Home
News

ఇండియాలో షియోమి నంబర్‌వన్ వెనక కఠోర నిజాలు !

ఇప్పుడు ఇండియా మొబైల్ మార్కెట్‌ని శాసిస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా షియోమినే.

By Hazarath Aiah

ఇప్పుడు ఇండియా మొబైల్ మార్కెట్‌ని శాసిస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా షియోమినే. ఎన్నో ఏళ్ల నుంచి ఇండియాలో నంబర్ వన్ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ని మట్టి కరిపిస్తూ ఇండియాలో టాప్ లోకి దూసుకువచ్చింది. ఆ కంపెనీ నుంచి వచ్చే ప్రతి ఫోన్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయని కంపెనీ సగర్వంగా చెప్పుకుంటోంది. అయితే అది నిజమేనా..? షియోమి ఫోన్లు ఫ్లాష్ సేల్ కి వచ్చిన నిమిషంలోనే అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తున్నానే విషయం నిజమైనదేనా..ఇలాంటి ప్రశ్నలు అందరికీ సర్వ సాధారణంగా వస్తుంటాయి. అయితే షియోమి ఎప్పుడు తమ ఫోన్లను కాని ఉత్పత్తులను కాని మార్కెట్లోకి తీసుకువచ్చిన వెంటనే ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. ఈ కామర్స్ మార్కెట్లోకి వెళ్లదు. మరి దీని వెనుక ఉన్న మతలబు ఏంటి..ఎందుకు ఫ్లాష్ సేల్ వైపు షియోమి అంతగా ఆసక్తి చూపిస్తోంది అనే విషయాల మీద ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఫ్లాష్ సేల్ లెక్కల్లో నిజమెంత ?

ఫ్లాష్ సేల్ లెక్కల్లో నిజమెంత ?

షియోమి తన కంపెనీ నుంచి వచ్చిన ఏ ఫోన్ అయినా ఫ్లాష్ సేల్ ద్వారానే ప్రారంభిస్తుంది. అంటే వినియోగదారుడు నేరుగా కొనుక్కునే పరిస్థితి ఉండదు. షియోమి కంపెనీ ఏ టైంలో ఫ్లాష్ సేల్ పెడితే ఆ సమయానికి రెడీ కావాలని చెబుతూ ఉంటుంది. అయితే ఈ ఫ్లాష్ సేల్ కోసం అందరూ ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తుంటారు. ఫ్లాష్ సేల్ప ప్రారంభం కాగానే యూజరు సెలక్ట్ చేసుకునే లోపు అది అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది.

చాలా తక్కువ స్థాయిలో ఫోన్లను ..

చాలా తక్కువ స్థాయిలో ఫోన్లను ..

దీనికి ప్రధాన కారణం కంపెనీ చాలా తక్కువ స్థాయిలో ఫోన్లను ఫ్లాష్ సేల్ కింద పెడుతుంది. అయితే లక్షల్లో ఫోన్లు పెట్టామని తరువాత స్టేట్ మెంట్లు ఇస్తుంది. ఫ్లాష్ సేల్ లో మేము ఇన్ని ఫోన్లు పెడుతున్నామని నంబరు ఎక్కడా ప్రకటించదు. అలా ప్రకటిస్తే కంపెనీ మార్కెటింగ్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

నిమిషాల వ్యవధిలో అన్ని లక్షల ఫోన్లు అమ్ముడుపోవడం సాధ్యమేనా..

నిమిషాల వ్యవధిలో అన్ని లక్షల ఫోన్లు అమ్ముడుపోవడం సాధ్యమేనా..

తరువాత కంపెనీ లక్షల సంఖ్యలో ఫోన్లు అమ్ముడుపోయాయని ఇది షియోమి ఘన విజయం అని గొప్పలకు పోతుంది. అయితే కేవలం నిమిషాల వ్యవధిలో అన్ని లక్షల ఫోన్లు అమ్ముడుపోవడం సాధ్యమేనా అనే సందేహం చాలామందికి వస్తుంది. ఈ విషయంపై షియోమి చాలా తెలివిగా వ్యవహరిస్తుందని అర్థమవుతుంది. అంత తక్కువ టైంలో ఫోన్లు అమ్ముడుపోయాయంటే దానికి ఇంకా క్రేజ్ పెరిగి యూజర్లు మళ్లీ ప్లాష్ సేల్ కి రెడీ అవుతారని షియోమి నమ్మకం.

షియోమి ఆప్ లైన్ స్టోర్లను..

షియోమి ఆప్ లైన్ స్టోర్లను..

ఇక షియోమి ఆప్ లైన్ స్టోర్లను అసలు ముట్టుకోదు. కేవలం షియోమి సైట్లో మాత్రమే కొనమని చెబుతుంది. మరి ఫ్లాష్ సేల్ లో ఫోన్ సొంతం చేసుకోలేని వారు ఏం చేస్తారు. ఆఫ్ లైన్ స్టోర్ వైపు చూస్తారు. ఆఫ్ లైన్ స్టోర్ యజమానులు షియోమి ఫోన్లను బుక్ చేసి దాన్ని ఎక్కువ ధరకు అమ్మి ప్రయోజనం పొందుతారు. ఈ విషయాలను మాత్రం షియోమి అసలు పట్టించుకోదు.

వారంటీ విషయంలోషియోమి చాలా పూర్ ..

వారంటీ విషయంలోషియోమి చాలా పూర్ ..

వారంటీ విషయంలోషియోమి చాలా పూర్ అనే చెప్పాలి. ఆ కంపెనీ ఆధరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్లు దేశంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కొన్ని చోట్లు అసలు లేనే లేవు..ఇలా లేని చోట్ల మూడో పార్టీకి షియోమి సర్వీసును అప్పగించడంతో షియోమి యూజర్లు కొంచెం నిరాశకు గురిఅవుతున్నారు. షియోమి ఫోన్లకు సంబంధించిన మెటీరియల్ దొరకడం లేదని వారంటీ ఇవ్వడం లేదని యూజర్లు చాలా చోట్ల కంప్లయిట్లు చేస్తున్నారు.

ఫోన్లో ఏదైనా సమస్య వస్తే

ఫోన్లో ఏదైనా సమస్య వస్తే

ఇక షియోమి ఫోన్లో ఏదైనా సమస్య వస్తే ఇక అంతే సంగతులు. దానికి సంబంధించిన అసలైన పార్టులు కొన్ని చోట్ల అసలు దొరకవు. వేరే కంపెనీల పార్టులు వేసినా అది కొన్ని రోజులకు సతాయించడం మళ్లీ సమస్యలు రావడం షరా మాములేనని ఈ విషయంలో షియోమి బాగా వెనుకపడిందని యూజర్లు చెబుతున్నారు.

అప్పుడప్పుడు రూపాయి సేల్..

అప్పుడప్పుడు రూపాయి సేల్..

ఇక షియోమి అప్పుడప్పుడు రూపాయి సేల్ పెడుతుంది. మరి ఈ సేల్ కింద యూజర్లు ఎవరైనా ఫోన్ సొంతం చేసుకున్నారా అనేది కూడా సందేహాస్పదమే..క్షణాల్లో అవుట్ ఆఫ్ స్టాక్ అంటూ దర్శనమిస్తుంది. తరువాత నోటిఫై అనే ఆప్సన్ కనిపిస్తుంది. మళ్లీ ఫోన్ కోసం ప్రయత్నించాని సేమ్ సీన్ రిపీట్ అవుతూ వస్తూ ఉంటుంది. 

అత్యంత తక్కువ ధరకే ఫోన్లను అందిస్తున్న షియోమి రహస్యం ఏంటో తెలుసా..?

అత్యంత తక్కువ ధరకే ఫోన్లను అందిస్తున్న షియోమి రహస్యం ఏంటో తెలుసా..?

Disrupting the market
షియోమి తన ఫోన్లను కేవలం ఆన్ లైన్ మార్కెట్ ద్వారానే అమ్ముతోంది. దీనికోసం ఎటువంటి మార్కెటింగ్ కాని డీలర్స్ కు కాని అవకాశం ఇవ్వడం లేదు. అందువల్ల కంపెనీకి డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన ఖర్చులు పూర్తి స్తాయిలో సేవ్ అయినట్లే..ఇదొక మార్కెట్ సూత్రం.

Cost cutting

Cost cutting

షియోమి తన ఫోన్ల కోసం ఎటువంటి యాడ్స్ కాని అలాగే దానికి సంబంధించిన ట్రేడిషనల్ అడ్వర్టేజ్ మెంట్లు కాని ఇవ్వదు. మిగతా కంపెనీలు మాత్రం తమ ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే భారీగా దానికి అడ్వర్టేజ్ మెంట్ కల్పిస్తారు. దీనికి బోలెడంత ఖర్చు కూడా పెడతారు. అయితే ఈ విషయంలో షియోమి బిజినెస్ మైండ్ చాలా వేరనే చెప్పుకోవాలి. కేవలం సోషల్ మీడియా ద్వారానే షియోమి తన ఫోన్లకు ప్రచారం కల్పించుకుంటూ కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

Limited quantities

Limited quantities

షియోమి మార్కెట్లోకి ఫోన్ వదిలే సమయంలో Limited quantities సూత్రాన్ని అవలంభిస్తుంది. కొత్త ఫోన్ మార్కెట్లోకి వదిలేముందు పరిమిత సంఖ్యలో మాత్రమే యూనిట్లను తయారుచేసి వదులుతుంది. అదే ఇతర కంపెనీలు అమ్మకాలు సంగతి అటుంచి ఎక్కువ సంఖ్యలో ఫోన్లను ఉత్పత్తి చేస్తుంటాయి. అవి అమ్మకాలు జరపకపోతే భారీగా నష్టపోతుంటాయి. షియోమి ఇందుకు పూర్తిగా విరుద్ధం. డిమాండును బట్టి యూనిట్లను తయారుచేస్తుంది.

A Kindle-like business model

A Kindle-like business model

షియోమి కేవలం మొబైళ్లను మాత్రమే కాకుండా దానికి సంబంధించిన హార్డే‌వేర్, సాఫ్ట్‌వేర్ పార్టులను విక్రయిస్తుంది. తద్వారా కంపెనీ భారీ ఆదాయాలను కొల్లగొడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా షియోమి ఇదే బిజినెస్ ఫాలో అవుతూ ముందుకు వెళుతోంది. అయితే కొన్ని కంపెనీలు ఒక్కో దేశంలో ఒక్కో విధమైన విధానంతో ఫాలో అవుతున్నారు. అది ఒక్కోసారి ఫెయిల్యూర్ అయి మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయని షియోమికి అటువంటి సమస్య లేదని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తయారీ ఖర్చు

తయారీ ఖర్చు

చైనా అంటేనే లేబర్స్ కి పెట్టింది. పేరు. అక్కడ శ్రమదోపిడి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. మొబైల్ కి సంబంధించి అన్ని రకాల పార్టులను చైనాలో తయారుచేస్తూ ఉంటారు. ఇది కూడా షియోమికి బాగా కలిసివస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Why does a xiaomi phones go out of stock within seconds of going on sale more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X