Home
News

భూమికి వేల దూరంలో ఆస్టరాయిడ్స్,అయినా ప్రమాదం ఎందుకు ?

By Gizbot Bureau

సౌర కుటుంబంలో సూర్యుడు, గ్రహాలు వాటి ఉపగ్రహాలతోపాటు అనేక ఆస్టరాయిడ్లు ఉన్నాయి. మీటరు నుంచి కిలోమీటర్ల వ్యాసం ఉండే ఈ గ్రహశకలాలు వేగంగా ప్రయాణిస్తూ ఒక్కోసారి భూమికి అతి సమీపం నుంచి దూసుకెళ్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి భూగ్రహాన్ని ఢీకొట్టే ప్రమాదం కూడా ఉంది.

Why is earth at risk even though asteroids are traveling millions of miles away from us?

ఈ ముప్పును తప్పించేందుకు అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్)ను అభివృద్ధి చేస్తోంది. అయితే ఇది నాసా ఎందుకు అభివృద్ధి చేస్తోంది. ఇది అంత అవసరమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి దీని గురించి మనం కూడా తెలుసుకుందాం.

 నాసా డార్ట్

నాసా డార్ట్

భూగ్రహం వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్లను గుర్తించి, వాటిని ఆ కక్ష్య నుంచి మళ్లించే దిశగా నాసా డార్ట్ ను రూపొందిస్తోంది. ప్రస్తుతం ఇది ప్రాథమిక పరీక్ష దశలో ఉంది. ఈ విశ్వమంతా సౌరవ్యవస్థతో నిండి ఉంది. అందులో మనం జీవిస్తున్నాం. ఆ సౌర వ్యవస్థకి ఏ మాత్రం ప్రమాదం జరిగినా మనం బతకడం కష్టం.. ఆ సౌర వ్యవస్థ వెలుపలే వేల ఆస్టరాయిడ్స్ చక్కర్లు కొడుతున్నాయి. సౌరవ్యవస్థ చుట్టూ అవి తిరుగుతున్నాయి.

 కాలం చెల్లిన వాటితోనే చిక్కు

కాలం చెల్లిన వాటితోనే చిక్కు

వాటిలో కొన్ని కాలం చెల్లినవి ఉన్నాయి. అలాగే కొన్ని పరిశోధనలు సాగిస్తున్నాయి. ఈ పరిశోధనలు సాగించే వాటితో మనకు ఎటువంటి ప్రమాదం లేదు. ఎందుకంటే అవి శాస్ర్తవేత్తల నియంత్రణలో ఉంటాయి. వచ్చిన చిక్కంతా కాలం చెల్లిన వాటితోనే. వీటితో శాస్ర్తవేత్తలకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. అవి ఏ క్షణాన్నైనా భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉంది. అప్పుడు తీరని నష్టం జరుగుతుంది.

ఫుట్‌బాల్ మైదానం సైజు ఉన్న ఆస్టరాయిడ్

ఫుట్‌బాల్ మైదానం సైజు ఉన్న ఆస్టరాయిడ్

అయితే విశ్వంలో గతి తప్పి భూమి వైపు దూసుకొచ్చే ఆస్టరాయిడ్స్ గురించి సైంటిస్టులు ఎంతో ముందుగానే అంచనా వేస్తారు. అది ఎప్పుడు భూమిని దాటి వెళ్తుందన్న దానిపై వాళ్లకు స్పష్టత ఉంటుంది. అయితే ఈ మధ్య అందుకు భిన్నంగా జరిగింది. మొన్న వీకెండ్‌లో ఓ ఫుట్‌బాల్ మైదానం సైజు ఉన్న ఆస్టరాయిడ్ భూమి పక్కగా వెళ్లిందని చాలా మందికి తెలియదు. నాసా శాస్త్రవేత్తలకే అది వచ్చే కొన్ని గంటల ముందు తెలిసింది. ఆరిజోనాలోని నాసా అబ్జర్వేటరీలో ఉన్న సైంటిస్టులు 21 గంటల ముందే అది భూమి వైపు దూసుకొస్తున్నదని గుర్తించారు.

ఖండమంతా నాశనమయ్యేది

ఖండమంతా నాశనమయ్యేది

2018 జీఈ3 అనే ఈ ఆస్టరాయిడ్ ఈస్టర్న్ డేలైట్ టైమ్ ప్రకారం ఆదివారం తెల్లవారుఝామున 2.41 గంటలకు భూమికి దగ్గరగా వచ్చినట్లు స్పేస్.కామ్ వెబ్‌సైట్ వెల్లడించింది. గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్లింది. ఇది 47 నుంచి వంద మీటర్ల వెడల్పు ఉన్నట్లు సైంటిస్టులు తెలిపారు. ఇది 1908లో రష్యాలోని సైబీరియా ప్రాంతంలో పడిన ఆస్టరాయిడ్ కంటే 3.6 రెట్లు పెద్దది కావడం గమనార్హం. అప్పట్లో ఈ ఆస్టరాయిడ్ హిరోషిమాపై పడిన అటామిక్ బాంబ్ కంటే 185 రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేసింది. మొన్న దగ్గరగా వెళ్లిన ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టి ఉంటే.. ఓ ఖండమంతా నాశనమయ్యేదని స్పేస్ వెబ్‌సైట్ అంచనా వేసింది.

 సెకనుకు ఆరు కిలోమీటర్ల వేగంతో

సెకనుకు ఆరు కిలోమీటర్ల వేగంతో

ఈ ముప్పును తప్పించుకోవడానికి నాసా ఈ ప్రయోగాలను చేస్తోంది. నాసా డెవలప్ చేసే డార్ట్ మిషన్ భూమి వైపు దూసుకువచ్చే గ్రహశకలాలకు ఎదురెళ్లి వాటిని భస్మీపటలం చేయగలదు. రిఫ్రిజరేటర్ పరిమాణంలో ఉండే ఈ స్పేస్ క్రాఫ్ట్ సెకనుకు ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి వాటిని టార్గెట్ చేయగలదు. ఫలితంగా సదరు ఆస్టరాయిడ్ గమన వేగం స్వల్పంగా మారుతుంది. కొద్దిపాటి ఈ మార్పే భూమికి, ఆస్టరాయిడ్కు మధ్య దూరాన్ని పెంచనుంది. తద్వారా భూమికి ఆస్టరాయిడ్ ముప్పు తప్పుతుంది.

Best Mobiles in India

English summary
Why is earth at risk even though asteroids are traveling millions of miles away from us?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X