధికారిక డెఫినిషన్ వెలుగులోకి రాలేదు. అయితే, 5జీ అనేది 4జీ నెట్‌వర్క్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా వస్తోన్న వైర్‌లెస్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అని ధృడంగా చెప్పొచ్చు.

 

4G Speed vs 5G Speed

5జీ నెట్‌వర్క్ గురించి పలు ఆసక్తికర విషయాలు

4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లో 4జీ ఎల్టీఈ (లాంగ్ టర్మ్ ఇవల్యూషన్) అనేది బేసిక్ కమ్యూనికేషన్ స్టాండర్డ్. ఈ బేసిక్ కమ్యూనికేషన్ స్టాండర్డ్‌లో స్పందించే 4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ అప్‌లోడ్ వేగం గరిష్టంగా 100 Mbit/sగాను, డౌన్‌లోడ్ వేగం 1Gbit/sగాను ఉంటుంది. 4జీ టెక్నాలజీలో ఎల్టీఈ-ఏ అనేది అడ్వాన్సుడ్ వర్షన్‌గా ఉంది. ఈ కమ్యూనికేషన్ స్టాండర్డ్‌లో స్పందించే 4జీ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ అప్‌లోడ్ వేగం గరిష్టంగా 500 Mbit/s గాను,  డౌన్‌లోడ్ వేగం 1Gbit/sగాను ఉంటుంది. 2020లో రాబోతోన్న 5జీ టెక్నాలజీ డేటా స్పీడ్‌కు సంబంధించి ఏ విధమైన వివరాలు వెల్లడికాలేదు.

 

పరిశోధనలు ముమ్మరం

5జీ నెట్‌వర్క్ గురించి పలు ఆసక్తికర విషయాలు

పలు టెలికామ్ కంపెనీలు ఇప్పటికే 5జీ పరిశోధనలను ముమ్మరం చేసాయి. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హువావీ 2020 నాటికి దీన్ని వాణిజ్యపరంగా 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతోంది.

మరో సంస్థ ఎన్‌ఐటి డొకోమో ఇంక్‌, టోక్యోలోని రొపోంగి హిల్స్‌ కాంప్లెక్సుల్లో తాము అక్టోబర్‌ 13వ తేదీన అత్యధిక వేగంతో డేటా ట్రాన్స్‌మిషన్‌ చేశామని, అది దాదాపు 2 జీబీపీఎస్‌ వేగాన్ని అందుకుందని చెబుతోంది. 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 5జీ నెట్‌వర్క్ 1000 రెట్లు వేగంగా పనిచేసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నాయి.

 

కమర్షియల్ మార్కెట్లోకి 5జీ నెట్‌వర్క్

5జీ నెట్‌వర్క్ గురించి పలు ఆసక్తికర విషయాలు

కమర్షియల్ మార్కెట్లోకి 5జీ నెట్‌వర్క్ 2020 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిలటరీ ఇంకా ప్రభుత్వ ఏజెన్సీలు త్వరలోనే ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోనున్నాయి.

5జీ ఫోన్ ధర ఎంత ఉండొచ్చు..?

5జీ నెట్‌వర్క్ గురించి పలు ఆసక్తికర విషయాలు

5జీ నెట్‌వర్క్ కనెక్టువిటీతో విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్‌లు 2020 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వీటి ధరలు అప్పటి మార్కెట్ పరిస్థితులను బట్టి ఉండొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
When you can buy a 5G smartphone? and how fast it will be..!
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot