ఏప్రిల్ చివరి వారంలో వైట్ ఐఫోన్4, ఐఫోన్5 మాత్రం సెప్టెంబర్‌‌లో...

Posted By: Staff

ఏప్రిల్ చివరి వారంలో వైట్ ఐఫోన్4, ఐఫోన్5 మాత్రం సెప్టెంబర్‌‌లో...

ఆపిల్ ఐఫోన్లకు ప్రసిద్ది. అలాంటిది ఆపిల్ కంపెనీ తెలుపు రంగు ఐఫోన్ 4ని భారతదేశంలో త్వరలో విడుదల చేయనున్నారు. ఈవిషయాన్ని ఆపిల్ కంపెనీ దగ్గర సన్నిహితులు వెల్లడించారు. ఈమోడల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది రెండు వర్సన్స్ లలో విడుదలవుతుంది. ఇది ఏప్రిల్ చివరి వారంలో కెల్లా ఇండియాలో దర్శనమిస్తుందని ఏటి అండ్ టి ప్లేవర్స్ లలో లభిస్తుందని తెలియజేశారు.

ఐపోన్ 4 ఇంత ఆలస్యంగా ఇండియాకి రావడానికి కారణాలు ఏమని అడడగా అవి చెప్పడానికి మాత్రం నిరాకరించారు. ప్రస్తుతానికి ఐఫోన్ 4 రెండు మోడళ్శు వైట్ పెయింట్‌తో కొత్త తనాన్ని సంతరించుకోని విడుదలకు సిద్దంగా ఉన్నాయని అన్నారు. ఇది మాత్రమే కాకుండా ఆపిల్ ఐపోన్ 5 గురించిన సమాచారం కూడా వెలిబుచ్చారు. ఈ సందర్బంలో మైక్ ఆభ్రామాస్కీ (ఈర్‌బిసి క్యాపిటల్ మార్కెట్స్) విశ్లేషకుడు మాట్లాడుతూ ఆపిల్ ఐపోన్ 5 వస్తే గనుక ఈసంవత్సరం సెప్టెంబర్‌లో విడుదలయ్యే సూచనలు ఉన్నాయని అన్నారు.


ఐతే ఈ విషయాల్ని మాత్రం అధికారకంగా మాత్రం ఆపిల్ కంపెనీ ధృవీకరించలేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో ఆపిల్ కంపెనీ తన ఉత్పత్తులకు సంబంధించినటువంటి కొత్త మోడళ్శను, ఐప్యాడ్, ఐపోన్, ఐప్యాడ్ టచ్, ఐప్యాడ్ నానో మోడళ్శ అప్‌డేట్స్‌ని విడుదల చేస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting