Home
News

నా దగ్గర ఐఫోన్ ఉందని చెప్పుకోడానికేనా.. ఇంకేమైన బలమైన కారణాలున్నాయా..?

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లలో అనేక మంది తరచూ ఫోన్‌లను మార్చుతుంటారు. కొంత మంది కొత్త ఆండ్రాయిడ్‌ ఫోన్‌లకు అప్‌గ్రేడ్‌ అవుతుంటే.. మరికొందరు ఐఫోన్‌లకు మారుతుంటారు. మెరుగైన పనితీరు, కెమెరా ఫీచర్లు, బ్యాటరీ లైఫ్‌, కొత్త ఫీచర్ల కోసం అనేక మంది తమ ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేస్తుంటారు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆండ్రాయిడ్‌ నుంచి ఐఫోన్‌లకు మారుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉంటోంది.

అయితే ఆండ్రాయిడ్‌ నుంచి ఐఫోన్‌లకు మారేందుకు (Switching from Android to iPhone) యూజర్లకు ఉన్న ప్రత్యేక కారణాలు ఏంటి..? ఆండ్రాయిడ్‌ నుంచి ఐఫోన్‌కు మారేందుకు చాలా మంది భద్రతా కారణాలు ఉన్నాయని చెబుతుంటారు. అయితే కేవలం భద్రతా కారణాలు మాత్రమే ఉన్నాయా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా..? పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Why are many smartphone users interested in switching from Android to iPhone Here are the reasons

* ప్రైవసీ, సెక్యూరిటీ :
చాలా కాలంగా యూజర్‌ ప్రైవసీ, డేటా సెక్యూరిటీకి ఆపిల్‌ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ అంశం అనేక మంది యూజర్లను ఆకట్టుకుంటోంది. దీంతోపాటు యాప్ ట్రాకింగ్ పారదర్శకత. ఫేస్‌ ఐడి ఎన్‌క్రిప్షన్‌, iMessage ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ వంటి సౌకర్యాలు ప్రైవసీ కోసం ఆందోళన చెందుతున్న వారిని ఆకర్షిస్తున్నాయి.

* సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ :
అనేక మంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లను ఆకట్టుకొనే అంశాల్లో ఐఫోన్ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ ఒకటి. ప్రస్తుతం అనేక ఐఫోన్‌లు 5- 6 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తున్నాయి. అయితే ఇప్పటికే అనేక ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లు 3-4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను అందిస్తున్నాయి.

Why are many smartphone users interested in switching from Android to iPhone Here are the reasons

* ఆపిల్‌ ఎకో సిస్టమ్‌ :
ఆండ్రాయిడ్‌ నుంచి ఐఫోన్‌ లకు మారేందుకు ఆపిల్‌ ఎకో సిస్టమ్‌ కూడా మరో కారణం. ఐఫోన్‌ లను మ్యాక్‌బుక్‌, ఎయిర్‌పాడ్స్‌, ఐప్యాడ్‌, ఆపిల్‌ వాచ్‌ తో సులభంగా కనెక్ట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. Airdrop ద్వారా ఫైల్స్‌ ను షేర్‌ చేసుకోవచ్చు. మ్యాక్‌ ద్వారా కాల్స్‌ ను చేయవచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను సౌకర్యవంతంగా కనెక్ట్ చేసుకోలేం.

కెమెరా నాణ్యత సహా :
ఆండ్రాయిడ్‌ యూజర్లు ఐఫోన్‌ల వైపు మొగ్గుచూపడానికి ఐఫోన్ కెమెరా నాణ్యత కూడా మరో కారణం. ముఖ్యంగా వీడియో రికార్డింగ్ సమయాల్లో ఐఫోన్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు అధిక మెగాపిక్సల్‌ (MP) కెమెరాలను కలిగి ఉంటున్నా.. రంగుల్లో కచ్చితత్వం (Colour Accuracy), స్థిరత్వం సహా మరికొన్ని అంశాల్లో ఐఫోన్లతో పోటీపడలేకపోతున్నాయి.

Take a Poll

* రీసేల్‌ వాల్యూ :
ఆండ్రాయిడ్ ఫోన్‌లతో పోలిస్తే ఐఫోన్‌లు ప్రస్తుత మార్కెట్లో అధిక రీసేల్‌ వాల్యూను కలిగి ఉంటున్నాయి. ఎక్స్ఛేంజీ సహా ఇతర సమయాల్లో మంచి ధరను పొందవచ్చు. పాత ఐఫోన్‌లకు కూడా కొన్ని సందర్భాల్లో మంచి రీసేల్‌ వాల్యూను పొందవచ్చు.

* సౌకర్యవంతమైన యూజర్‌ ఎక్పీరియన్స్‌ :
ఐఫోన్ iOS క్లీన్, స్మూత్, ల్యాగ్‌ ఫ్రీ అనుభూతిని అందిస్తాయి. అదే ఆండ్రాయిడ్ ఫోన్‌లు Bloatware లేదా Skin సహా అనేక కారణాలతో పనితీరు నెమ్మదిస్తుంది. మరియు ఐఫోన్‌లు యూజర్‌ ఫ్రెండ్లీ అనుభూతిని అందిస్తాయి. దీంతోపాటు ఐఫోన్‌లను కొంత మంది స్టేటస్‌ సింబల్‌గా చూస్తున్నారు. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోనలకు మారేందుకు ఇది కూడా ఓ కారణం.

More from GizBot

Best Mobiles in India

English summary
Why are many smartphone users interested in switching from Android to iPhone Here are the reasons
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X