Home
News

వావ్, ఈ రోబో వాక్యూమ్‌కి ఓ చేయి, కాళ్లు ఉన్నాయ్.. ఏం చేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు..!!

By Ram Kumar

ఈ ఏడాది CES 2025లో రోబోటిక్ వాక్యూమ్ తయారీదారులు సరికొత్త టెక్నాలజీతో దుమ్ము దులిపారు. ఇన్నాళ్లూ నేలను శుభ్రం చేయడానికే పరిమితమైన ఈ రోబోలు, ఇప్పుడు కాళ్లు, చేతులతో ప్రాణం ఉన్న జీవుల్లా అవతారం ఎత్తాయి.

డ్రీమ్ (Dreame), రోబోరాక్ (Roborock) కంపెనీలు ప్రవేశపెట్టిన ఈ సరికొత్త రోబోలు ఇంటి శుభ్రతను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం.

Whoa  This Robovac Has An Arm  amp amp  Legs  See What It Can Do

ఈ వారంలోనే డ్రీమ్ కంపెనీ X50 అల్ట్రా (X50 Ultra) అనే ఒక కొత్త రోబో వాక్యూమ్‌ను విడుదల చేసింది. ఇది మెట్లు ఎక్కగలదు, చిన్న చిన్న మెట్లు, గడపలు (6 సెంటీమీటర్ల వరకు) సులువుగా ఎక్కేస్తుంది.

నిజానికి ఇది పెద్ద మెట్లు ఎక్కేయదు కానీ, ఇంట్లో ఉండే చిన్నపాటి అడ్డంకులను దాటేందుకు దీని డిజైన్ చేశారు. నేలలు కాస్త ఎత్తుపల్లాలుగా ఉన్న ఇళ్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది.

* మెయిన్ అట్రాక్షన్ ఈ కాన్సెప్ట్ రోబోనే

అంతే కాదు, డ్రీమ్ మరో అదిరిపోయే కాన్సెప్ట్ రోబోను కూడా పరిచయం చేసింది. దీనికి కాళ్లతో పాటు ఒక రోబోటిక్ హ్యాండ్ కూడా ఉంది. ఈ చేయి 500 గ్రాముల బరువున్న వస్తువులను కూడా ఈజీగా లిఫ్ట్ చేయగలరు. ఉదాహరణకు, చిన్న పిల్లల బొమ్మలు, మగవాళ్ల సైజు 9 వరకు ఉండే చెప్పులు లాంటివి అన్నమాట.

ఈ చిన్న వస్తువులను ఎక్కడ పెట్టాలో ప్రోగ్రామ్ చేస్తే చాలు, ఆటోమేటిక్‌గా అక్కడికి చేర్చేస్తుంది. ఉదాహరణకు, చెప్పులను గుమ్మం దగ్గర పెట్టమని చెప్తే అక్కడ, బొమ్మల్ని ఆడుకునే గదిలో పెట్టమని చెప్తే అక్కడ పెడుతుంది.

ఇంకా దీనిలో ఒక చిన్న టూల్‌బాక్స్ కూడా ఉంది. ఆ చేతికి రకరకాల బ్రష్‌లు తగిలించుకోవచ్చు. దీనివల్ల మూలల్లో, ఇరుకు సందుల్లో కూడా శుభ్రం చేయగలదు. మామూలు రోబోలు వెళ్లలేని చోట కూడా ఇది క్లీన్ చేస్తుంది.

అంతేకాదు, డ్రీమ్ ఒక కొత్త బేస్ స్టేషన్‌ను కూడా చూపించింది. ఇది చాలా మోపింగ్ ప్యాడ్‌లను పెట్టుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీనివల్ల కిచెన్, బాత్రూమ్ లాంటి వేర్వేరు ప్రదేశాల కోసం వేర్వేరు ప్యాడ్‌లను వాడుకోవచ్చు. ఒక ప్రదేశంలోని మురికి మరొక ప్రదేశానికి అంటకుండా ఇది సహాయపడుతుంది.

* రోబోరాక్ కూడా తీసిపోదు

ఈ కంపెనీ సారోస్ Z70 (Saros Z70) అనే ఫ్లాగ్‌షిప్ రోబో వాక్యూమ్‌ను విడుదల చేసింది. అయితే, డ్రీమ్ కాన్సెప్ట్ రోబోలా కాకుండా దీనికి కాళ్లు లేవు, కేవలం ఒక చేయి మాత్రమే ఉంది. ఈ చేయి 300 గ్రాముల వరకు బరువున్న వస్తువులను ఎత్తగలదు, అంటే సాక్సులు లాంటివి అన్నమాట.

డ్రీమ్ రోబో కంటే దీని చేయి కాస్త తక్కువ బలంతో ఉన్నా, రోబోరాక్ మాత్రం ఈ రోబోను అక్కడికక్కడే పనిచేసి చూపిండంతో, ఇది నమ్మదగినది అని చాలా మంది భావించారు.

* ముఖ్య విషయాలు

చివరగా, డ్రీమ్ X50 అల్ట్రా, డ్రీమ్ కాన్సెప్ట్ మోడల్ ఒకటే కాదని గుర్తుంచుకోవాలి. కాన్సెప్ట్ మోడల్ అనేది భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీకి ఒక ఉదాహరణ మాత్రమే. దాని డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. అందులో ఉండే ఫీచర్లు ఇంకా పూర్తిగా టెస్ట్ చేయలేదు లేదా ప్రయోగాత్మకమైనవి కావచ్చు.

కానీ, X50 అల్ట్రా మాత్రం ఇప్పటికే తయారు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న మోడల్. దాని ఫీచర్లు కచ్చితంగా పనిచేస్తాయని కంపెనీ ధీమాతో ఉంది. కాబట్టి, రోబోటిక్ వాక్యూమ్‌ల భవిష్యత్తు చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
At CES 2025, Dreame and Roborock showcased new robot vacuums. A highlight was Dreame's concept robot with an arm capable of lifting small objects. Roborock also presented a model with an arm.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X