జయహో భారత్.. నేషనల్ టెక్నాలజీ డే స్పెషల్

జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్ అంటూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోన్న భారత్, ఈ రోజు నేషనల్ టెక్నాలజీ డేను ఘనంగా జరుపుకుంటోంది. టెక్నాలజీ విభాగంలో భారత్ నమోదు చేసిన విజయాలకు సంకేతంగా 1999 నుంచి ఏటా టెక్నాలజీ దినోత్సవాన్ని నిర్వహించుకోవటం జరుగుతోంది. మే 11వ తేదీని నేషనల్ టెక్నాలజీ డేగా ప్రకటించడం వెనకున్న దాగి ఉన్న ఆసక్తికర కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Read More : విడుదలకు ముందే దుమ్మురేపుతోన్న OnePlus 5

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1998, మే 11..

1998, మే 11వ తేదీన భారత్ శక్తి-1 న్యూక్లియర్ మిస్సైల్‌ను రాజస్థాన్‌లోని పోక్రాన్ ప్రాంతంలో విజయవంతంగా పరీక్షించగలిగింది. ఈ ఆపరేషన్‌కు భారత క్షిపణి పితామహుడైన డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం నేతృత్వం వహించారు. Pokhran-II ఆపరేషన్‌లో భాగంగా రెండు రోజుల తరువాత మరో రెండు న్యూక్లియర్ వెపన్లను ఇదే ప్రాంతంలో భారత్ విజయవంతంగా పరీక్షించగలిగింది.

న్యూక్లియర్ క్లబ్‌లో చేరిన 6వ దేశంగా భారత్

ఈ విజయంతో భారత్‌ను న్యూక్లియర్ స్టేట్‌గా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రకటించారు. దీంతో న్యూక్లియర్ క్లబ్‌లో చేరిన 6వ దేశంగా భారత్ నిలిచింది. అప్పటికే.. యూఎస్, రష్యా, యూకే, ఫ్రాన్స్ ఇంకా చైనాలు న్యూక్లియర్ క్లబ్‌లో ఉన్నాయి.

మొట్టమొదటి దేశీయ ఎయిర్ క్రాఫ్ట్ Hansa-3

మే 11, 1998న భారత దేశపు మొట్టమొదటి దేశీయ ఎయిర్ క్రాఫ్ట్ Hansa-3ని కూడా బెంగళూరులో విజయవంతగా పరీక్షించటం జరిగింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ను నేషనల్ ఏరోస్పేస్ లేబరెటరీస్ అభివృద్ధి చేసింది. రెండు సీట్లను మాత్రమే కలిగి ఉండే ఈ లైట్ వెయిట్ వెహికల్స్‌ను పైలెట్ ట్రెయినింగ్, స్పోర్ట్స్, సర్వైలెన్స్, ఏరియల్ ఫోటోగ్రఫీ ఇంకా పర్యావరణ సంబంధిత ప్రాజెక్టులో ఉపయోగించుకునే వీలుంటుంది.

సరిగ్గా ఇదే రోజున..

సరిగ్గా ఇదే రోజున డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కూడా తన త్రిశూల్ మిసైల్‌కు సంబంధించి ఫైనల్ టెస్ట్ - ఫైర్‌ను పూర్తి చేసుకుంది. అనంతనం ఈ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీకి అప్పగించటం జరిగింది.

ఇటు అంతరిక్ష పరిశోధనల్లోనూ..

ఇటు అంతరిక్ష పరిశోధనల్లోనూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది. దాదాపు ఐదు దశాబ్దాల చరిత్రలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వందకు పైగా మైలురాళ్లను దాదాపు 125 పైచిలుకు ప్రయోగాలతో అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. 

1999 నుంచి ప్రతి ఏటా మే 11వ తేదీన..

ప్రతి ఏటా మే 11వ తేదీన నిర్వహించే టెక్నాలజీ దినోత్సవాన్ని పురస్కరించుకుని టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ దేశానికి ఉపయోగపడే విధంగా రూపొందించబడిన సాంకేతిక ఆవిష్కరణలను సత్కరించి వాటికి గుర్తింపును కల్పిస్తోంది. 

ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన థీమ్‌తో..

నేషనల్ టెక్నాలజీ డేను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఓ ప్రత్యేకమైన థీమ్‌ను కూడా క్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ ఏడాదిగాను ‘Technology for inclusive and sustainable growth'పేరుతో థీమ్ ను టీడీబీ ఆవిష్కరించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Why India celebrates National Technology Day on May 11, and its theme for 2017. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot