ఫ్లిప్‌కార్ట్ రూ 9 కోట్ల మోసం, కేసు నమోదుతో షాక్..

Written By:

ప్రముఖ దేశీ ఈ-కామర్స్‌ సంస్థ 'ఫ్లిప్‌కార్ట్‌' వ్యవస్థాపకులపై కేసు నమోదయ్యింది. ఈ హఠాత్ పరిణామంతో సచిన్‌ బన్సాల్‌, బిన్నీ బన్సాల్‌ ఇరకాటంలో కూరుకుపోయారు. సంస్థ వ్యవస్థాపకులు సచిన్‌ బన్సాల్, బిన్నీ బన్సాల్‌ సహా ముగ్గురు టాప్‌ ఎగ్జిక్యూటివ్స్‌ తనకు రూ.9.96 కోట్ల మేర మోసం చేశారంటూ బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నవీన్‌ కుమార్‌ కేసు పెట్టారు. వీరితో పాటు. టాప్‌ ఎగ్జిక్యూటివ్స్‌లో సేల్స్‌ డైరెక్టర్‌ హరి, అకౌంట్స్‌ మేనేజర్లు సుమిత్‌ ఆనంద్, శారౌక్యు ఉన్నారు.

జియో నుంచి మరో శుభవార్త, కొందరికి మాత్రమే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.9.96 కోట్ల బకాయిలను..

ల్యాప్‌టాప్‌లను, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను సరఫరా చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌తో కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నానని అయితే 12,500 ల్యాప్‌టాప్‌లకు సంబంధించి రూ.9.96 కోట్ల బకాయిలను చెల్లించకుండా తనను మోసం చేశారంటూ వ్యాపారవేత్త నవీన్‌ కుమార్‌ ఆరోపించాడు.

బిగ్‌ బిలియన్‌ డే సేల్‌కు..

బిగ్‌ బిలియన్‌ డే సేల్‌కు 2015 జూన్‌ నుంచి 2016 జూన్‌ వరకు 14వేల ల్యాప్‌టాప్‌లను ఇతను కంపెనీకి సరఫరా చేశాడు. కాగా 1,482 యూనిట్లను ఫ్లిప్‌కార్ట్‌ రిటర్న్‌ చేసిందని, కానీ మిగతా యూనిట్లకు చెల్లింపులు చేయలేదని ఆయన తెలిపారు.

టీడీఎస్‌, షిప్పింగ్‌ ఛార్జీలను ..

వీటికి సంబంధించి టీడీఎస్‌, షిప్పింగ్‌ ఛార్జీలను చెల్లించలేదన్నాడు. బకాయిలను చెల్లించాలను అడిగితే, ఫ్లిప్‌కార్ట్‌ మరో 3,901 యూనిట్లను రిటర్న్‌ చేసిందని, కానీ బకాయిలను చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇందిరానగర్‌ పోలీసులు..

బెంగుళూరులో ఈ ఘటన జరగడంతో ఇందిరానగర్‌ పోలీసులు ఐపీసీ సెక్షన్స్‌ 34, 406, 420 కింద వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.అయితే ఇంతరవకూ ఈ విషయమై ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఎటువంటి ప్రతిస్పందనా రాలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Why Flipkart founders are booked for cheating case More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot