Home
News

ఇండియాను మింగేస్తున్న చైనా, మరి ఇంతలా దిగజారి..?

ఇండియా డబ్బే, చైనా ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ. 84 వేల కోట్లు పై మాటే

భారత్‌ను డ్రాగన్ దేశం మింగేస్తోంది. ఇండియా ఆర్థిక వ్యవస్థతో పాటు మార్కెట్ ను చైనా కబళిస్తోంది. ప్రతి ఇంటా ఆ దేశ వస్తువులను డంప్ చేస్తోంది. ఇంకా షాకింగ్ వార్త ఏంటంటే ఆ దేశ వాణిజ్య లావాదేవీలు ప్రస్తుతం 71.5 బిలియన్ డాలర్లకు చేరడం. ఇది భారత వ్యాపారవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఇంతలా వ్యాపారం ఎందుకు పుంజుకుంటోంది. స్మార్ట్ లుక్కేద్దాం.

బుసలు కొడుతున్న డ్రాగన్

బుసలు కొడుతున్న డ్రాగన్

ఓ వైపు సరిహద్దులో సరిగమలు, మరో వైపు భారత వ్యాపార ఆక్రమణ. ఇది బుసలు కొడుతున్న డ్రాగన్ కంట్రీ తీరు. ప్రతి భారతీయుడి ఇంట్లో కారు చౌకౌన వస్తువులను ఈ కంత్రీ దేశం డంప్ చేస్తోంది.

భారత ఆర్థిక వ్యవస్థ కుదేల్

భారత ఆర్థిక వ్యవస్థ కుదేల్

దీని ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీంతో హోల్ సేల్ వ్యాపారులు ప్రతి వస్తువు దిగుమతి కోసం చైనాపై ఆధారపడుతున్నారు.

చైనా వస్తువులపైనే..

చైనా వస్తువులపైనే..

చైనా నుంచి చౌకగా అన్ని రకాల వస్తువుల దిగుమతితో పరిశ్రమల మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇది భారత్ లో చైనా సృష్టించిన కల్లోలం. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి మెషినరీ పార్ట్స్, మొబైల్స్, సోలార్ ప్యానల్స్ వరకు ఇప్పుడు చైనా వస్తువులపైనే ఆధారపడుతున్నారు.

షాక్ కొడుతున్న చైనా దిగుమతులు

షాక్ కొడుతున్న చైనా దిగుమతులు

ఫలితంగా 2010-11లో 43.5 బిలియన్ డాలర్లు ఉన్న చైనా దిగుమతులు 2016-17 నాటికి 61.3 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో చైనాకు ఎగుమతులు సుమారు 18.1-14.2 నుంచి ప్రస్తుతం 10.2కు పడిపోయాయి.

మొత్తంగా 71.5 బిలియన్ డాలర్ల మేర వ్యాపార లావాదేవీలు

మొత్తంగా 71.5 బిలియన్ డాలర్ల మేర వ్యాపార లావాదేవీలు

చైనా మొత్తంగా 71.5 బిలియన్ డాలర్ల మేర భారత్ తో వ్యాపార లావాదేవీలు ( అంచనా ) జరుపుతోంది. ఇందులో ప్రధానంగా ఎగుమతులు, దిగుమతుల మధ్య వాణిజ్య లోటు 2011-12లో -37.2 బిలియన్ డాలర్లు ఉండగా, గత ఆరేళ్లలో అది -51.1 బిలియన్ డాలర్లకు చేరింది.

భారత టెలికామ్ రంగంపై

భారత టెలికామ్ రంగంపై

ప్రధానంగా భారత టెలికామ్ రంగంపై చైనా దృష్టి పెట్టింది. భారత్ లోని 8 బిలియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 51శాతం చైనా నియంత్రణలో ఉంది.

 రూ.70 వేల కోట్ల టెలికా రంగ దిగుమతులు

రూ.70 వేల కోట్ల టెలికా రంగ దిగుమతులు

ఏడాదికి సుమారు రూ.70 వేల కోట్ల టెలికా రంగ దిగుమతులు చైనా నుంచి జరుగుతున్నాయి. భారత్ తో పాటు ప్రపంచ మార్కెట్ ను సొంతం చేసుకునేందుకు గత కొన్నేళ్లుగా చైనా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తోంది.

చైనా గత కొన్నేళ్లుగా

చైనా గత కొన్నేళ్లుగా

సొంత మల్టీ నేషనల్ కంపెనీలను సృష్టించి, అభివృద్ధి చేసి వాటిని రక్షించేందుకు చైనా గత కొన్నేళ్లుగా విధానపరమైన చర్యలు చేపట్టింది. అమెరికా కంపెనీలకు ధీటుగా సొంత సంస్థలను చైనా డెవలప్ చేసింది.

అమెజాన్ కు పోటీగా అలీబాబా

అమెజాన్ కు పోటీగా అలీబాబా

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కు పోటీగా అలీబాబా, గూగుల్ మాదిరిగా చైనా సొంత సెర్చ్ ఇంజిన్ బైదు, పాపులర్ సోషల్ మీడియా ఫేస్‌బుక్ కు దీటుగా ఉయ్ చాట్, ఆపిల్ ఫోన్లకు పోటీగా షియోమి మొబైల్స్ ను రంగంలోకి దించింది.

సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయలు

సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయలు

చైనా నుంచి మన దేశానికి దిగుమతులు అయిన విలువ సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.. ఈ మొత్తం పై చైనా ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో సుమారు 80 వేల కోట్లు ఆదాయం వస్తుంది.

ఆయుధాల విలువకి సమానం

ఆయుధాల విలువకి సమానం

80 వేల కోట్లు అంటే, మనదేశ రక్షణ కోసం మనం ఖరీదుచేసే ఆయుధాల విలువకి సమానం. మరి దీనికి పుల్‌స్టాప్ పెట్టాలంటే చైనా వస్తువులను కొనడం బ్యాన్ చేయాలి. అది జరగుతుందా అన్నదే మనముందున్న ప్రశ్న.

More from GizBot

Best Mobiles in India

English summary
Why Chinese electronics are selling like hot cakes Read more at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X