ICC ODI World Cup 2023 ప్రారంభం అయింది. ఈ ఛానల్, యాప్‌లో ఉచితంగా మ్యాచ్‌లు చూడొచ్చు..!
యావత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వన్డే ప్రపంచ కప్ 2023 (ICC ODI World Cup 2023) ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ కప్ జరుగుతోంది. అతిపెద్ద క్రీడా సంబరానికి ఈ ఏడాది భారత్ ఆతిధ్యం ఇస్తోంది. భారత్‌లోని మొత్తం 10 చోట్ల ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇందులో భాగంలో నాకౌట్ మ్యాచ్‌తో కలిపి మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 45 లీగ్ మ్యాచ్‌లు ఉంటాయి. 1983లో కపిల్ దేవ్ సారధ్యంలో టీమిండియా తొలిసారి వరల్డ్ కప్‌ను ముద్దాడింది. అనంతరం 2011లో మహీంద్రసింగ్ ధోనీ నేతృత్వంలో రెండోసారి వరల్డ్ కప్‌ను భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈసారి రోహిత్ సారధ్యంలో బరిలో నిలిచింది.

గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ల మధ్య తొలి మ్యాచ్ ఇవాళ ప్రారంభం అయింది. ఆఖరి మ్యా్చ్ నవంబర్ 19న జరగనుంది. ఆఖరి మ్యాచ్ కూడా నరేంద్రమోడీ స్టేడియంలోనే జరగనుంది. అక్టోబర్ 8న రోహిత్ సేన.. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. మరియు యావత్ భారతీయాలు ఎదురుచూసే ఇండియా vs పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది.
ఐసీసీ ODI వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లను టీవీ లేదా మొబైల్‌లో ఉచితంగా చూడవచ్చు. భారత్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Star Sports) ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అంటే స్టార్ స్పోర్ట్స్ అన్ని ఛానళ్లలోనూ క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ HD, స్టార్ స్పోర్ట్స్ హిందీ సహా అన్ని భాషల్లోనూ క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా చూడవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లో ఐసీసీ ODI వరల్డ్ కప్ మ్యాచ్‌లను చూడాలనుకుంటే మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ (Disney+ Hotstar)ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లను చూసేందుకు ఈ యాప్‌లో ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. అన్ని మ్యాచ్‌లను ఉచితంగానే చూడవచ్చు. అయితే కేవలం HD నాణ్యతలోనే చూసేందుకు వీలుంది.
అదే ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్, స్మార్ట్‌టీవీల్లో క్రికెట్ మ్యాచ్‌లు చూడాలనుకుంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సూపర్ ప్లాన్ ద్వారా రూ.299తో 3 నెలలు, రూ.899తో 12 నెలలకు అందిస్తున్న ప్లాన్స్‌తో పుల్ HD నాణ్యతతో సినిమాలు, వివిధ షోలు, వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లను చూడవచ్చు. ఈ గరిష్ఠంగా రెండు డివైజ్‌లో లాగిన్ కావచ్చు.
అదే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్ ద్వారా రూ.499తో 3నెలలు, రూ.1499తో 12 నెలలు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 4K క్వాలిటీతో వరల్డ్ కప్ 2023 క్రికెట్ మ్యాచ్‌లను చూడవచ్చు. ఈ ప్లాన్‌లో గరిష్ఠంగా 4 డివైజ్‌లలో లాగిన్ కావచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








