ఫేస్‌బుక్ ఏలా వచ్చింది..?
కోట్టాది యూజర్లతో దేశదేశాలను కలగలపుతూ దిగ్గజ సామాజిక నెట్‌వర్కింగ్ సైట్‌గా గుర్తింపు తెచ్చుకున్న
ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ ’గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్’గా రూపాంతరం చెందింది. 30 రోజుల వ్యవధిలనో ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది.
ఫేస్‌బుక్‌లో 8 కోట్ల బోగస్ ఆకౌంట్లు!
న్యూయార్క్: అవును మీరు వింటున్నది నిజమే..ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో నకిలీ ఆకౌంట్లు కూడా ఉన్నాయట!. ఈ విషయాన్ని స్వయంగా ఫేస్‌బుక్కే వెల్లడించింది. ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా 95.5 కోట్ల మంది యూజర్లు ఉంటే అందులో దాదాపు 8.7 శాతం (ఇంచు మించు 8.3 కోట్లు ఆకౌంట్లు) నకిలీవని అమెరికన్ స్టాక్ మార్కెట్ల రగ్యుటేలర్ సెక్యూరిటీస్ ఎక్స్సేంజ్ కమిషన్ ప్రకటించింది. మొత్తం అకౌంట్లలో 4.8 శాతం డూప్లికేట్ అకౌంట్లని, అదనపు అకౌంట్ కింద యూజర్లు వీటిని ఉపయోగిస్తుంటారని తెలిపింది.
వీటితో పాటు నకిలీ అకౌంట్లు కూడా ఉన్నాయని, ప్రత్యేక వ్యాపకం లేదా వ్యాపారం కోసం నకిలీ అకౌంట్లను కొంతమంది సృష్టిస్తుంటారని ఫేస్‌బుక్ సదరు ప్రకటనలో తెలిపింది. వీటిని స్పామ్ అకౌంట్లుగా భావిస్తామని ఈ సంస్థ స్పష్టం చేసింది. జూన్ 30 నాటికి మొత్తం యూజర్లలో నకిలీ అకౌంట్లు 2.4 శాతం ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో నకిలీ అకౌంట్ల సంఖ్య తక్కువ కాగా ఇండోనేషియా, టర్కీ వంటి దేశాల్లో ఈ తరహా అకౌంట్లు ఎక్కువగా ఉన్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. రెండో త్రైమాసికంలో బ్రెజిల్, ఇండియా, ఇండోనేషియాలలో ఫేస్‌బుక్ ప్రాచుర్యం పెరిగిపోయిందని, మెరుగైన వృద్ధిరేటుకు ఈ మార్కెట్లే కారణమని వివరించింది.


Click it and Unblock the Notifications