Airtel Rs1199 Vs Rs1729 Vs Rs1799 ఈ మూడింటిలో మీకు నచ్చిన ప్లాన్ ఏంటి?
ఎయిర్‌టెల్ ప్రస్తుతం భారత టెలికాం రంగంలో యూజర్ల పరంగా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. అయితే ప్రస్తుతం 84 రోజుల వ్యాలిడిటీతో అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం రూ.1199, రూ.1729, రూ.1798 రీఛార్జ్ ప్లాన్లు 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తున్నాయి.
అయితే డేటా, కాలింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ Airtel Rs1199 Vs Rs1729 Vs Rs1799 రీఛార్జ్ ప్లాన్లు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తున్నాయో తెలుసుకుందాం. మూడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లలో డేటా పరంగా తేడాలను గమనించవచ్చు. మరియు ఓటీటీ ప్రయోజనాలను కూడా అందిస్తోంది.

ఎయిర్‌టెల్ రూ.1199 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2.5GB డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా పొందవచ్చు. వీటితోపాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఎయిర్‌టెల్ Xstream Play ప్రీమియం ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అంటే 22 కి పైగా ఓటీటీలను ఉపయోగించుకోవచ్చు.
దీంతోపాటు (Airtel Rs1199 Recharge Plan) రివార్డ్ మిని సబ్‌స్క్రిప్షన్, పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ, హాలోట్యూన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది.
రూ.1729 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2 GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో (Airtel Rs1729 Recharge Plan) నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, జియోహాట్‌స్టార్ సూపర్ సబ్‌స్క్రిప్షన్, Zee5 ప్రీమియం, ఎయిర్‌టెల్ Xstream ప్లే ప్రీమియం వంటి ఓటీటీ ప్రయోజనాలను అందిస్తోంది. పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ, హాలోట్యూన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
రూ.1729 రీఛార్జ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ యూజర్లు ఈ ప్లాన్ లో (Airtel Rs1799 Recharge Plan) భాగంగా ఏకంగా ప్రతిరోజు 3GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. మరియు 5G స్మార్ట్‌ఫోన్, 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను కూడా పొందవచ్చు.
ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. దీంతోపాటు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ, హాలోట్యూన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
ఈ మూడు రీఛార్జ్ ప్లాన్లలో యూజర్ల అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. 5G నెట్‌వర్క్ అందుబాటులో లేని యూజర్లు ఎక్కువగా డేటాను ఉపయోగిస్తుంటే రూ.1799 ప్లాన్ వైపు మొగ్గుచూపవచ్చు. అదే ఓటీటీల కోసం చూసే వారు రూ.1729 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. కాస్త తక్కువ ధరలో మీడియం ప్రయోజనాలను కావాల్సిన వారు రూ.1199 ను ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications








