ఆకాశానికి అన్న, పాతాళానికి తమ్ముడు, తేడా ఎక్కడుంది..?

Written By:

దేశంలో టాప్ టెన్ బిజినెస్ మెన్ పేర్లను ఓసారి పరికించి చూస్తే అందులో అంబాని బ్రదర్స్ తప్పకుండా ఉంటారు. ఇద్దరూ దేశ టెలికం రంగంలో సంచలనాలు నమోదు చేసినవారే. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న సత్యాన్ని రుజువు చేస్తూ అన్న భారీ లాభాలతో వ్యాపారంలో ఆకాశాన్ని తాకగా, తమ్ముడు అనిల్ అంబాని వ్యాపార సామ్రాజ్యంలో పాతాళానికి దిగజారారు. మరి ఎందుకలా జరిగిందనే దానిపై అనేక కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు.

నడిసంద్రంలో అనిల్ అంబాని, ఆర్‌కామ్ పయనమెటు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు గ్రూపు సంస్థల విలువ ..

రిలయన్స్ గ్రూపు రెండుగా విడిపోయేనాటికి ముకేశ్, అనిల్‌ అంబానీల రెండు గ్రూపు సంస్థల విలువ దాదాపుగా చెరో రూ.లక్ష కోట్లు. కాగా నేడు జియో అధినేత సంపద రూ. 6 లక్షల కోట్లకు చేరగా, ఆర్‌కామ్ అధినేత సంపద రూ.50వేల కోట్లకు పరిమితమైంది.

ఏడాదికేడాది పెరుగుతున్న అప్పులు

కాగా ఏడాదికేడాది పెరుగుతున్న అప్పులు కూడా అనిల్ అంబాని కొంపముంచాయి. 2009-10లో రూ.25,000 కోట్లుగా ఉన్న రుణాలిపుడు రూ.45వేల కోట్లయి అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

అనిల్‌ అంబానీ తాజాగా ఓ ప్రకటన..

అప్పుల దెబ్బకు తాళలేక ఆర్‌కామ్‌కు ప్రస్తుతం ఉన్న టెలికం, స్పెక్ట్రమ్, టవర్‌ ఆస్తులను అమ్మేసి వచ్చే ఏడాది మార్చికి రూ.25,000 కోట్ల మేర అప్పులు తీర్చనున్నట్టు అనిల్‌ అంబానీ తాజాగా ఓ ప్రకటన కూడా చేశారు.

ముకేష్ అంబాని అడుగుపెట్టిన చోటల్లా..

ఇక అనిల్ అంబానీకి భిన్నంగా ముకేష్ అంబాని అడుగుపెట్టిన చోటల్లా బంగారం అయి కూర్చుంది. రిటైల్‌ రంగం నుంచి పెట్రోలియం వ్యాపారం దాకా అంతా లాభాలమయమే.

తాజాగా జియోతో..

ఇక తాజాగా జియోతో వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా పరుగులు పెట్టించారు. పేమెంట్స్‌ బ్యాంక్, పేమెంట్స్‌ యాప్, న్యూస్, మూవీస్, ఫైబర్‌ ఇంటర్నెట్, గాడ్జెట్స్‌ తదితర రకరకాల ఫార్మాట్లకు అవకాశమిస్తూ టెలికాం రంగంలో దూసుకుపోతోంది.

సరికొత్త వ్యూహాలతో ..

కాలం కలిసిరావడం లేదనడం కన్నా చేతులారా రిలయన్స్ కమ్యూనికేషన్ నష్టాలను కొని తెచ్చుకున్నదంటూ ఆర్థిక రంగ నిపుణులు సైతం చెబుతున్నారు. కాగా ఇప్పుడు అనిల్ అంబానీ సరికొత్త వ్యూహాలతో మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు.

షేర్ మార్కెట్లో ఆర్‌కామ్ విలువ..

ఈ మధ్య షేర్ మార్కెట్లో ఆర్‌కామ్ విలువ అమాంత పెరిగి ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. మరి ముందు ముందు అన్న బాటలో నడిచి ఆర్‌కామ్ సామ్రాజ్యాన్ని పాతాళం నుంచి ఆకాశానికి తీసుకువెళ్లే అవకాశాలు దగ్గర్లోనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Why is Mukesh Ambani more successful than Anil Ambani Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot