ఐఫోన్ల కోసం క్యూలు నిజం కాదా, వెలుగులోకి వచ్చిన వాస్తవాలు !

Written By:

ఆపిల్ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే ఎందుకు వినియోగదారులు ఇలా క్యూలో నిలబడుతున్నారు. చాలా మందికన్నా ముందుగానే తాము కొత్త ఫోన్‌ను అందుకోవలనా లేక ఆలస్యంగా వెళితే దొరకవనా, ఆపిల్‌ ఉత్పత్తులపైన ఉన్న క్రేజీనా ఇలా ఎన్నో అంశాలపై ఇప్పుడు కొన్ని వాస్తవాలు బయటకొచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు వీరిని ఇంటర్యూ చేయగా ఈ ఆసక్తికర అంశాలు తెలిసాయి.

కొత్త ఐఫోన్ కోసం కిడ్నీ తాకట్టు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ స్టోర్ల ముందు క్యూలో నిలుచుంటే..

ఆపిల్ స్టోర్ల ముందు క్యూలో నిలుచుంటే కొన్ని మీడియా సంస్థలు తమ ఫోటోలను వేస్తాయని అందుకే ముందు వరసలో ఉండేందుకు ప్రయత్నం చేస్తామని కొందరు తెలిపారు. అంటే మీడియాలో హైలెట్ అయ్యేవారు ఇలా లైన్లలో నిలబతారని ఇంటర్యూలో తేలింది.

తాము నిలబడ్డ చోటును..

కాగా ఇంకా ఎక్కువ మంది తాము నిలబడ్డ చోటును అమ్ముకుంటున్నారు. ఈ చోటు విలువ అంతా, ఇంతా కూడా కాదు. మూడు వేల నుంచి 30 వేల రూపాయల వరకు ఉంటోంది.

క్యూలో ముందున్న వ్యక్తి..

క్యూలో ముందున్న వ్యక్తి తన చోటును 30వేల రూపాయలకు విక్రయిస్తుండగా, పదవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎనిమిది నుంచి 15 వేల రూపాయల వరకు అమ్ముతున్నారని ఇంటర్యూలో తేలింది.

తమ యాప్స్‌ పబ్లిసిటీ కోసం..

కొందరు తమ యాప్స్‌ పబ్లిసిటీ కోసం ఈ క్యూలను కూడా ఉపయోగించుకుంటున్నారట. తమ యాడ్‌ కలిగిన టీషర్టులు ధరించి క్యూలో నిలబడిన వారికి, వారి వారి డిమాండ్ల మేరకు డబ్బులు చెల్లిస్తున్నారని తెలుస్తోంది.

శాంసంగ్ లాంటి పోటీ మొబైల్‌ ఫోన్‌ సంస్థలు ..

ఈ క్యూలను శాంసంగ్ లాంటి పోటీ మొబైల్‌ ఫోన్‌ సంస్థలు యాడ్స్‌ రూపంలో అపహాస్యం చేస్తున్నా వినియోగదారులు క్యూలో నిలబడేందుకే ఎక్కువగా చూపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఐఫోన్‌ ఆపిల్‌ ఎక్స్‌ విడుదల సందర్భంగా..

కొన్ని యాప్స్‌ సంస్థలు తమ వాలంటీర్లనే డబ్బులిచ్చి నిలబెడుతున్నాయి. ఇటీవల ఐఫోన్‌ ఆపిల్‌ ఎక్స్‌ విడుదల సందర్భంగా సిడ్నీలో క్యూలో ముందు నిలబడిన వ్యక్తి ‘యూట్యూబర్‌'. ఫోన్‌ విడుదలపై యూట్యూబ్‌ డాక్యుమెంటరీ తీయాలనుకున్నారు. అందులో ప్రధానంగా కనిపించడం కోసం మొదటి స్థానంలో నిలబడ్డారట.

రెండు, మూడోస్థానంలో నిలబడ్డవారు..

ఇక రెండు, మూడోస్థానంలో నిలబడ్డవారు ‘డెయిలీ మిర్రర్‌' వెబ్‌సైట్‌కు లైవ్‌ బ్లాగ్‌ను నిర్వహిస్తున్నారు. క్యూ వెనక ఇంత పెద్ద కథ ఉందని కొన్ని మీడియా సంస్థలు చేసిన ఇంటర్యూలో వెల్లడైంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Why do so many people queue up for hours at Apple stores when a new iPhone is launched? more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot