ప్రస్తుత సమాజంలో సాప్ట్‌వేర్ జీవితాలు ఎందుకు నిస్సారం అవుతున్నాయి..?

By Super
|
Software People
పెళ్శైన కొత్తలో భార్య భర్తల మద్య ఉండేటటువంటి ప్రేమ చెప్పలేనిది. ఒకరి కంట్లో నలక పడితే, మరోకరి కళ్శల్లో నీళ్శు తిరగడం. కూరలో కోంచెం కారం ఎక్కువయినా నా మీద ప్రేమ చూపిస్తే చాలు అనుకునే భార్త. అనుకోని సర్దుబాట్లు, వారానికో సినిమా.. రెస్టారెంట్ భోజనం ఇలాంటివి అన్ని పెళ్శైన కొత్తలో చోటుచేసుకునే సంఘటనలు. ఆ తర్వాత కాలంలో నిదానంగా అవి తగ్గుముఖం పడతాయి. గోడవలు ప్రారంభం అవుతాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే భార్యభర్తలు ఏమి చేయ్యాలి.

పెళ్శైన కోత్తంలో ప్రతి జంట ఉత్సాహాంతో ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాలం గడచే కొద్ది బందం పాతబడుతుంది. కొత్తలో ఉన్నంత ఉత్సాహాం కూడా మసకబారుతుంది. ఆఫీసు, ఇల్లు, వంట, భోజనం ఎప్పుడన్నా బయటకు వెళ్శడం, పిల్లలు, స్కూళ్శు అన్ని యాంత్రింకంగా జీవితంలో జరిగిపోతుంటాయి. ఈ సమయంలో బంధం కంటే కూడా భాద్యత ముందు నిలుస్తుంది. ఇలాంటి సమయాలలోనే మన జీవితాలలో ప్రేమను గనుక నింపుకోపోయినట్లైతే జీవితాలు నిస్సారంగా తయారవుతాయి. దానికోసం మన వంతు మనం ఏమి చేయాలో చూద్దాం.

భార్య భర్తల ప్రవర్తనలో ఇరు పక్షాల వారికి నచ్చినవి, నచ్చనవి ఉండోచ్చు. కొత్తలో వీటిని అంగీకరించి, తర్వాత తీరిగ్గా వాటి గురించి తన ప్రవర్తనలో మార్చుకోవడానికి ప్రయత్నించరు అని భార్య భర్తలు భాదపడడంలో అర్దం ఉండదు. భార్య భర్తలు ఇద్దరిలో ఒకరిలో ఒకరికి నచ్చని విషయాలను ఎప్పటికప్పుడు చర్చించుకోని పరిష్కరించుకోవాలి. ఇది మాత్రమే కాకుండా భార్య ఒక ముఖ్య విషయం మాట్లాడుతున్నప్పుడు భర్త తన ల్యాప్ టాప్‌ మీద పని చేసుకోవడం, పేపరు చదవడం లాంటివి చేస్తుంటే సహాజంగా ఆడవారి మనసు నోచ్చుకుంటుంది.

ఆసయమంలో ఈయనెప్పుడూ ఇంతే అని అతనితో మాట్లాడకుండా ఉండడం పరిష్కారం కానే కాదు. నువ్వు ఇలా చేస్తుంటే నన్ను మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపిస్తుందని చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా భార్య భర్తలు ఇద్దరూ వారి మనోభావాలను పరస్పరం పంచుకోవడం సంసారంలో చాలా ముఖ్యం. ఇంకోక ముఖ్య విషయం ఏమిటంటే మీరు మీభార్యతో గానీ, భర్తతోగానీ మాట్లాడేటప్పుడు అది గోడవకు దారితీయకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ఒక వేళ అలాంటిది ఏమైనా జరిగినా వెంటనే భార్యను బుజ్జగించో, బ్రతిమాలో మన దారికి తెచ్చుకోవాలి.

ఇది మాత్రమే కాకుండా గోడవ మొదలవుతుందేమో అని అనుమానం వస్తే ఏదో ఒక జోక్‌తో వాతావరణాన్ని కూల్ చేయాలి. మాట్లాడుతున్న అంశానికి సంబంధం లేని మరో విషయాన్ని ఎత్తుకోవడం, కోంత సేపు మౌనంగా ఉండడం ఇలాంటివి పాటిస్తే ఇబ్బంది ఉండదు. మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మీ గురించే అన్నది మరచిపోకూడదు. ఇంకోక విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి. మాట్లాడాడేటప్పుడు భార్యను తక్కవ చేసి మాట్లాడడం, మద్యలో నువ్వు, నేను లాంటి పదాలు రాకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది.

పెళ్శి అనే బంధం ద్వారా ఇద్దరి మద్య ఏర్పడే జీవిత కాల అనుబందమే భార్య భర్తలు. కాబట్టి మనల్ని నమ్ముకోని వచ్చినటువంటి వారికి మనం అన్యాయం చేయకూడదనే భావన మనం గుర్తుపెట్టుకోవాలి. నమ్మకం, ఇష్టా ఇష్టాలు, ప్రేమ మాత్రమే మన జీవితాన్ని ఆనంద డోలికల్లో తేలియాడడానికి ఉపయోగపడతాయి. దీనిని బట్టి మీ జీవితాయి మీ చేతుల్లోనే ఉన్నాయి. వాటిని సక్రమమైన మార్గంలో ఉంచుకోవాల్సిన భాద్యత కూడా మనదే. అంతేకాని కోపాలకు పోయి విడాకులు తీసుకుంటున్న సాప్ట్‌వేర్ జీవితాలు మరోసారి ఆలోచించాలి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X